గనుల మంత్రిత్వ శాఖ

2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తి తరువాత 2024 మేలో మైనింగ్ రంగంలో వృద్ధి


కీలక ఖనిజాలు, అల్యూమినియం లోహం ఉత్పత్తిలో బలమైన వృద్ధి

Posted On: 28 JUN 2024 7:21PM by PIB Hyderabad

విలువపరంగా మొత్తం ఎంసీడీఆర్ ఖనిజ ఉత్పత్తిలో ఇనుప ఖనిజం, సున్నపురాయి కలిసి 80% వాటాను కలిగి ఉన్నాయి.  ఈ కీలక ఖనిజాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచాయి. ఆ కాలంలో ఇనుప ఖనిజం 275 మిలియన్ మెట్రిక్ టన్నులు(ఎంఎంటీ) ఉత్పత్తి కాగా.. సున్నపురాయి 450 ఎంఎంటీలు ఉత్పత్తి జరిగింది.

ఈ ధోరణిని కొనసాగిస్తూ, తాత్కాలిక గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మే) దేశంలో ఈ కీలక ఖనిజాల ఉత్పత్తిలో బలమైన వృద్ధి కనిపించింది. 2024-25 ఏప్రిల్-మేలో ఇనుప ఖనిజం ఉత్పత్తి 52 ఎంఎంటీలు కాగా.. గతేడాది ఇదే కాలంలో జరిగిన 50 ఎంఎంటీలతో పోల్చితే 4 శాతం వృద్ధి కనపించింది.
2023-24 ఏప్రిల్-మేలో సున్నపురాయి ఉత్పత్తి 77 ఎంఎంటీల నుంచి 2024-25 ఏప్రిల్-మేలో 2.6% వృద్ధితో 79 ఎంఎంటీలకు చేరింది. మాంగనీస్ ఖనిజం ఉత్పత్తి 2024-25 ఏప్రిల్-మేలో 0.7 ఎంఎంటీ కాగా.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 16.7 శాతం పెరిగింది.

ఇనుమేతర లోహ(నాన్-ఫెర్రస్) రంగంలో చూసినట్లయితే.. 2023-24ఏప్రిల్-మేలో 6.90 లక్షల టన్నుల(ఎల్టీ) ప్రాథమిక అల్యూమినియం ఉత్పత్తి జరిగింది. దీనితో పోల్చితే 2024ఏప్రిల్-మేలో 1.2% వృద్ధితో 6.98 లక్షల టన్నుల(ఎల్టీ) అల్యూమినియం ఉత్పత్తి జరిగింది.

ప్రపంచంలో భారతదేశం రెండో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు కాగా సున్నపురాయి విషయంలో మూడో, ఇనుప ఖనిజం విషయంలో నాలుగో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇనుప ఖనిజం, సున్నపురాయి ఉత్పత్తిలో నిరంతర వృద్ధి.. ఉక్కు, సిమెంట్ వంటి వినియోగదారు పరిశ్రమలలో బలమైన డిమాండ్ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. అల్యూమినియం ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఈ వృద్ధి ధోరణులు ఇంధనం, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, ఆటోమోటీవ్, యంత్రాలు వంటి వినియోగదారు రంగాలలో బలమైన ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తున్నాయి.

 

***



(Release ID: 2029630) Visitor Counter : 16


Read this release in: Tamil , English , Urdu , Hindi