కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న సభ్యులకు ఉపసంహరణ ప్రయోజనాన్ని అందిచేందుకు ఉద్యోగుల పెన్షన్ పథకం 1995లో సవరణ; ఏటా 7 లక్షల మందికి పైగా ఈపీఎస్ సభ్యులకు ఈ సవరణ ద్వారా లబ్ధి


ఉపసంహరణ ప్రయోజనాన్ని నిష్పాక్షికంగా చెల్లించేలా టేబుల్ డిని కూడా సవరించిన ప్రభుత్వం; దీని ద్వారా 23 లక్షల మందికి పైగా సభ్యులు ప్రయోజనం

Posted On: 28 JUN 2024 7:32PM by PIB Hyderabad

ఆరు నెలల కంటే తక్కువ కాంట్రిబ్యూటరీ సర్వీస్ ఉన్న ఈపీఎస్ సభ్యులు కూడా ఉపసంహరణ ప్రయోజనాలు పొందేలా ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) 1995ను భారత ప్రభుత్వం సవరించింది. ఈ సవరణ ద్వారా ప్రతి సంవత్సరం6 నెలల కంటే తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ ఉన్న 7 లక్షల మందికి పైగా ఈపీఎస్ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది.

 

కేంద్ర ప్రభుత్వం టేబుల్ డిని కూడా సవరించింది. సభ్యులకు దామాషా ఉపసంహరణ ప్రయోజనాన్ని అందించడానికి ప్రతి నెలా సేవలను పరిగణనలోకి తీసుకునేలా చేసింది. ఉపసంహరణ ప్రయోజనం మొత్తం ఇకపై సభ్యుడు అందించిన పూర్తి నెలల సర్వీసుఇపిఎస్ కంట్రిబ్యూషన్ అందుకున్న వేతనాలపై ఆధారపడి ఉంటుంది. పై విధానం సభ్యులకు ఉపసంహరణ ప్రయోజనం చెల్లింపును హేతుబద్ధం చేసింది. టేబుల్ డి యొక్క ఈ సవరణ ద్వారా ప్రతి ఏడాది 23 లక్షల మందికి పైగా సభ్యులు ప్రయోజనం పొందుతారని అంచనా.

 

ప్రతి ఏడాదిలక్షలాది ఇపిఎస్ సభ్యులు పెన్షన్ కోసం అవసరమైన 10 ఏళ్ల కాంట్రిబ్యూటరీ సర్వీస్ అందించడానికి ముందు ఈ పథకాన్ని విడిచిపెడతారు. అటువంటి సభ్యులకు పథకం యొక్క నిబంధనల ప్రకారం ఉపసంహరణ ప్రయోజనం ఇవ్వబడుతుంది.

 

2023-24 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షలకు పైగా ఉపసంహరణ ప్రయోజనాల క్లెయిమ్ లను పరిష్కరించారు.

 

ఇప్పటివరకుపూర్తి చేసిన సంవత్సరాలలో కంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిఈపిఎస్ కంట్రిబ్యూషన్ చెల్లించిన వేతనాల ఆధారంగా ఉపసంహరణ ప్రయోజనాన్ని లెక్కించేవారు.

 

అందువల్ల6 నెలలుఅంతకంటే ఎక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ పూర్తి చేసిన తరువాత మాత్రమేసభ్యులు ఉపసంహరణ ప్రయోజనానికి అర్హత కలిగి ఉంటారు. ఫలితంగా6 నెలలు లేదా అంతకంటే ముందు ఈ పథకం నుండి నిష్క్రమించిన సభ్యులకు ఉపసంహరణ ప్రయోజనం లభించేది కాదు. చాలా మంది సభ్యులు 6 నెలల కంటే తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ లేకుండా నిష్క్రమించడంతో అనేక క్లెయిమ్ తిరస్కరణలకుఫిర్యాదులకు ఇది ఒక కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోకంట్రిబ్యూటరీ సేవలు 6 నెలల కంటే తక్కువగా ఉన్న కారణంగాఉపసంహరణ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసిన సుమారు 7 లక్షల క్లెయిమ్ లు తిరస్కరణకు గురయ్యాయి. ఇకపై 14.06.2024 నాటికి 58 ఏళ్లు నిండని ఈపీఎస్ సభ్యులందరూ ఉపసంహరణ ప్రయోజనానికి అర్హులు అవుతారు.

 

ఇదివరకుమునుపటి టేబుల్ డి కింద లెక్కింపుప్రతి ఏడాది పూర్తైన తరువాత 6 నెలల కంటే తక్కువ కాలం అందించిన సేవ  ఫ్రాక్షనల్ వ్యవధిని విస్మరించింది. దీని ఫలితంగా చాలా సందర్భాల్లో ఉపసంహరణ ప్రయోజనం తగ్గింది. టేబుల్ డీ సవరణతోఉపసంహరణ ప్రయోజనాన్ని లెక్కించడం కొరకు కాంట్రిబ్యూటరీ సర్వీస్ ఇప్పుడు పూర్తయిన నెలల్లో పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇది ఉపసంహరణ ప్రయోజనాన్ని నిష్పాక్షికంగా చెల్లించేలా చేస్తుంది. ఉదాహరణకునెలకు 15,000/- వేతనం తీసుకునే సభ్యుడు,  2 సంవత్సరాల 5 నెలల కాంట్రిబ్యూటరీ సర్వీస్ తర్వాత ఉపసంహరణ ప్రయోజనం ఇంతకు ముందు రూ. 29,850/- పొందేందుకు అర్హత ఉండేది. ప్రస్తుతం ఈ మార్పులతో ఆ వ్యక్తికి రూ.36,000 ఉపసంహరణ ప్రయోజనం లభిస్తుంది.

***


(Release ID: 2029475) Visitor Counter : 85