ప్రధాన మంత్రి కార్యాలయం

పద్దెనిమిదో లోక్ సభ ఒకటో సమావేశం మొదలవడానికి కంటే ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఈ రోజుపార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం లో గర్వపడేటటువంటి రోజు,  ఇది కీర్తి ప్రదం అయినటువంటి రోజు.  స్వాతంత్య్రం అనంతర కాలం లో మొట్టమొందటి సారి గా, ఈప్రమాణాన్ని మన క్రొత్త పార్లమెంటు భవనం లో స్వీకరిస్తున్నాం’

‘‘రేపటి రోజు న,అంటే జూన్ 25 వ తేదీ న, 50 సంవత్సరాల క్రితం ఇదే తేదీ న రాజ్యాంగం పై ఒక నల్లనిమచ్చ ను రుద్దడమైంది.  అటువంటి ఒక మరక దేశానికి మరెన్నటికీ పడకుండా మనం ప్రయత్నం చేద్దాం’’

‘‘స్వాతంత్య్రంవచ్చినప్పటి నుండి రెండో సారి, ఒక ప్రభుత్వాని కి వరుసగా మూడో సారి దేశాని కి సేవ చేసేఅవకాశం లభించిం.  ఈ అవకాశం 60 ఏళ్ళ తరువాత దక్కింది’’

‘‘ప్రభుత్వాన్నినడిపేందుకు సంఖ్యాధిక్యత అవసరమని మనం నమ్ముతున్నాం; అయితే దేశాన్ని నడపడాని కి ఏకాభిప్రాయం చాలా ముఖ్యం’’

‘‘మా మూడో పదవీకాలం లో మేము మూడింతలు కఠోరం గా శ్రమించి, మరి మూడు రెట్ల ఫలితాల ను సాధిస్తాం అని దేశ ప్రజల కు నేను బరోసా నుఇస్తున్నాను’’

‘‘దేశాని కినినాదాలు అక్కరలేదు, దేశాని కి సారం కావాలి.  దేశాని కి ఒక మంచి ప్రతిపక్షం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం అవసరం’’

Posted On: 24 JUN 2024 12:40PM by PIB Hyderabad

పద్దెనిమిదో లోక్ సభ తాలూకు ఒకటో సమావేశాలు ఈ రోజు న ఆరంభం కావడాని కంటే ముందు ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

పార్లమెంటు తరహా ప్రజాస్వామ్యం లో ఈ రోజు ఒక గర్వించేటటువంటి మరియు కీర్తివంతం అయినటువంటి రోజు అని ఆయన అభివర్ణిస్తూ, తన ప్రకటన ను మొదలు పెట్టారు. ఈ రోజు స్వాతంత్య్రం అనంతరం మొట్ట మొదటిసారి గా ప్రమాణస్వీకార కార్యక్రమం నూతన పార్లమెంటు లో జరుగనుంది అని ఆయన తెలిపారు. ‘‘ఈ తరహా ముఖ్యమైనటువంటి రోజు న సరిక్రొత్త గా ఎన్నికైన ఎంపీ లకు నేను హృదయ పూర్వకం గా స్వాగతం పలుకుతూ, అందరికీ అభినందనల ను తెలియ జేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ పార్లమెంటు యొక్క రూపకల్పన భారతదేశం లో సామాన్య వ్యక్తి యొక్క సంకల్పాల ను నెరవేర్చడాని కి ఒక సాధనం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. క్రొత్త ఉత్సాహం తోను, సరిక్రొత్త వేగం తోను ముందుకు పోయేందుకు ఇది ఒక కీలకమైన అవకాశం అని ఆయన అన్నారు. 2047 వ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం పద్దెనిమిదో లోక్ సభ ఈ రోజు న తన కార్యకలాపాల ను మొదలు పెట్టుకొంటోంది అని ఆయన అన్నారు. ప్రపంచం లో అతి పెద్దది అయినటువంటి ఎన్నిక ను గొప్పగా నిర్వహించడం 140 కోట్ల మంది పౌరులు గర్వపడేటటువంటి సంగతి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ ఎన్నికల ప్రక్రియల లో 65 కోట్ల మంది కి పైగా వోటరు లు పాలుపంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్రం అనంతర కాలం లో ఒక ప్రభుత్వాని కి మూడో సారి దేశ ప్రజల కు సేవల ను అందించడం కోసం ప్రజాతీర్పు లభించింది. చరిత్ర లో ఈ విధం గా రెండో సారి మాత్రమే జరిగింది అని ఆయన అన్నారు. ‘‘60 సంవత్సరాల తరువాత ఈ అవకాశం దక్కడాన్ని పట్టి చూస్తే ఇది గర్వించదగ్గ పరిణామం గా ఉందని చెప్పవచ్చును’’ అని ఆయన అన్నారు.

మూడో పర్యాయం ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నందుకు గాను పౌరుల కు ప్రధాన మంత్రి తన కృతజ్ఞత ను తెలియ జేశారు; ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యాలకు, విధానాలకు, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సమర్పణ భావానికి ఆమోద ముద్ర ను వేసింది అని ఆయన అన్నారు. ‘‘గడచిన పదేళ్ళ లో ఒక సంప్రదాయాన్ని ఏర్పరచేందుకు మేము ప్రయత్నించాం, దీనికి కారణం ప్రభుత్వాన్ని నడపడాని కి సంఖ్యాధిక్యత అనేది అవసరం; అయితే ఒక దేశాన్ని నడపాలి అంటే సర్వసమ్మతి అనేది ఎంతో అవసరం అని మేము నమ్మాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా భరత మాత కు సేవ చేయాలనేదే ప్రభుత్వ నిరంతర కృషి గా ఉండింది, మరి 140 కోట్ల మంది పౌరుల ఆశల ను, ఆకాంక్షల ను తీర్చడం కోసం ప్రతి ఒక్కరిని వెంటపెట్టుకొని పోవాలి అని ఆయన అన్నారు.

అందరినీ కలుపుకొని ముందుకు పోవలసిన అవసరం ఉంది; భారతదేశం యొక్క రాజ్యాంగం పరిధి లో నిర్ణయ రూపకల్పన ను వేగవంతం చేయవలసి ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, పద్దెనిమిదో లోక్ సభ లో అనేక మంది యువ ఎంపీ లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించనుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క సంప్రదాయాల లో పద్దెనిమిదో సంఖ్య కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, గీత లో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి; అవి కర్మ, కర్తవ్యం, ఇంకా కరుణ ల తాలూకు సందేశాన్ని ఇస్తున్నాయన్నారు. పురాణాలు మరియు ఉప పురాణాలు పద్దెనిమిది ఉన్నాయి; పద్దెనిమిది యొక్క మూల అంకె తొమ్మిది, అది పరిపూర్ణత కు ప్రతీకాత్మకం. మరి భారతదేశం లో చట్టబద్ధం గా వోటు వేసే వయస్సు 18 ఏళ్ళు అని ఆయన వివరించారు. ‘‘పద్ధెనిమిదో లోక్ సభ భారతదేశాని కి అమృత కాలం గా ఉంది. ఈ యొక్క లోక్ సభ ఏర్పాటు కూడాను ఒక శుభ సంకేతమే’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

రేపటి రోజు న అంటే, జూన్ 25 వ తేదీ న, దేశం లో అత్యవసర స్థితి హయాము అమలై 50 సంవత్సరాలు అవుతున్నాయి; మరి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం లో ఒక నల్లటి మచ్చ ను సూచిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని పూర్తి గా త్రోసిపుచ్చడం, ప్రజాస్వామ్యాన్ని అణగద్రొక్కడం మరియు దేశాన్ని ఒక కారాగారం గా మార్చివేయడం జరిగిన అటువంటి రోజు ను భారతదేశం లో నవ తరం ఎన్నటికీ మరచి పోదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజాస్వామిక సంప్రదాయాల ను పరిరక్షిస్తాం అంటూ ఒక సంకల్పాన్ని పౌరులు అందరు తీసుకోవాలి. అలా చేస్తే గనక ఆ తరహా ఘటన మళ్లీ ఎన్నడూ తల ఎత్తదు అని ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘మనం ఒక చైతన్య భరితమైనటువంటి ప్రజాస్వామ్యం తాలూకు సంకల్పాన్ని తీసుకొందాం, అలాగే భారతదేశం యొక్క రాజ్యాంగానుసారం సామాన్య ప్రజల కలల ను పండించుదాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రజలు ప్రభుత్వాన్ని మూడో సారి ఎన్నుకొన్నందువల్ల ప్రభుత్వం యొక్క బాధ్యత మూడింతలు అయింది అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ప్రభుత్వం ఇదివరకటి కంటే మూడు రెట్లు కఠోరంగా శ్రమిస్తుందని, అలాగే మూడింతల ఫలితాల ను కూడా అందిస్తుంది అని పౌరుల కు ఆయన హామీ ని ఇచ్చారు.

క్రొత్త గా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల పై దేశం ఎన్నో ఆశల ను పెట్టుకొంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ అవకాశాన్ని ప్రజల సంక్షేమం, ప్రజల కు సేవ చేయడం కోసం వినియోగించుకోవాలని మరియు ప్రజా హితం లో సాధ్యమైన అన్ని చర్యల ను తీసుకోవాలని ఎంపీ లు అందరికీ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం యొక్క పాత్ర ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, వారు వారి యొక్క భూమిక ను పూర్తి స్థాయి లో పోషించాలని ప్రజలు ఆశిస్తున్నారు, అలాగే ప్రజాస్వామ్యం యొక్క హుందాతనాన్ని కాపాడాలని వారు కోరుకొంటున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘విపక్షం ఈ ఆశల ను నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. ప్రజలు నినాదాల కు బదులు గా సారాన్ని కోరుకొంటారు అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సామాన్య పౌరుల యొక్క అంచనాల ను నేరవేర్చడాని కి ఎంపీ లు ప్రయత్నిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే సంకల్పాన్ని నెరవేర్చడానికి పార్లమెంటు సభ్యులు అందరు సమష్టి గా నెరవేర్చాల్సిన బాధ్యత ను తీసుకోవాలని, మరి ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 25 కోట్ల మంది పౌరులు పేదరికం నుండి బయటకు రావడం అనే పరిణామం భారతదేశం పేదరికం బారి నుండి విముక్తం కావడం లో అతి త్వరలో విజయవంతం కాగలుగుతుందన్న ఒక క్రొత్త నమ్మకాన్ని ఏర్పరచిందని ఆయన అన్నారు. ‘‘మన దేశం లోని ప్రజలు, 140 కోట్ల మంది పౌరులు, కష్టించి పని చేయడం లో ఏనాడు వెనుకంజ వేయరు, మనం వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాల ను కల్పించాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పద్దెనిమిదో లోక్ సభ సామాన్య పౌరుల కలల ను నెరవేర్చుతుంది, మరి ఈ సభ సంకల్పాల సభ గా మారుతుంది అని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల కు అభినందనల ను తెలియజేస్తూ, వారు వారి యొక్క నూతన బాధ్యత ను అత్యంత సమర్పణ భావం తో నిర్వర్తించాలి అంటూ వారికి విజ్ఞప్తి చేస్తూ తన ప్రకటన ను ముగించారు.

 

 

 

***

DS/TS



(Release ID: 2028340) Visitor Counter : 31