బొగ్గు మంత్రిత్వ శాఖ

కేప్టివ్ /వాణిజ్య తరహా బొగ్గు గనుల లో ఉత్పత్తి స్థితి నిసమీక్షించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 02 JUL 2024 5:12PM by PIB Hyderabad

‘‘ఈ సరికే ఉత్పాదన లో నిమగ్నం అయినటువంటి మరియు ఉత్పాదన కు సన్నద్ధం గా ఉన్నటువంటి’’, ‘ఇంకా అసలు ఏమాత్రం కార్యకలాపాలు జరుగకుండా ఉన్నటువంటికేప్టివ్ మరియు వాణిజ్య తరహా బొగ్గు గనుల స్థితి ని సమీక్షించడం కోసం న్యూ ఢిల్లీ లో 2024 జులై ఒకటో తేదీ న నిర్వహించిన ఒక కీలక సమావేశాని కి బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మరియు నామినేటెడ్ ఆథారిటి శ్రీ ఎమ్. నాగరాజు అధ్యక్షత ను వహించారు. దేశీయం గా బొగ్గు ఉత్పాదన వృద్ధి చెందింప చేయాలన్న ప్రభుత్వ నిబద్ధత పై ప్రముఖం గా దృష్టి ని సారిస్తూ, ఈ సమగ్ర సమీక్ష ను చేపట్టడమైంది. ఈ సమావేశం లో, బొగ్గు ఉత్పాదన ను పెంచడం కోసం కేటాయింపున కు పాత్రమైన వర్గాల ప్రయాసల ను శ్రీ నాగరాజు అభినందించడం తో పాటుగా, వాటి కి 2024-25 ఆర్థిక సంవత్సరం లో నిర్దేశించుకొన్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల ను సాధించడానికి కృషి చేయవలసిందని సలహా ఇచ్చారు. దాదాపు గా కార్యకలాపాల ను ప్రారంభించే దశ కు చేరుకొన్న బొగ్గు బ్లాకుల లో త్వరలో ఆ పనుల ను మొదలు పెట్టడాని కి అవసరమైన చర్యల ను తీసుకోవాలని గనుల కేటాయింపు జరిగిన వర్గాల కు అదనపు కార్యదర్శి సూచించారు.

2024 జూన్ 30 వ తేదీ నాటికి 54 కేప్టివ్/వాణిజ్య సరళి బొగ్గు గనులు ఉత్సాదన స్థితి లో ఉండగా, వాటిలో 32 గనుల ను విద్యుత్తు రంగాని కి, 12 గనులు అనియంత్రిత రంగాని కి మరియు 10 గనుల ను బొగ్గు విక్రయం కోసం కేటాయించడమైంది. 2025 ఆర్థిక సంవత్సరం లో 11 గనుల లో బొగ్గు ఉత్పాదన ఆరంభం కావచ్చన్న ఆశ ఉంది. ఈ గనుల నుండి వర్తమానం లో బొగ్గు ఉత్పత్తి 39.53 ఎమ్ టి స్థాయి లో ఉంది. ఇది క్రిందటి ఏడాది తో పోల్చినప్పుడు 35 శాతం మేరకు చెప్పుకోదగ్గ వృద్ధి ని నమోదు చేసింది.

కార్యకలాపాల కు నోచుకోని 65 బొగ్గు బ్లాకులు ఇప్పుడు నియంత్రణ పరమైన ఆమోదాల ను పొందేటటువంటి వేరు వేరు దశల లో ఉన్నాయి. ఈ బ్లాకుల ను తొమ్మిది రాష్ట్రాలు.. అరుణాచల్ ప్రదేశ్, అసమ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, ఝార్ ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు పశ్చిమ బంగాల్ లలో వితరణ చేయడమైంది.

దేశం యొక్క శక్తి రంగ అవసరాల ను తీర్చడం కోసం బొగ్గు ఉత్పత్తి ని పర్యవేక్షించడం మరియు అభిలషణీయ స్థాయి కి చేర్చడం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్నటువంటి సక్రియ దృష్టికోణాన్ని ఈ ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతం క్రియాశీలం గా ఉన్నటువంటి గనుల తో పాటు కార్యకలాపాలు సాగని గనుల యొక్క సమీక్ష అనేది వనరుల అధికతమ స్థాయి లో వినియోగించుకోవడం పట్ల, బొగ్గు ను త్రవ్వితీయడం లో ఏవైనా ఇబ్బందులు ఎదురయితే వాటిని పరిష్కరించడం పట్ల వ్యూహాత్మకమైన శ్రద్ధ ను తీసుకోవాలని సూచిస్తున్నది.

 

***

 



(Release ID: 2030322) Visitor Counter : 9


Read this release in: Tamil , English , Urdu , Hindi