ఆర్థిక మంత్రిత్వ శాఖ
సీబీఐసీ ద్వారా జులై 4, 2024 నుంచి అమల్లోకి రానున్న ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ఆటోమేషన్ మాడ్యూల్ (ERAM)
22 కరెన్సీ మారకపు విలువలను ఆన్‌లైన్లో ప్రచురించడం ద్వారా దిగుమతిదారులు, ఎగుమతిదారులకు వాణిజ్యాన్ని సులభతరం చేయనున్న ఈఆర్ఏఎం
प्रविष्टि तिथि:
27 JUN 2024 8:49PM by PIB Hyderabad
కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(CBIC) ఎక్స్ఛేంజ్ రేట్ ఆటోమేషన్ మాడ్యూల్ (ERAM) ప్రారంభానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మాన్యువల్ ప్రక్రియ స్థానంలో మారకపు రేటును నిర్ధారించి, ప్రచురించే ఆటోమేటెడ్ వ్యవస్థ జూలై 4, 2024 నుండి అమలులోకి వస్తుంది.
దిగుమతి, ఎగుమతిదారుల సౌలభ్యం కోసం 22 దేశాలకు చెందిన కరెన్సీ మారకపు విలువను ఆన్‌లైన్లో ముందుగానే ఈఆర్‌ఏఎం ప్రచురించే పద్ధతి వాణిజ్య ప్రక్రియను సులభతరం చేయడంలో కీలకమైన ఘట్టం. ఈ మారకపు రేట్లు ఐస్‌గేట్(ICEGATE) వెబ్సైట్లో నెలకు రెండు సార్లు అంటే నెలలో మొదటి, మూడో గురువారాల సాయంత్రం అందుబాటులోకి వచ్చి, మరుసటి రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. 25 జూన్ 2024 నాటి ప్రకటన 07/2024-కస్టమ్స్ లో కూలంకషంగా వివరణ ఉంది.
ఈ ఆటోమేటెడ్ వ్యవస్థ నోటిఫికేషన్ ద్వారా మారకపు విలువను తెలియజేసే పద్ధతికి స్వస్తి చెబుతుంది. సీబీఐసీ వెబ్సైట్లో పొందుపరిచిన లింక్ ఐస్‌గేట్ వెబ్సైట్ కు వినియోగదారున్ని తీసుకెళుతుంది. అక్కడ ప్రచురితమైన మారకపు విలువలను చూడవచ్చు. ప్రచురితమైన మారకపు విలువలు సిస్టమ్లో స్టోర్ అవుతాయి, భవిష్యత్తు అవసరాల కోసం ఐస్‌గేట్‌లో అందుబాటులో ఉంటాయి. తద్వారా వినియోగదారునికి నిన్నటి ధరలు సరిచూసుకోవడానికి వీలు కలుగుతుంది.
సుంకాల విధానంలో డిజిటలైజేషన్లో సీబీఐసీ స్థిరంగా పురోగతి సాధిస్తోంది. ఈఆర్‌ఏఎం ప్రారంభించడం ఈ దిశగా వేసిన మరో ముందడుగు.
***
(रिलीज़ आईडी: 2029423)
आगंतुक पटल : 181