రక్షణ మంత్రిత్వ శాఖ
సెశెల్స్ లోనిపోర్ట్ విక్టోరియా కు చేరుకొన్న ఐఎన్ఎస్ సునయన
Posted On:
18 JUN 2024 4:29PM by PIB Hyderabad
సదర్న్ నావల్ కమాండ్ లో భాగంగా ఉన్న ఒక సముద్ర గస్తీ నౌక ‘ఐఎన్ఎస్ సునయన’ 2024 జూన్ 15 వ తేదీ న సెశెల్స్ కోస్ట్ గార్డ్ శిప్ (ఎస్‌సిజిఎస్) జోరొవాస్టర్ తో పాటు సెశెల్స్ లోని పోర్ట్ విక్టోరియా లో ప్రవేశించింది. జోరొవాస్టర్ ఇటీవలే భారతదేశం లో గార్డెన్ రీచ్ శిప్ బిల్డర్స్ ఎండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జిఆర్ఎస్ఇ) లో తన రీఫిట్ పనుల ను పూర్తి చేసుకొన్నది.
ఐఎన్ఎస్ సునయన రావడం తోనే సెశెల్స్ కోస్ట్ గార్డ్ యొక్క అధికారులు మరియు భారతదేశం యొక్క రాయబార కార్యాలయం అధికారులు స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ నౌక తన యాత్ర కాలం లో, భారతీయ నౌకాదళం మరియు సెశెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ల ఉద్యోగులు ఆధికారిక సమావేశాల లోను, సామాజిక సమావేశాల లోను పాలుపంచుకోవడం తో పాటుగా పరస్పరం డెక్ విజిట్స్ లో భాగం అవుతారు. ఈ నౌక పోర్ట్ విక్టోరియా లో విడిది చేసే కాలం లో, సెశెల్స్ కోస్ట్ గార్డ్ తో కలసి ఇఇజడ్ యొక్క సంయుక్త నిఘా బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. సెక్యూరిటీ ఎండ్ గ్రోథ్ ఫార్ ఆల్ ఇన్ ద రీజన్ ( ఎస్ఎజిఎఆర్- ‘సాగర్’) దృష్టికోణాని కి అనుగుణం గా, భారతీయ నౌకాదళాని కి మరియు సెశెల్స్ కోస్ట్ గార్డు కు మధ్య మిత్రత్వాన్ని, ఇంకా సహకారాన్ని మరింత బలపరచుకోవాలన్నదే ఈ సందర్శన యొక్క ధ్యేయం గా ఉంది.
(1)6G7Q.JPG)
***
(Release ID: 2026252)