సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిబ్బంది విధుల నిర్వహణ, ప్రభుత్వ పాలన అంశాల పై శిక్షణ : పరస్పర సహకారం పై భారత్, శ్రీలంక చర్చలు ఫలప్రదం


ద్వైపాక్షిక సహకారాన్ని బలపరచుకోవడం కోసం భారతదేశానికి చెందిన పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి), సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్ సిజిజి) కి చెందిన ఉన్నతస్థాయి అధికారుల ప్రతినిధి బృందం 2024 జులై 7 నుంచి 9 వరకు శ్రీలంక లో పర్యటించింది


శ్రీలంక పరిపాలన సేవా అధికారులకు సామర్థ్యం పెంపుదల కు ఉద్దేశించి కార్యక్రమాలను 2024-2029 మధ్య కాలంలో భారతదేశం లో నిర్వహించడం కోసం సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి), శ్రీలంక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఎల్ఐడిఎ) ల మధ్య సహకారానికి మార్గసూచీ రూపకల్పనపై ఇరు పక్షాలు చర్చించాయి; ఫేకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములు, జిల్లా కలెక్టర్ స్థాయి చర్చలను జరపాలనే అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి



డిఎఆర్‌పిజి కార్యదర్శి, ఎన్‌సిజిజి డిజి శ్రీ వి. శ్రీనివాస్ శ్రీలంక ప్రధాని శ్రీ దినేష్ చంద్ర రూపసింఘె గుణవర్థన తో భేటీ కావడమే కాక శ్రీలంక ప్రభుత్వ సీనియర్ అధికారులతోనూ సమావేశమయ్యారు

Posted On: 11 JUL 2024 11:25AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సిబ్బంది,  ప్రజా ఫిర్యాదులు, పింఛన్ ల మంత్రిత్వ శాఖ, పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి) ల కార్యదర్శి, సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి)   డైరెక్టర్ జనరల్ శ్రీ వి. శ్రీనివాస్ఐఎఎస్ నాయకత్వం లో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం 2024 జులై 7 నుంచి 9 వరకు శ్రీలంక లో తన ఆధికారిక పర్యటన ను విజయవంతంగా ముగించింది.  ఈ పర్యటన లో భాగం గా జరిగిన చర్చలువ్యూహాత్మక సమావేశాలు ఫలవంతమయ్యాయి.  శ్రీలంక లో సీనియర్ ప్రభుత్వ అధికారులకు సామర్థ్యాల పెంపుదల తో పాటు ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకొనేందుకు మార్గాన్ని ఈ పర్యటన సుగమం చేసింది. 

 జిల్లా కలెక్టర్ స్థాయి సమావేశాలుఫేకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాములు సహా 2024 - 2029 సంవత్సరాల మధ్య కాలంలో 1500 మంది శ్రీలంక అడ్మిస్ట్రేటివ్  సర్వీస్ ఆఫీసర్ లకు  సామర్థ్యం పెంపుదల కార్యక్రమాలను నిర్వహించడం కోసం సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్ సిజిజి)శ్రీలంక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన మార్గసూచీ పై ఉభయ పక్షాలు చర్చించాయి. 

 కొలంబో లో 2024 జులై 7 నుంచి 9 వరకు సాగిన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత బృందం గౌరవనీయ ప్రధాని శ్రీ దినేష్ చంద్ర రూపసింఘె గుణవర్థన తో పార్లమెంట్ ప్రాంగణంలో భేటీ అయింది.  ఈ సమావేశం సుదృఢమైన ద్వైపాక్షిక సంబంధాలను, శ్రీలంక లో ప్రస్తుతం అమలవుతున్న పాలన సంస్కరణల విషయంలో భారతదేశం తాను అనుసరిస్తున్న ‘‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’’ విధానంలో భాగంగా అచంచల నిబద్ధత చాటడాన్ని నొక్కిచెప్పింది.  ప్రతినిధివర్గం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార ప్రధాన ప్రయత్నాలను మరింతగా పటిష్ట పరచుకోవడం కోసం ప్రెసిడెంట్స్ సెక్రటరీ శ్రీ ఇ.ఎమ్.ఎస్.బి. ఏకనాయకె తో, ప్రధాని కార్యదర్శి శ్రీ అనూర దిశనాయకె తో, ప్రజా పాలనదేశీయ వ్యవహారాలు, ప్రొవిన్సియల్ కౌన్సిల్ , స్థానిక ప్రభుత్వం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ యశరత్నె తోను సమావేశమైంది. 

 భారతదేశ ప్రతినిధివర్గం శ్రీలంక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఎల్ఐడిఎ) డైరెక్టర్ జనరల్ శ్రీ నాలకా కాలువేవే నిసీనియర్ ఫేకల్టీ ని కూడా కలుసుకొంది.  అంతేకాకుండాశ్రీలంక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల తో భవిష్యత్ తరం పాలన సంబంధ సంస్కరణల అమలుకు సంబంధించిన ఉత్తమ విధానాల గురించి వెల్లడించింది.  శ్రీలంక లో సీనియర్మధ్య స్థాయి అధికారుల కోసం ఎన్‌సిజిజి సామర్థ్య నిర్మాణంశిక్షణ ప్రధానమైన కార్యక్రమాలను మూడింటిని నిర్వహించింది.  ఎన్‌సిజిజి ని 2024 ఫిబ్రవరి 12 నుంచి  17 వరకు శ్రీలంక కు చెందిన పద్నాలుగు మంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులతో కూడిన ఒక ప్రతినిధి వర్గం తొలిసారిగా సందర్శించింది.  ఈ ప్రతినిధివర్గానికి ప్రధాని కార్యదర్శి శ్రీ అనూర దిశనాయకె నాయకత్వం వహించారు.  ఎన్‌సిజిజి ఇంతవరకు శ్రీలంక కు చెందిన మొత్తం 95 మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ను ఇచ్చింది.  ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు సుపరిపాలనను ఉన్నత స్థాయికి చేర్చుతుందని ఆశించవచ్చు. 

ఎస్ఎల్ఐడిఎ  ప్రధాన సభాభవనంలో ‘‘కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ:  ఎస్ఎమ్ఎఆర్‌టి (స్మార్ట్) ప్రభుత్వానికి గాను ఒక పునాది’’ అనే విషయం పై శ్రీ వి. శ్రీనివాస్ తన ఉపన్యాసంలో అనేక అవగాహన భరితమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావించారు.  ఈ కార్యక్రమం లో శ్రీలంక కు చెందిన 150 మందికి పైగా సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.  ఈ సమావేశం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లోని మేలైన మార్పులతో పాటు ఈ వ్యవస్థకు శ్రీలంక లో ప్రజా పాలన  పరంగా ఎంతగా అనుసరణీయమో వివరించారు.

 జననవివాహమరణ సంబంధ ధ్రువ ప్రతాలు సహా అన్ని కీలక పత్రాలను జారీ చేసే రిజిస్ట్రార్ విభాగం పనితీరును పరిశీలించడానికి ప్రతినిధివర్గం కొలంబో జిల్లా సచివాలయాన్ని తింబిరిగాసయా డివిజనల్ సచివాలయాన్ని సందర్శించింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడే పలు అంశాలపై సీనియర్ అధికారులతో చర్చలు జరిగాయి.

  

శ్రీలంక లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం పెంపుదల కోసం కార్యక్రమాలను నిర్వహించడానికి ఎస్ఎల్ఐడిఎ కుఎన్‌సిజిజి కి మధ్య అయిదు సంవత్సరాల కాలం లో (2024 నుంచి 2028 వరకు) సహకారానికి గాను ఒక స్పష్టమైన మార్గసూచీని ఖరారు చేయడంతో రెండు రోజుల ఆధికారిక పర్యటన ఫలప్రదమైంది.  దీనితో సార్వజనిక సేవ సంబంధ కార్యకుశలతను పెంపొందింప చేయడంలో తోడ్పాటు లభించనుంది.  సార్వజనిక సేవల అందజేత లో సామర్థ్య నిర్మాణ వికాసం, ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణల పరంగా బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడం కోసం రెండు దేశాలు వాటి పూర్తి నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

  

ఈ ప్రతినిధివర్గంలో డిఎఆర్‌పిజి సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్.బి.ఎస్. రాజ్ పూత్, ఎన్‌సిజిజి అసోసియేట్ ప్రొఫెసర్  డాక్టర్ ఎ.పి. సింగ్,  ఎన్‌సిజిజి ముఖ్య పాలనాధికారిసలహాదారు ప్రిస్కా మేథ్యూ లతో పాటు ఎన్‌సిజిజి రిసర్చ్ అసోసియేట్  డాక్టర్ ముఖేష్ భండారి లు ఉన్నారు.

 

***



(Release ID: 2032430) Visitor Counter : 36