నీతి ఆయోగ్
ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ యొక్క ఒక కీలక ఇన్షియేటివ్ అయిన ఫైనాన్సింగ్ ఉమెన్ కొలాబొరేటివ్ రెండవ సమావేశం
Posted On:
05 JUL 2024 6:52PM by PIB Hyderabad
మహిళా పారిశ్రామికవేత్తలకు ఫైనాన్స్ యాక్సెస్‌ను వేగవంతం చేయుటలో గల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించడం కోసం సంబంధిత వాటాదారులతో నిర్వహించబడిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యు.ఇ.పి.) యొక్క ఒక ముఖ్య ఇన్షియేటివ్ అయిన ఫైనాన్సింగ్ ఉమెన్ కొలాబొరేటివ్ రెండవ సమావేశానికి ముంబాయి ఆతిథ్యమిచ్చింది. ఈ సమావేశాన్ని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (టి.యు.సిబిల్), మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎమ్.ఎస్.సి)ల భాగస్వామ్యంతో డబ్ల్యు.ఇ.పి. నిర్వహించింది. ఈ కార్యక్రమం 5 జూలై 2024న ముంబాయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. నీతి ఆయోగ్, ఆర్.బి.ఐ., ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎమ్.ఎస్.ఎమ్.ఇ. మంత్రిత్వ శాఖ, ఎస్.ఐ.డి.బి.ఐ., ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలు, సి.ఎస్.ఓ.లు/ఎన్.జి.వో.లకు చెందిన సీనియర్ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు సహా ముఖ్య ప్రముఖులు దీనిలో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు వివిధ ప్రైవేట్ రంగ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2018లో ఒక అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన డబ్ల్యు.ఇ.పి, 2022 నాటికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి మారింది. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని సాకారం చేయడం కోసం భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల వ్యవస్థను బలోపేతం చేయడం ఇది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది మహిళా పారిశ్రామికవేత్తల కోసం గొప్ప ప్రభావం చూపేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వ, వ్యాపార, దాతృత్వ, పౌర సమాజ వ్యవస్థలలోని వాటాదారులందరూ సులభంగా విస్తరించగల, సుస్థిరమైన, ప్రభావవంతమైన కార్యక్రమాల కోసం సహకారం అందిస్తూ, కలిసి పనిచేస్తూ, వాటికి అనుగుణంగా ముందుకుసాగేందుకు ఒక వేదికను అందిస్తుంది. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడం కోసం 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వాములను డబ్ల్యు.ఇ.పి. కలిగి ఉంది.
ఎఫ్.డబ్ల్యు.సి, భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఫైనాన్స్ యాక్సెస్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా సెప్టెంబర్ 2023లో ప్రారంభించబడిన డబ్ల్యు.ఇ.పి. యొక్క ఒక ఇన్షియేటివ్. దీనికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.ఐ.డి.బి.ఐ.) అధ్యక్షత వహిస్తుంది అలాగే టి.యు. సిబిల్ సహ-అధ్యక్షత వహిస్తుండగా, ఎమ్.ఎస్.సి దాని సెక్రటేరియట్‌గా ఉంది. మహిళలకు అండగా ఉండే ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఎఫ్.డబ్ల్యు.సి మహిళా వ్యాపారవేత్తలతో కలిసి పనిచేసే ఆర్థిక సేవా రంగాన్ని, సంస్థలను ఏకీకృతం చేస్తున్నది.
ఎఫ్.డబ్ల్యు.సి విధానంలో భాగంగా ఉండేవి a) మహిళల కోసం ఫైనాన్స్ యాక్సెస్‌ను బలోపేతం చేయడంలో సహకారాన్ని మరియు నిబద్ధతను పెంపొందించడం, b) మార్గదర్శనం, సామర్థ్యాల పెంపు, వనరుల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల క్రెడిట్ సంసిద్ధతను మెరుగుపరచడం, c) మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా పరిశోధనల ఆధారాలను మరియు మంచి పద్ధతులను వ్యాప్తి చేయడం మరియు పంచుకోవడం.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ.), ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎమ్.ఎస్.ఎమ్.ఇ, ఎస్.ఐ.డి.బి.ఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.), బ్యాంక్ ఆఫ్ ఇండియా, గేట్స్ ఫౌండేషన్, మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్ (ఎమ్.ఎ.వి.ఐ.ఎమ్.), టి.యు. సిబిల్, ఎమ్.ఎస్.సి.లకు చెందిన ప్రముఖ వక్తలు తమ ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు.
నిజమైన పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఉదాహరణగా నిలిచే కార్యక్రమాలలో మొదటి వరుసలో ఉండే వాటిలో ఎఫ్.డబ్ల్యు.సి. ఒకటి. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించే ప్రయత్నాలలో డిమాండ్, సప్లయి అనే పార్శ్వాలు రెండూ ఉంటాయి. అనేక కార్యక్రమాలు సప్లయి వైపు గల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించినప్పటికీ, డిమాండ్-వైపు గల పరిమితులను పరిష్కరించడంలో ఎఫ్.డబ్ల్యు.సి యొక్క కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి.
~ శ్రీ. నీరజ్ నిగమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ.డి.), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ.)
జెండర్ లెన్స్ ద్వారా ఆర్థిక సేవలు సమానంగా అందుబాటులో ఉంచగల ఎజెండాను పునఃపరిశీలించడం అనేది మహిళల నేతృత్వంలో ఆర్థికాభివృద్ధి దిశగా భారతదేశ బ్యాంకింగ్ రంగ ప్రయత్నాలను వేగవంతం చేయగలదు. మహిళలపై దృష్టి సారించు ఏదైనా సమ్మిళిత ప్రయత్నం పిల్లలు, కుటుంబాలు, పెద్ద కమ్యూనిటీల పరిస్థితులను మెరుగుపరుస్తుంది.
~ శ్రీ. జితేంద్ర ఆస్తి, డైరెక్టర్ (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డి.ఎఫ్.ఎస్.), భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ
ఈ కార్యక్రమంలో భాగంగా “స్వయం సహాయక బృందాలకు మించి మహిళలకు ఆర్థిక సహాయం అందించే విషయంగా బ్యాంకులను ప్రోత్సహించు విషయంగా దృక్కోణాలను” అన్వేషించు ఒక ఎంగేజింగ్ సెషన్ అలాగే “మహిళలకు ఆర్థిక వనరుల యాక్సెస్ వేగవంతం చేయుట: విజన్ 2047 సాధన కోసం మహిళల నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించుట” పేరుతో ప్యానెల్ చర్చలు నిర్వహించబడినవి.
ఈ వర్క్‌షాప్‌లో భాగంగా, డబ్ల్యు.ఇ.పి., మిషన్ డైరెక్టర్, నీతి ఆయోగ్ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ అయిన శ్రీమతి అన్నా రాయ్ పలు ఇన్షియేటివ్స్ ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఫైనాన్స్ యాక్సెస్‌ను బలోపేతం చేయడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడానికి కొత్త సహకారాలను ఆమె ప్రకటించారు. ప్రత్యామ్నాయ క్రెడిట్ రేటింగ్ విధానాల ద్వారా ఫైనాన్స్ కోసం యాక్సెస్ మెరుగుపరిచేందుకు ఎఫ్.డబ్ల్యు.సి. ఆధ్వర్యంలో ఎమ్.ఎ.వి.ఐ.ఎమ్., ఎమ్.ఎస్.సిల భాగస్వామ్యం యొక్క ప్రకటన, మహారాష్ట్రలోని మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరిన్ని మార్పులతో కూడిన ఉత్పత్తులను బ్యాంకులు అందించేలా కృషి చేయడం; ఎ.ఎఫ్.డి, ఎస్.ఐ.డి.బి.ఐ., శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన గ్రో నెట్‌వర్క్‌తో డబ్ల్యు.ఇ.పి., అవగాహన ఒప్పందం; టి.యు. సిబిల్ ద్వారా “సెహెర్” ప్రారంభం అలాగే మహిళల నేతృత్వంలోని పరిశ్రమల క్రెడిట్ సంసిద్ధతను బలోపేతం చేసేందుకు క్రెడిట్ఎనెబుల్ భాగస్వామ్యంతో షైన్ ప్రోగ్రామ్ ప్రారంభించుట వంటి ప్రధాన అంశాలు ఈ ప్రకటనలో భాగంగా ఉన్నాయి. అదనంగా, ఎఫ్.డబ్ల్యు.సి మెంబర్‌గా మరింత మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సేవలదించే విషయంగా ఎస్.ఇ.డబ్ల్యు.ఎ. బ్యాంక్ తన నిబద్ధతను ప్రకటించింది.
ఈ సమావేశం 2047 కోసం భారతదేశ విజన్‌ను సాధించే దిశగా మహిళల నేతృత్వంలో అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కీలకమైన వాటాదారులందరూ కలిసి పనిచేయడానికి, భవిష్యత్తులో అసరమయ్యే సహకారాలను గురించి చర్చించడానికి మరియు ఫైనాన్స్ కోసం యాక్సెస్‌ను మెరుగుపరచడానికి ఒక వేదికను అందించింది.
***
(Release ID: 2031283)
Visitor Counter : 107