కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఇన్నోవేషన్, టెక్నలాజికల్ అడ్వాన్స్ మెంట్ విభాగాల్లో ప్రతిపాదనలకు ఆహ్వానాలు ప్రకటించిన టెలీకమ్యూనికేషన్ శాఖ
ప్రతిపాదనలు ఆహ్వానించిన విభాగాలు ‘‘5జి ఇంటర్నెట్ విలేజ్’’; ‘‘క్వాంటమ్ ఎన్ క్రిప్షన్ ఆల్గోరిథమ్’’
గ్రామీణుల జీవితాలను పరివర్తన చేసి డిజిటల్ ఇంక్లూజన్, ఆర్థిక వృద్ధి సాధించడానికి ఉద్దేశించినదే ఇంటెలిజెంట్ విలేజ్ కార్యక్రమం
డిజిటల్ కమ్యూనికేషన్ చానెల్స్ కు ఆధునిక వినియోగానికి ఉద్దేశించినది క్వాంటమ్ ఎన్ క్రిప్షన్ ఆల్గోరిథమ్
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 31.07.2024
Posted On:
17 JUN 2024 9:04PM by PIB Hyderabad
దేశంలో ఇన్నోవేటివ్ స్టార్టప్ లను ప్రోత్సహించడం; పరిశోధన, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు అనుకూల వాతావరణం కల్పించడం లక్ష్యంగా చేపట్టిన జై అనుసంధాన్ కార్యక్రమంలో భాగంగా టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఇన్నోవేషన్, సాంకేతిక పురోగతిని సాధించడం కోసం టెలీకమ్యూనికేషన్ల శాఖ (డాట్) రెండు ప్రధానమైన ప్రకటనలు చేసింది. దేశీయ ఆర్ అండ్ డిని, ఐపి నమోదును ప్రోత్సహించడం, సమ్మిళిత డిజిటల్ వృద్ధిని సాధించడం ఈ ప్రకటనల లక్ష్యం.
డాట్ ప్రతిపాదనలు ఆహ్వానించిన రెండు విభాగాల్లో ‘‘5జి ఇంటర్నెట్ విలేజ్’’; ‘‘క్వాంటమ్ ఎన్ క్రిప్షన్ ఆల్గోరిథమ్’’ ఉన్నాయి. టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి; టెలీ కమ్యూనికేషన్ ఉత్పత్తులు, సొల్యూషన్ల విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నపరిశ్రమ, ఎంఎస్ఎంఇ, స్టార్టప్ లు, విద్యా రంగం, ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలను డాట్ ఆహ్వానించింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులకు డాట్ నిర్వహణలోని టెలికాం టెక్నాలజీ అభివృద్ధి నిధి (టిటిడఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అందిస్తారు. సామాజిక ప్రయోజనం కోసం ఆధునిక టెలికాం టెక్నాలజీల వినియోగం, టెలీ కమ్యూనికేషన్ ఇన్నోవేషన్ లో బారతదేశం నాయకత్వాన్ని సుస్థిరం చేయడం కోసం తీసుకునే చర్యలకు ఇవి ప్రాతినిథ్యం వహిస్తాయి.
5జి ఇంటెలిజెంట్ విలేజ్
గ్రామీణ సమాజాల అభ్యున్నతికి 5జి టెక్నాలజీల పరివర్తిత శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా సాంకేతిక పురోగతిలో సమానత్వ సాధనకు 5జి ఇంటెలిజెంట్ విలేజ్ కార్యక్రమం దోహదపడుతుంది. ఆహ్వానించిన ప్రతిపాదన - ‘‘కనెక్టివిటీ వ్యత్యాసాల నుంచి స్మార్ట్ సొల్యూషన్లు : రూరల్ ఇన్నోవేషన్ కు అవసరమైన 5 జి నెట్ వర్క్ ల డిజైనింగ్-5జి ఇంటెలిజెంట్ విలేజ్ లు’’. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, సుస్థిరత వంటి కీలక రంగాల కోసం ఇది పని చేస్తుంది. ఈ దిగువ గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని అమలుపరుస్తారు.
· ధర్మజ్, ఆనంద్ జిల్లా, గుజరాత్
· రామ్ గఢ్ ఉర్ఫ్ రజాహి, గోరఖ్ పూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
· ఆనంద్ పూర్ జల్బేరా, అంబాలా జిల్లా, హర్యానా
· బజర్ గాంవ్, నాగపూర్ జిల్లా, మహారాష్ర్ట
· భగవాన్ పురా, భిల్వారా జిల్లా, రాజస్తాన్
· డబ్లాంగ్, నాగాం జిల్లా, అస్సాం
· రౌసార్, అశోక్ నగర్ జిల్లా, మధ్యప్రదేశ్
· ఆరి, గునా జిల్లా, మధ్యప్రదేశ్
· బన్స్ ఖేది, శివపురి జిల్లా, మధ్యప్రదేశ్
· బుర్రిపాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
దీని కింద ఎంపిక చేసిన జిల్లాల్లో 5జికి చెందిన అల్ర్టా-రిలయబుల్ లో-లాటెన్సీ కమ్యూనికేషన్ (యుఆర్ఎల్ఎల్ సి); మాసివ్ మెషీన్ టైప్ కమ్యూనికేషన్ (ఎంఎంటిసి) సమర్థవంతంగా వినియోగించి 5జి కనెక్టివిటీ ప్రయోజనాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం కవరేజి లేని ప్రాంతాల్లో 5జి కనెక్టివిటీ నెలకొల్పాల్సి ఉంటుంది. 5జి సామర్థ్యాలను పూర్తిగా వినియోగంలోకి తేవడం; పరిశోధన, అభివృద్ధి హబ్ గా పని చేయడం లక్ష్యంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, సెన్సర్ తయారీ కంపెనీలు, సిసిటివి సరఫరాదారులు, ఐఓటి సేవలందించే వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. మరిన్ని వివరాలను ఈ లింక్ ద్వారా పొందవచ్చు.
(https://ttdf.usof.gov.in/users/intelligentvillage).
క్వాంటమ్ ఎంక్రిప్షన్ ఆల్గోరిథమ్ (క్యుఇఏ)
క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా డిజిటల్ కమ్యూనికేషన్ చానళ్లకు అవసరం అయిన భారత కాలమాన పరిస్థితులను సరిపోయే క్వాంటమ్ ఎన్ క్రిప్షన్ ఆల్గోరిథమ్ (క్యుఇఏ) తయారుచేయడం దీని లక్ష్యం. ఈ ఆల్గోరిథమ్ అసామాన్య భద్రతను; అడ్వాన్స్ డ్ ఎంక్రిప్షన్ సామర్థ్యాలను; అమిత వేగవంతమైన, సమర్థవంతమైన ఎంక్రిప్షన్ ను అందించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ దిగువ లింక్ క్లిక్ చేయండి.
(https://ttdf.usof.gov.in/users/quantumencryption).
దరఖాస్తులు సమర్పించడానికి తుది గడువు 31.07.2024
డిజిటల్ స్థితిస్థాపకత గల భవిష్యత్తు కోసం 5జి, క్వాంటమ్ ఎన్ క్రిప్షన్ సామర్థ్యాలను వినియోగించుకోవడంలో సహకారపూర్వక ప్రయత్నాలను డాట్ ఆహ్వానిస్తోంది.
మరిన్ని వివరాలు పొందేందుకు క్లిక్ చేయండి. https://ttdf.usof.gov.in/
టెలికాం టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ (టిటిడిఎఫ్)
భారత ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల శాఖ (డాట్) యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ నిది (యుసాఫ్) నుంచి టెలికాం టెక్నాలజీ డెవలప్ మెంట్ నిధిని (టిటిడిఎఫ్) ఏర్పాటు చేసింది. టెలీ కమ్యూనికేషన్ రంగానికి అవసరమైన పరిశోధన, డిజైన్, ప్రోటో టైపింగ్, కాన్సెప్ట్ కు సంబంధించిన ఆధారాల పరీక్ష, ఐపిఆర్ సృష్టి, క్షేత్ర స్థాయి పరీక్షలు, భద్రత, సర్టిఫికేషన్, ఉత్పత్తుల తయారీ రంగాలకు దీని ద్వారా నిధులు అందిస్తుంది. సవివరమైన మార్గదర్శకాలు టిటిడిఎఫ్ వెబ్ సైట్ https://ttdf.usof.gov.in/ ద్వారా పొందవచ్చు.
***
(Release ID: 2028156)
Visitor Counter : 59