బొగ్గు మంత్రిత్వ శాఖ
తొలి బొగ్గు వాయుమార్పిడి ప్రాజెక్టుకు మొదటి ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించిన బిసిజిసిఎల్
प्रविष्टि तिथि:
03 JUL 2024 7:28PM by PIB Hyderabad
భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (బిసిజిసిఎల్) నోయిడాలోని తమ తొలి బొగ్గు వాయుమార్పిడి ప్రాజెక్టుపై మొదటి ప్రీ-బిడ్ సమావేశాన్ని జూలై 1న నిర్వహించింది. మొత్తం 8 మంది పోటీదారుల ప్రతినిధులు ఈ సమాశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర చర్చలు, వివరణలు, సంయుక్త నిర్వహణ అవకాశాలు, అవసరమైన సమాచారం పంచుకోవడం వంటివాటికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది.
బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక మార్గనిర్దేశం మేరకు మూడు లంప్‌సమ్ టర్న్‌కీ (ఎల్ఎస్‌టికె) ప్యాకేజీలలో ఎల్ఎస్‌టికె-2కు మే 30న, ఎల్ఎస్‌టికె-3, 4లకు జూన్ 14న ‘బిసిజిసిఎల్’ టెండర్లు ఆహ్వానించింది. ప్రాజెక్ట్ పురోగమనానికి అవసరమైన సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదిక (డిఎఫ్ఆర్)ను ఖరారు చేయడం ఈ టెండర్ల లక్ష్యం.
కాగా, ‘సిఐఎల్-బిహెచ్ఇఎల్’ మధ్య సంయుక్త సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ‘సిఐఎల్’కు 51 శాతం వాటా ఉంటుంది. ఈ మేరకు బొగ్గు నుంచి రసాయనాల వెలికితీత కార్యకలాపాల నిమిత్తం ‘సిఐఎల్’ అనుబంధ సంస్థగా ‘బిసిజిసిఎల్’ ఏర్పాటు చేయబడింది.
దేశంలో తన తొలి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ద్వారా ‘బిసిజిసిఎల్’ గణనీయ ప్రగతి సాధించింది. ఒడిషాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) పరిధిలోగల లఖన్‌పూర్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ఇటీవలి టెండర్ల ప్రక్రియతో కీలక మైలురాయిని చేరినట్లయింది.
***
(रिलीज़ आईडी: 2030679)
आगंतुक पटल : 169