గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
9వ ఎడిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 మూడో త్రైమాసికం (క్యూ3) ప్రారంభం
బల్క్ వేస్ట్ జనరేటర్ల (BWG) వ్యర్థాల నిర్వహణ పూర్తి వ్యవస్థను మదింపు చేయడంపై దృష్టి
Posted On:
26 JUN 2024 5:04PM by PIB Hyderabad
9వ ఎడిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 లో భాగంగా 3వ త్రైమాసికాన్ని (క్యూ3) కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యూఏ) ప్రారంభించింది. బల్క్ వేస్ట్ జనరేటర్ల (బిడబ్ల్యుజి) వద్ద వ్యర్థాల నిర్వహణ యొక్క మొత్తం వ్యవస్థను మదింపు చేయడంపై సర్వే యొక్క మూడవ దశ దృష్టి పెట్టనుంది. మొత్తం స్వచ్ఛ సర్వేక్షణ్ 4 త్రైమాసికాల్లో మదింపు ఉంటుంది. మొదటి రెండు త్రైమాసికాల్లో నగర పరిశుభ్రతకు సంబంధించిన వివిధ అంశాలపై పౌరుల నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయగా, మూడో త్రైమాసికం ప్రక్రియ సౌకర్యాలపై మదింపు, 4వ త్రైమాసికం అన్ని సూచికలపై క్షేత్రస్థాయి మదింపును చేయనున్నాయి.
భారతదేశంలోని పట్టణాలలో రోజుకు 1,50,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. పెరుగుతున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పుల కారణంగా మునిసిపల్ ఘన వ్యర్థాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఎంఓహెచ్యూఏ ప్రకారం, ఒక నగరంలో దాదాపు 30 నుండి 40 శాతం వ్యర్థాలు బల్క్ వేస్ట్ జనరేటర్ల (బిడబ్ల్యుజి) ద్వారా ఉత్పత్తి అవుతాయని అంచనా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యుఎం) 2016 నిబంధనల ప్రకారం, అన్ని రకాల వ్యర్థాలతో సహా రోజుకు సగటున 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఉన్న సంస్థలుగా బిడబ్ల్యుజిని నిర్వచించింది. పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బి) నిర్వహణ, ఆర్థిక భారాన్ని తగ్గించడం, వ్యర్థాలు భూమిలోకి కలవకుండా నిరోధించడం, గాలి, నేల, భూగర్భ జల కాలుష్యంతో పాటు నగరం యొక్క కార్బన్ ఫూట్‌ప్రింట్ ను తగ్గించడం ఈ నిబంధనల ఉద్దేశం.
పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే నివాస, వాణిజ్య సముదాయాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, హోటళ్లు, విశ్వవిద్యాలయాలు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు వాటి వ్యర్థాలు మొదలైన వద్దే, బయో డీగ్రేడబుల్ వ్యర్థాలను వేరు చేయాలి. బయో డీగ్రేడబుల్ వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహణ చేసి వాటి ఆవరణలో కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎరువు, బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి. బీడబ్ల్యూజీలు కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ (సీఅండ్ డీ) వ్యర్థాలను విడివిడిగా నిల్వ చేయాలి.
మొత్తం వ్యర్థాల ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నందున, నగరాలను వ్యర్థాల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 యొక్క భవిష్యత్తును నిర్ణయించడంలో బిడబ్ల్యుజిల చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాలను పెంచే నిరంతర ప్రయత్నాలలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 యొక్క 3 వ త్రైమాసికం జూలై 5 న ప్రారంభం కానుంది. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో బిడబ్ల్యుజిలు ఉత్పత్తి చేసిన వ్యర్థాల సేకరణ, రవాణా, తుది నిర్వహన సహా వ్యర్థాల నిర్వహణ యొక్క అన్ని అంశాలను అమలు చేయనున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024, నాలుగవ త్రైమాసికం సెప్టెంబర్ - అక్టోబర్ 2024 నాటికి ప్రారంభం కానుంది.
***
(Release ID: 2028940)
Visitor Counter : 149