శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇంధనం,ఇంధన పరికరాలపై ఒక వారం- ఒక థీమ్ పేరు మీద శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి, భారతీయ పెట్రోలియం సంస్థ కలిసి నిర్వహించిన కార్యక్రమం - విజయవంతంగా ముగింపు.
Posted On:
28 JUN 2024 8:16PM by PIB Hyderabad
ఒక వారం- ఒక థీమ్ పేరు మీద ఇంధనం,ఇంధన పరికరాలపై శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి, భారతీయ పెట్రోలియం సంస్థ కలిసి ఐఐపి డెహ్రాడూన్ లో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
గత ఏడాది సిఎస్ ఐ ఆర్ ఆధ్వర్యంలో అన్ని సిఎస్ ఐ ఆర్ ప్రయోగశాలలు కలిసి ఒక వారం ఒక ప్రయోగశాల పేరు మీద నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. అదే పద్ధతిలో 2024లో ఒక వారం ఒక థీమ్ పేరు మీద కార్యక్రమాన్ని నిర్వహించాలని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ గౌరవ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు. సిఎస్ ఐఆర్ ప్రయోగశాలలు అభివృద్ధి చేసిన వినూత్నమైన విధానాలను, సాంకేతిక ప్రగతిని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలనేది లక్ష్యం.
ఇంధనం, ఇంధన పరికరాల థీమ్ ( ఇఇడి_) అనేది చాలా ముఖ్యమైన థీమ్. ఇంధన అవసరాలన తీర్చడంద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఈ థీమ్ దోహదం చేస్తుంది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితికి ప్రచాం చేస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడం జరుగుతుంది. హైడ్రోజన్, బ్యాటరీలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, సౌర, పవన విద్యుత్ మొదలైనవి ఈ థీమ్కు సంబంధించిన వర్టికల్స్ . సిఎస్ ఐ ఆర్కు చెందిన పలు ప్రయోగశాలలు ఈ థీమ్ కు సంబంధించిన పలు ఆర్ అండ్ డి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
ఇఇడికి సంబంధించిన ఒక వారం ఒక థీమ్ కార్యక్రమం జూన్ 24న సిఎస్ ఐఆర్ -ఎన్ సి ఎల్ పుణేలో ప్రారంభమైంది. వారం రోజులపాటు సిఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల్లో సాధించిన వినూత్న విధానాలను, సాంకేతిక విజయాలను ప్రదర్శించారు. సాంకేతిక రంగాలపై సదస్సులు నిర్వహించారు. మీడియాతో మాట్లాడారు. ఆయా సంస్థలకు సిఎస్ ఐఆర్ ప్రయోజనాలు అందడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించారు.
దీనికి సంబంధించిన ముగింపు కార్యక్రమాన్ని జూన్ 28 సిఎస్ ఐ ఆర్ -ఐఐపి వేదికగా నిర్వహించారు. వారంరోజులపాటు ఇంధనం, ఇంధన పరికరాల థీమ్ కు సంబంధించి నిర్వహించిన చర్చలు, విజ్ఞాన వ్యాప్తి, సవాళ్లకు అనుగుణంగా వినూత్నమైన పరిష్కారాలను పొందడం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు.
సిఎస్ ఐ ఆర్ -ఐపిపి అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా విజయవంతంగా అమల్లోకి తెచ్చిన ఇంధన సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతగురించి సిఎస్ ఐ ఆర్ - ఐఐపి డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ బిష్ట్ మాట్లాడారు. భారతదేశ ఇంధన భద్రతను పెంచడానికిగాను నూతన ఉత్పత్తులను, విధానానాలను, సాంకేతికతలను కనుగొనడానికి సిఎస్ ఐ ఆర్ -ఐఐపి సిద్ధంగా వుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సిఎస్ ఐఆర్ -ఎన్ సి ఎల్ డైరెక్టర్ హరిత హైడ్రోజన్, ఫోటోవోల్టాయిక్ బ్యాటరీలు మొదలైనవాటిని ఉపయోగించుకోవడానికిగాను సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ సిఎస్ ఐ ఆర్ -ఐపిపి , ఇఐఎల్ కలిసి చేస్తున్న పని గురించి వివరించారు. ఆయా సాంకేతికతలను వాణిజ్యపరంగా వినియోగించుకోవడంపై తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను, ఇంకా ఇతర అంశాలపైనా ఆయన మాట్లాడారు. నూతన, స్వచ్ఛ ఇంధన వనరుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
రిలయన్స్ పరిశ్రమలకు చెందిన పెట్ కెమ్ ఆర్ అండ్ డి అధ్యక్షులు డాక్టర్ ఎంఓ గార్గ్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి సాంకేతికతనలు మార్కెట్ స్థాయికి తీసుకుపోవడంలో భాగస్వామి ప్రాధాన్యత గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ సదస్సులో పాల్గొన్న వక్తలు తమ పరిశోధనల గురించి తెలియజేశారు. ఇంధన రంగానికి సంబంధించి తాము చేసిన కృషిని సిఎస్ ఐ ఆర్- సిఎస్ ఐఓ, సిఎస్ ఐఆర్- ఏఎంపిఆర్ఐ , సిఎస్ ఐ ఆర్ - ఎన్ పి ఎల్, సిఎస్ ఐ ఆర్- ఎన్ ఐఐ ఎస్ టి, సిఎస్ ఐఆర్- సిబిఆర్ ఐ సంస్థలు వివరించాయి.
***
(Release ID: 2029480)
Visitor Counter : 106