జౌళి మంత్రిత్వ శాఖ

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2024 సంద‌ర్భంగా 550 మంది దివ్యాంగుల‌కోసం పిడియుఎన్ ఐ పిపిడి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక యోగా క్యాంప్ నిర్వ‌హ‌ణ‌

Posted On: 20 JUN 2024 7:00PM by PIB Hyderabad

ప్ర‌తి ఏడాది జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్ప‌వాన్ని నిర్వ‌హించడం జ‌రుగుతోంది. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ 69వ స‌మావేశ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ దార్శ‌నిక ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌క్తిగ‌తంగాను, సామాజికంగాను యోగాను ఉప‌యోగించుకోవాల‌నే థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకోవ‌డం జ‌రుగుతోంది
దివ్యాంగుల‌కోసం ప్ర‌త్యేక యోగా క్యాంప్ ను  కేంద్ర‌ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ‌శాఖ ఆధీనంలోని పండిట్ దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ ప‌ర్స‌న్స్ విత్ పిజిక‌ల్ డిజెబిలిటీస్ ( పిడియు ఎన్ ఐ పిపి డి)  నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో 550 మంది దివ్యాంగులు, 200 మందికి పైగా సిబ్బంది, విద్యార్థులు పాల్గొంటున్నారు. 
న్యూఢిల్లీలోని బ‌ర‌కంబా రోడ్డులోని మోడ‌ర‌న్ స్కూల్ లో జూన్ 21న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త స‌హాయ  మంత్రిత్వ‌శాఖ మంత్రి శ్రీ బిఎల్ వ‌ర్మా హాజ‌రుకానున్నారు. దివ్యాంగుల సాధికార‌త విభాగ కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ అగ‌ర్వాల్ గౌర‌వ అతిథిగా హాజ‌రు కానున్నారు. 

 

***



(Release ID: 2027257) Visitor Counter : 13


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP