బొగ్గు మంత్రిత్వ శాఖ
మే 2024 లో ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లో గణనీయంగా 10.2 వృద్ధి శాతాన్ని సాధించిన బొగ్గు రంగం
Posted On:
04 JUL 2024 3:43PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచీ (ఐసిఐ) (2011-12 ఆధార సంవత్సరం) ప్రకారం, 2024 మే నెలలో ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో బొగ్గు రంగం అత్యధికంగా 10.2 శాతం (తాత్కాలిక) వృద్ధిని నమోదు చేయగా, రెండవ స్థానంలో విద్యుత్ పరిశ్రమ ఉంది. బొగ్గు పరిశ్రమ 2024 మే నెలలో 184.7 పాయింట్ల సూచి చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 167.6 పాయింట్ల వద్ద ఉంది. దాని సంచిత సూచిక అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024-25 ఏప్రిల్ నుండి మే వరకు 8.9 శాతానికి పెరిగింది.
సిమెంట్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్, ఎరువులు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు వంటి ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉమ్మడి, వ్యక్తిగత ఉత్పత్తి నిర్వాహణను ఐసిఐ కొలుస్తుంది.
గతేడాది ఇదే కాలంతో పోల్చగా, ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉమ్మడి సూచి 2024 మే నెలలో గణనీయంగా 6.3% పెరుగుదలను నమోదు చేసింది. ఇది మొత్తం పారిశ్రామిక విస్తరణకు బొగ్గు రంగ గణనీయమైన సహకారాన్ని తెలుపుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బొగ్గు రంగం ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో మొత్తం వృద్ధి కన్నా అధిక వృద్ధిని సాధించి దాని సమస్థాయి పరిశ్రమలను అధిగమించింది, .
ఈ గణనీయమైన వృద్ధికి కారణం, 2024 మే నెలలో బొగ్గు ఉత్పత్తి భారీగా పెరగడం, ఉత్పత్తి 83.91 మిలియన్ టన్నులకు చేరుకోవడం, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయంగా 10.15 శాతం పెరుగుదలను నమోదు చేయడం అని చెప్పవచ్చు. ఉత్పత్తిలో ఈ పెరుగుదల శక్తి, తయారీ పరిశ్రమల పెరుగుతున్న అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది.
బొగ్గు రంగ అసాధారణ విస్తరణ, ఎనిమిది ప్రధాన పరిశ్రమల మొత్తం వృద్ధిని ముందుకు నడిపించడంలో దాని గణనీయమైన పాత్ర, అదేవిధంగా, బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాలకు, క్రియాశీలక చొరవలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రయత్నాలు "ఆత్మనిర్భర్ భారత్" దార్శనికతకు అనుగుణంగా ఉంటూ, స్వావలంబన దిశగా, ఇంధన భద్రతను కాపాడుతూ దేశ పురోగతికి దోహదం చేస్తాయి.
***
(Release ID: 2030876)
Visitor Counter : 79