కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ఐఐటి వేదికగా మొదటి నెట్ వర్కింగ్ కార్యక్రమం సంగమ్ డిజిటల్ ట్విన్ ను నిర్వహించిన డిఓటి
డిజిటల్ ట్విన్ ఆధారిత పరిష్కారాలకోసం సమగ్రమైన బ్లూప్రింట్లను అందించిన కార్యక్రమం. సవాళ్లను పరిష్కరిస్తూ వివిధ సమాచార వనరులను బలోపేతం చేసిన కార్యక్రమం.
భాగస్వాములు ఐకమత్యంగా పని చేయడంద్వారా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడమనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చాటిన కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్
Posted On:
20 JUN 2024 8:33PM by PIB Hyderabad
ఢిల్లీ ఐఐటి వేదికగా మొదటి నెట్ వర్కింగ్ కార్యక్రమం సంగమ్ డిజిటల్ ట్విన్ ను డిఓటి నిర్వహించింది. ఇది డిజిటల్ ట్విన్ ఆధారిత పరిష్కారాలకోసం అవసరమైన సమగ్రమైన బ్లూప్రింట్లను తయారు చేసింది. ఈ కార్యక్రమం సవాళ్లను పరిష్కరిస్తూ వివిధ సమాచార వనరులను బలోపేతం చేయడం ఎలాగో తెలియజేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమంద్వారా వచ్చిన ఫలితాలతో ఆయా పరిష్కారాల డిజైన్ , నిర్మాణంకు మార్గం ఏర్పడుతుంది. వివిధ భాగస్వాముల పాత్రను ఈ ఫలితాలు నిర్విచిస్తాయి. అంతే కాదు వీటితో భవిష్యత్ వినియోగదారులను గుర్తించడం జరుగుతుంది. నిధుల నిర్మాణాన్ని విశదీకరిచంచడం, పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అమలుకు కావవలసిన రోడ్ మ్యాప్‌ల తయారీ జరుగుతుంది.
టెలి కమ్యూనికేషన్ల శాఖ మొదటి నెట్ వర్కింగ్ కార్యక్రమం డిజిటల్ ట్విన్ ను ఈ నెల 18నుంచి 19 వరకూ ఢిల్లీ ఐఐటి వేదికగా విజయవంతంగా నిర్వహించడం జరిగిది. ఈ కార్యక్రమంలో వందమంది భాగస్వాములు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో వినూత్నమైన డిజిటల్ పరిష్కారాలను చర్చించడం కోసం పలు కీలక కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కీలక అంశాలపై (వర్టికల్స్) జరిగిన చర్చలు జరిగాయి. అవి ఏంటంటే మల్టీ మోడల్ రవాణా ప్రణాళిక, ఆరోగ్యభద్రత అందుబాటును, సేవలను అధికం చేయడం, వాతావరణ నాణ్యత మదింపు, ప్రకృతి విపత్తుల స్పందన వ్యవస్థ నిర్వహణ.
వీటికి అదనంగా చర్చలు జరిగిన కీలక అంశాలు (హారిజాంటల్) మరికొన్ని ఇలా వున్నాయి. ప్రైవసీని పెంచే సాంకేతికతలు ( పిఇటిలు), డాటా ప్రొవైడర్, ఏఐ పాలన ఫ్రేమ్ వర్క్, విర్చువల్ ప్రపంచ కల్పన, చర్చల సామర్థ్యాలు, గణితపరమైన మోడలింగ్, భౌతికశాస్త్ర ఆధారిత సిమ్యులేషన్లు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన టెలికమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ సాధ్యంకాగల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, నిధులను సేకరణ నేవి మన లక్ష్యాలని అన్నారు. జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేసే సాధ్యాసాధ్యాలను తెలియజేయడంకోసం ఈ పని చేస్తున్నామని అన్నారు.
ఇలాంటి కార్యక్రమల కారణంగా ఆయా భాగస్వాముల మధ్య సహాయ సహకారాలు ఏర్పడి కొత్త ప్రాజెక్టులను చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నూతన ఆలోచనలకు, నూతన విజ్ఞానాలకు, నూతన సామర్థ్యాలకు మార్గం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలను పరిష్కరించడంద్వారా వినూత్నమైన, సమగ్రమై పరిష్కారాలకోసం భాగస్వాములయ్యారు. వివిధ వనరులద్వారా లభించే సమాచారాన్ని వినియోగడంపైనా చర్చలు జరిగాయి. వర్తమానంలో ఎదురయ్య సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ ఆధారిత ఆలోచనల ప్రాధాన్యతను, సహకారపూరిత వాతావరణ ఆవశ్యకతను చర్చించారు.
నెట్ వర్కింగ్ కు సంబంధించి త్వరలో జరగబోయే కార్యక్రమాల వివరాలు ఇలా వున్నాయి. ముంబాయి ఐఐటి వేదికగా జూన్ 25-26 న, బెంగళూరు పిఇఎస్ విశ్వవిద్యాలయంలో జులై 3-4 వరకూ, హైదరాబాద్ టి హబ్ లో జులై 10-11 తేదీలలో కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత భాగస్వాములందరూ పాల్గొంటారని టెలికమ్యూనికేషన్ల విభాగం ఆకాంక్షిస్తోంది.
డిజిటల్ పరిష్కారాల విషయంలో ప్రగతిని సాధించేలా ఆయా కంపెనీలు, ప్రతినిధులు చూపిన చొరవకు టెలికమ్యూనికేషన్ విభాగం తన కృతజ్ఞతలను తెలియజేసింది.
సంగమ్ నేపథ్యం: అత్యాధునిక సాంకేతికతల్ని, సామూహిక మేధస్సులను వినియోగించడంద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక, డిజైన్ అంశాల్లో విప్లవాత్మక మార్పులను తేవడానికి సంగమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని మొదలుపెట్టినప్పటినుంచీ గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. సుస్థిరమైన, సమర్థవంతమైన మౌలిక సదుపాయాల పరిష్కారాలకోసం సాంకేతికత శక్తిని వినియోగించుకోవడంలో అందరి సహాయసహకారాలను ఇది ప్రతిబింబిస్తోంది.
(Release ID: 2027271)
Visitor Counter : 109