వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో వ్యాపారుల జాతీయ సంక్షేమ సంఘం మూడవ సమావేశాలు
प्रविष्टि तिथि:
12 JUL 2024 4:10PM by PIB Hyderabad
వ్యాపారుల జాతీయ సంక్షేమ సంఘం (ఎన్.టీ.డబ్ల్యూ.బీ.) మూడవ సమావేశాలు శ్రీ సునీల్ జే. సింఘీ అధ్యక్షతన న్యూఢిల్లీ వాణిజ్య భవన్ లో జులై 11, 2024 న జరిగాయి.
సమావేశాల సందర్భంగా ‘పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం’ (డీపీఐఐటీ) వెబ్సైట్ కు సంబంధించిన ‘ఓపెన్ వీసీ లింక్’ ను ప్రారంభించారు. ఈ లింక్ ద్వారా దేశంలోని వ్యాపారులతో ప్రతి వారం అనుసంధానమయ్యే వీలు కలుగుతుంది. వీసీ (వీడియో కాన్ఫరెన్స్) అనుసంధానం ద్వారా ప్రతివారం వ్యాపారులు ఎన్.టీ.డబ్ల్యూ.బీ.తో సంభాషించి రీటైల్ వ్యాపారాల్లో తమకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలియచేయవచ్చు.
సభ్యులు, వ్యాపార సంఘాల నుండి అందిన విన్నపాలను, పరిష్కారం నిమిత్తం ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల దృష్టికి తీసుకువెళ్ళినట్లు శ్రీ సింఘీ సమావేశంలో వెల్లడించారు. రీటైల్ వ్యాపారాల సంక్షేమార్ధం చేపట్టిన పలు చర్యల గురించి అవగాహన, అందజేతల విషయంలో సభ్యుల నుండి సలహాలు సూచనలను స్వీకరించారు.
వ్యాపార సంఘాలు, రాష్ట ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నియమించిన అనధికారిక సభ్యులు, తొమ్మిది మంత్రిత్వ శాఖల/విభాగాలకు చెందిన అధికారిక సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2032920)
आगंतुक पटल : 57