బొగ్గు మంత్రిత్వ శాఖ

నిర్మాణ్ పోర్ట‌ల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి కిష‌న్ రెడ్డి.


యూపీఎస్సీ ఉద్యోగాల‌ను సాధించాల‌నుకునే వారిలో అర్హ‌త‌గ‌ల‌వారికి రూ. 1 ల‌క్ష ఆర్థిక సాయ‌మందించే ప‌థ‌కం

Posted On: 02 JUL 2024 9:17PM by PIB Hyderabad

నిర్మాణ్ పోర్ట‌ల్ ను కేంద్ర‌మంత్రి శ్రీ జి కిష‌న్ రెడ్డిప్రారంభించారు. నోబుల్ ఇన్షియేటివ్ ఫ‌ర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నేష‌న‌ల్ సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ కు సంక్షిప్త నామ‌మే నిర్మాణ్‌. సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్షల్లో మెయిన్స్ రాసే అభ్య‌ర్థుల‌కు ఆర్థిక సాయం అందించే ఉన్న‌త‌మైన కార్య‌క్ర‌మ‌మే నిర్మాణ్‌. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌తైన మిష‌న్ క‌ర్మ‌యోగికి అనుగుణంగా కోల్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన వినూత్న‌మైన సిఎస్ ఆర్ ప‌థ‌క‌మే నిర్మాణ్‌. 2024లో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ‌న‌రీ రౌండ్ లో విజ‌యం సాధించిన‌వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర బొగ్గుగ‌నుల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అమృత్ లాల్ మీనా, ఇత‌ర ఉన్న‌తాధికారులు, బొగ్గు కంపెనీల సీఎండీలు పాల్గొన్నారు. 

ఈ ప‌థ‌కాన్ని సిఐఎల్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న 39 జిల్లాల్లోని శాశ్వ‌త నివాస అభ్య‌ర్థుల‌కే అమ‌లు చేస్తారు. ప్రిలిమ‌న‌రీ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సంపాదించిన‌వారికి, అందులోనూ వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 ల‌క్ష‌ల‌కు మించ‌కుండా వున్న‌వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. అంతే కాదు అభ్య‌ర్థులు షెడ్యూల్డ్ కులాలు, తెగ‌లు, మ‌హిళ‌లు లేదా హిజ్రాలు అయివుంటేనే ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి చేకూరుతుంది. 

ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా వుండ‌డంకోసం ఇందుకోసమే ప‌ని చేసే పోర్ట‌ల్ ను ప్రారంభించారు. తద్వారా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కంటున్న డిజిట‌ల్ ఇండియా క‌ల సాకార‌మ‌వుతుంది. 
 
కేంద్ర బొగ్గుగ‌నుల శాఖ‌కు చెంద‌ని కోల్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. ఇది మ‌హార‌త్న కంపెనీగా గుర్తింపు పొందింది. దేశ ఇంధ‌న భ‌ద్ర‌త‌కు వెన్నెముక‌గా నిలవ‌డ‌మే కాకుండా సామాజికంగా భాద్య‌త‌గ‌ల కార్పొరేట్ కంపెనీగా కూడా సేవ‌లందిస్తోంది. బొగ్గు గ‌నుల కార్య‌క‌లాపాలు జ‌రిగే ప్రాంతాల్లో విద్యారంగంలో త‌న‌దైన సేవ‌లందిస్తోంది. 

 

విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికిగా కోల్ ఇండియా లిమిటె్ (సిఐఎల్) , దాని అనుబంధ సంస్థ‌లు వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ పేద కుటుంబాల‌కు చెందిన విద్యార్థుల‌కు అండ‌గా నిలుస్తున్నాయి. బొగ్గు గ‌నుల కార్య‌కలాపాలు జ‌రిగే ప్రాంత‌ల్లోని విద్యార్తులు జాతీయంగా పేరున్న విద్యాసంస్థ‌ల్లో చ‌దువుకునేలా సాయం అందిస్తున్నాయి. 

 


***



(Release ID: 2030339) Visitor Counter : 28


Read this release in: English , Urdu , Hindi , Tamil