భారత పోటీ ప్రోత్సాహక సంఘం

‘కోఫోర్జ్’ ద్వారా ‘సిగ్నిటీ’ సంస్థలో నిర్దిష్ట ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ‘సిసిఐ’ ఆమోదం

Posted On: 25 JUN 2024 8:53PM by PIB Hyderabad

   సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ (సిగ్నిటీ) సంస్థలో నిర్దిష్ట ఈక్విటీ షేర్లను కోఫోర్జ్ లిమిటెడ్ (కోఫోర్జ్) సంస్థ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.

   ఈ ప్రతిపాదిత లావాదేవీ- సిగ్నటీ సంస్థ నుంచి కోఫోర్జ్ సంస్థ ‘ఫుల్లీ డైల్యూటెడ్’ ప్రాతిపదికన కనీసం 50.21 శాతం గరిష్ఠంగా 54 శాతం దాకా షేర్లు కొనుగోలు చేయడానికి సంబంధించింది. ఈ లావాదేవీ (ప్రతిపాదిత సమ్మేళనం) ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (షేర్లు-టేకోవర్ల గణనీయ కొనుగోలు) నిబంధనలు-2011’కు అనుగుణంగా ప్రకటించిన తప్పనిసరి ‘ఓపెన్ ఆఫర్’ కింద కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందం అమలుకు సంబంధించినది.

   ‘కోఫోర్జ్’ ఒక పబ్లిక్ కంపెనీ కాగా, ఆ సంస్థ ఈక్విటీ షేర్లు ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా’ లిమిటెడ్ (ఎన్ఎస్ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) రెండింటిలోనూ నమోదు చేయబడ్డాయి. ‘కోఫోర్జ్’తోపాటు దాని అనుబంధ సంస్థలు భారతదేశంలో సమాచార సాంకేతికత (ఐటీ), ఐటీ ఆధారిత, దాని ఉప-విభాగాల సేవలు (ఐటిఇఎస్) అందించే వ్యాపారం చేస్తున్నాయి.

అలాగే సిగ్నిటీ కూడా ఒక పబ్లిక్ కంపెనీ కాగా, దాని ఈక్విటీ షేర్లు కూడా ‘ఎన్ఎస్ఇ, బిఎస్ఇ’  రెండింటిలోనూ నమోదై ఉన్నాయి. అదేవిధంగా ‘సిగ్నిటీ’తోపాటు దాని అనుబంధ సంస్థలు కూడా భారతదేశంలో సమాచార సాంకేతికత (ఐటీ), ఐటీ ఆధారిత, దాని ఉప-విభాగాల సేవలు (ఐటిఇఎస్) అందించే వ్యాపారం చేస్తున్నాయి.

 

ఈ లావాదేవీపై సమగ్ర ఉత్తర్వులను ‘సిసిఐ’ త్వరలో జారీ చేయనుంది.

***



(Release ID: 2028848) Visitor Counter : 33