పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
కేరళలోని పంచాయతీలకు (2020–21 నుంచి 2026–27 వరకు) రూ.5,337 కోట్ల నిధులు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం
మార్చి 2024 తర్వాత నుంచి నిధుల విడుదలకు తప్పనిసరి షరతు అయిన రాష్ట్ర ఆర్థిక సంఘంపై వివరాలను తెలియజేస్తూ కేరళ ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాధానం రాలేదు.
Posted On:
03 JUL 2024 2:57PM by PIB Hyderabad
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలు కేరళ పత్రికల్లో వచ్చిన ఆరోపణలు వచ్చిన సందర్భంగా, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కింది అంశాలను నివృత్తి చేసింది.
(1) కేంద్ర ప్రభుత్వం కేరళలోని గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం (2015–16 నుంచి 2019–20 వరకు) నిధులు రూ.3774.20 కోట్లు, 15వ ఆర్థిక సంఘం (2020–21 నుంచి 2026-27 వరకు) నిధులు రూ.5,337 కోట్లు (28.06.2024 నాటికి) విడుదల చేసింది.
(2) 15వ ఆర్థిక సంఘం కేరళలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులను అన్‌టైడ్ (బేసిక్), టైడ్(షరతులతో) నిధుల రూపంలో కేరళకు విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం కింద నిధుల కేటాయింపులు, విడుదలల వార్షిక సారాంశం కింది పట్టిక-1 లో ఉంది.
పట్టిక-1
కేరళ గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, విడుదల స్థితి
(రూ. కోట్లలో)
క్ర.సం
|
సంవత్సరం
|
అన్ టైడ్ నిధులు
|
టైడ్ నిధులు
|
మొత్తం
|
కేటాయింపు
|
విడుదల
|
కేటాయింపు
|
విడుదల
|
కేటాయింపు
|
విడుదల
|
1
|
2020–21
|
814.00
|
814.00
|
814.00
|
814.00
|
1628.00
|
1628.00
|
2
|
2021–22
|
481.20
|
481.20
|
721.80
|
721.80
|
1203.00
|
1203.00
|
3
|
2022–23
|
498.40
|
498.40
|
747.60
|
747.60
|
1246.00
|
1246.00
|
4
|
2023–24
|
504.00
|
504.00
|
756.00
|
756.00
|
1260.00
|
1260.00
|
(3) 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, రాష్ట్రాలు తప్పనిసరిగా చేయాల్సినవి,
(ఎ) రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్‌సి) ఏర్పాటు (బి) వారి సిఫార్సుల మేరకు పనిచేయాలి (సి) 2024 మార్చి లేదా అంతకు ముందు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరణాత్మక మెమోరాండంను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడం తప్పనిసరి. మార్చి 2024 తర్వాత, రాష్ట్ర ఆర్థిక సంఘం, షరతులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను పాటించని రాష్ట్రాలకు ఎలాంటి నిధులు విడుదల చేయబడవు.
4. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఆర్థిక సంఘం వివరాలను అందించాలని రాష్ట్రాలకు 11 జూన్ 2024, 24 జూన్ 2024 తేదీల్లో లేఖ రాసింది.
5. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్‌టైడ్ నిధుల యొక్క రెండవ విడత గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (GTC) 7 జూన్ 2024 తేదీన సమర్పించింది. ఈ జిటిసిని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. తదుపరి వాయిదా (2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి వాయిదా) విడుదల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. అయితే, 2024 మార్చి తర్వాత గ్రాంట్ల విడుదలకు తప్పనిసరి షరతు అయిన రాష్ట్ర ఆర్థిక సంఘం వివరాలను తెలియజేస్తూ, 28 జూన్ 2024 నాటికి కేరళ ప్రభుత్వం నుంచి మంత్రిత్వ శాఖకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు.
***
(Release ID: 2030867)
Visitor Counter : 121