భారత పోటీ ప్రోత్సాహక సంఘం
‘మిత్సుయీ అండ్ కో లిమిటెడ్’ ద్వారా స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నిర్దిష్ట ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ‘సిసిఐ’ ఆమోదం
Posted On:
25 JUN 2024 8:54PM by PIB Hyderabad
స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (స్నేహ ఫార్మ్స్/టార్గెట్)లో మిత్సుయి అండ్ కో లిమిటెడ్ (మిత్సుయి/అక్వైరర్) సంస్థ నిర్దిష్ట ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
ఈ లావాదేవీ- ప్రైమరీ సబ్‌స్క్రిప్షన్, సెకండరీ షేర్ల కొనుగోలు (ప్రతిపాదిత సమ్మేళనం)కు సంబంధించింది. ఈ మేరకు స్నేహ ఫార్మ్స్ నుంచి నిర్దిష్ట సంఖ్యలో ఈక్విటీ షేర్లను మిత్సుయి సంస్థ కొనుగోలు చేస్తుంది.
మిత్సుయి సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోతోపాటు అత్యంత వైవిధ్య వ్యాపార నిర్వహణలో భాగంగా సార్వత్రిక ట్రేడింగ్ సేవలందించే కంపెనీ. ఈ సంస్థకు ప్రపంచంలోని 61 దేశాలు, ప్రాంతాల్లో అనుబంధ వాణిజ్య కార్యాలయాలున్నాయి. ఇది టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ఉంది. ఖనిజ-లోహ వనరులు, విద్యుత్తు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా, రసాయనాలు, ఇనుము-ఉక్కు ఉత్పత్తులు, ఆహారం-ఆహార చిల్లర వ్యాపార నిర్వహణ, ఆరోగ్యం, ఐటీ-కమ్యూనికేషన్లు, కార్పొరేట్ అభివృద్ధి వంటి వివిధ వ్యాపార రంగాలలో కార్యలాపాలు నిర్వహిస్తూంటుంది.
ఇక స్నేహ ఫార్మ్స్ 1994లో స్థాపించబడిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీనికి స్నేహ గోల్డ్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగ్ పౌల్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. స్నేహ ఫార్మ్స్ ప్రధానంగా భారత పౌల్ట్రీ పరిశ్రమలో కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది. కోళ్ల పెంపకం నుంచి ఇతర ఉత్పత్తుల పంపిణీ వరకూ అనేక రకాల కార్యకలాపాలు చేపడుతూంటుంది. ఇందులో భాగంగా హేచరీల నిర్వహణ, పౌల్ట్రీ ఫీడ్ మిక్స్‌ల తయారీ, ఘనీభవన-శీతల చికెన్ తయారీ, వంట/వాడకానికి సిద్ధంగా ఉండే/మేరినేట్ చేసిన పౌల్ట్రీ ఉత్పత్తులు మొదలైన వాటిని విక్రయిస్తూంటుంది. అలాగే చేపల మేత, పెంపుడు జంతువుల ఆహారం తదితరాలనుకూడా ఉత్పత్తి చేస్తుంది.
ఈ లావాదేవీపై సమగ్ర ఉత్తర్వులను ‘సిసిఐ’ త్వరలో జారీ చేయనుంది.
***
(Release ID: 2028851)
Visitor Counter : 54