ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గణతంత్ర దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన గౌర‌వ‌నీయ‌ సిరిల్ రమాఫోసాకు ప్రధాని మోదీ అభినందన

Posted On: 17 JUN 2024 5:11PM by PIB Hyderabad

   ణతంత్ర దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఇవాళ తిరిగి ఎన్నికైన గౌరవనీయ సిరిల్ రమాఫోసాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్- దక్షిణాఫ్రికాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా అధ్యక్షులు రమాఫోసాతో సంయుక్త కృషికి తాను సంసిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘గౌరవనీయ రమాఫోసా గారూ! @CyrilRamaphosa దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడిగా మీరు మరోసారి ఎన్నికైనందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేదిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సంసిద్ధుడైన ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 2028161) Visitor Counter : 60