మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జాతీయ పరీక్ష సంస్థ(ఎన్‌టీఏ) 2024 జూన్ 18న రెండు విడతల్లో, ఓఎంఆర్(పెన్ను మరియు పేపర్) విధానంలో యూజీసీ-నెట్ జూన్ 2024 పరీక్షను నిర్వహించింది.
Posted On:
19 JUN 2024 10:02PM by PIB Hyderabad
ఈ పరీక్షకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రం(ఐ4సీ)లోని జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం నుంచి 2024 జూన్ 19న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి కొంత సమాచారం అందించింది. ఈ పరీక్ష సమగ్రత లోపించి ఉండవచ్చని ప్రాథమికంగా ఈ సమాచారం సూచిస్తోంది.
పరీక్ష ప్రక్రియలో ఉన్నత స్థాయి పారదర్శకత మరియు పవిత్రతకు పూచీగా ఉండేందుకు గానూ కేంద్ర విద్యా శాఖ యూజీసీ-నెట్ జూన్ 2024 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సరికొత్తగా మరోసారి పరీక్ష జరగనుండగా ఇందుకు సంబంధించిన సమాచారం వేరుగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సమయంలో, ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపే బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించబడింది.
నీట్(యూజీ) 2024 పరీక్ష
నీట్(యూజీ) పరీక్ష - 2024కు సంబంధించిన గ్రేస్ మార్కుల అంశం పరిష్కారమైంది. పట్నాలో ఈ పరీక్ష నిర్వహణలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి బీహార్ పోలీసు శాఖలోని ఆర్థిక నేర విచారణ విభాగం నుంచి పూర్తి నివేదికను కోరడం జరిగింది. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
పరీక్షలపై విశ్వాసాన్ని కాపాడేందుకు మరియు విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఈ అంశంలో ఏ వ్యక్తి లేదా సంస్థ పాత్ర ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పునరుద్ఘాటించింది.
***
(Release ID: 2027073)
Visitor Counter : 156