వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తాత్కాలిక ఇన్‌పుట్ అవుట్‌పుట్ ప్రమాణాల నిర్ధారణ కోసం సిస్టమ్ ఆధారిత నిబంధనల ఆధారిత ఫేస్‌లెస్ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్న డీజీఎఫ్టి
प्रविष्टि तिथि:
20 JUN 2024 7:41PM by PIB Hyderabad
విదేశీ వాణిజ్య ప్రక్రియలను ఆధునీకీరించడంతో పాటు క్రమబద్దీకరన్ చేయాలని సంకల్పించింది డైరెక్టర్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టి). దీనిలో భాగంగా తాత్కాలిక ఇన్‌పుట్ అవుట్‌పుట్ ప్రమాణాల నిర్ధారణ కోసం సిస్టమ్ ఆధారిత, నిబంధనల ఆధారిత ఫేస్‌లెస్ ఆటోమేషన్‌ను అమలు చేస్తుంది. ఎగుమతిదారులకు మరింత సులభతరమైన వాణిజ్య ప్రక్రియలను అందించడానికి, డీజీఎఫ్టి, సంబంధిత ఎగుమతిదారుల సమయాన్ని పొదుపు చేయడం దీని లక్ష్యం. ఈ మార్పులు సాంకేతిక ఇంటర్‌ఫేస్‌లు, సహకార సూత్రాలను స్వీకరించే సులభతర పాలన వైపు విస్తృత విధాన మార్పుతో సమలేఖనం చేస్తుంది.
అలాగే అడ్వాన్స్ అథరైజెషన్ పథకం కింద నిబంధనలను మరింత క్రమబద్దీకరించి, ప్రక్రియలను ఆధునికీకరించడానికి డీజీఎఫ్టి చర్యలు చేపట్టింది. గతంలో 14.03.2024 నాటి పబ్లిక్ నోటీసు నం. 51/2023 ద్వారా హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్ 2023లోని 4.14, 4.06 పేరాలను సవరిస్తూ సవరణను ప్రకటించింది.
అంతేకాకుండా, డీజీఎఫ్టి ఇతర విదేశీ వాణిజ్య విధాన ప్రక్రియలు, విధానాల కోసం ఇలాంటి ఆటోమేషన్ కార్యక్రమాలను చురుకుగా కొనసాగిస్తోంది. ఆధునీకరణ, వాణిజ్య సులభతరంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాని నిబద్ధతను చాటుతుంది.
డీజీఎఫ్టి విదేశీ వాణిజ్య విధానం అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్‌ను నిర్వహిస్తుంది. ఇది ఎగుమతి ఉత్పత్తి కోసం ఇన్‌పుట్‌ల సుంకం-రహిత దిగుమతిని సులభతరం చేస్తుంది. ఇందులో ఇన్‌పుట్‌ల భర్తీ లేదా డ్యూటీ రిమిషన్ ఉంటుంది. ఇన్‌పుట్-అవుట్‌పుట్ నిబంధనల ఆధారంగా సెక్టార్-నిర్దిష్ట నిబంధనల కమిటీల ద్వారా ఇన్‌పుట్‌ల అర్హత నిర్ణయిస్తారు.
ఏప్రిల్ 2023లో కొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీని ప్రకటించినప్పటి నుండి, ఎఫ్టిపి పరిథి కింద ఆటోమేటెడ్, రూల్-బేస్డ్ ప్రాసెస్‌లను విస్తరించేందుకు డీజీఎఫ్టి తన వ్యవస్థలను చురుకుగా పునరుద్ధరిస్తోంది. ఈ మెరుగుదల చర్యలు పోస్ట్-ఇష్యూన్స్ ఆడిట్ సామర్థ్యాలు, రిస్క్ మిటిగేషన్ ఫంక్షన్‌లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, దిగుమతిదారు-ఎగుమతిదారు కోడ్ (ఐఈసి) జారీ, సవరణ, స్టేటస్ హోల్డర్ సర్టిఫికేట్‌ల జారీ, ఆర్సిఎంసి పునరుద్ధరణ, అడ్వాన్స్ ఆథరైజేషన్‌ల జారీ, రీవాలిడేషన్, పొడిగింపు, అలాగే ఇన్‌స్టాలేషన్ కోసం ధృవీకరణ వంటి అనేక ప్రక్రియలు ఈపిసిజి పథకం, ఇప్పటికే నియమ-ఆధారిత స్వయంచాలక ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2027258)
आगंतुक पटल : 97