రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైనిక ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఒళ్లు తీవ్రంగాకాలినందువల్ల ఏర్పడ్డ గాయాలకు మరియు చర్మానికి సంబంధించిన ఇతర రోగాలకు చికిత్సకోసం స్కిన్ బ్యాంక్ సదుపాయాన్ని ప్రారంభించిన ఆర్మీ హాస్పిటల్ (ఆర్ & ఆర్)

Posted On: 18 JUN 2024 1:22PM by PIB Hyderabad

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ పరిధి లో మొట్ట మొదటిదైన అత్యాధునిక స్కిన్ బ్యాంక్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు న్యూ ఢిల్లీ లోని ఆర్మీ హాస్పిటల్ (రిసర్స్ & రెఫరల్) 2024 జూన్ 18 న ఒక ప్రకటించింది. సైనికోద్యోగులు మరియు వారి కుటుంబాల కు అగ్ని వల్ల అయిన తీవ్ర గాయాలు మరియు చర్మ సంబంధి అన్య రోగాల చికిత్స లో విప్లవాత్మకమైన మార్పుల ను తీసుకు రావాలన్నదే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం లక్ష్యం గా ఉంది.

ఈ క్రొత్త స్కిన్ బ్యాంక్ స్కిన్ గ్రాఫ్ట్ ల సేకరణ, శుద్ధి, నిలవ మరియు పంపిణిలకు ఒక కేంద్రీకృత నిలయం వలె పనిచేస్తుంది. ఇది దేశం అతటా సైనిక వైద్య చికిత్స కేంద్రాల కోసం ఒక ముఖ్య వనరు ను సమకూర్చుతుంది. ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, సాయుధ బలగాల సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు అన్నిటి కంటె ఉన్నతమైన చర్మ మార్పిడి సంబంధి చికిత్స ను అందుబాటు లోకి తీసుకు రావడానికి పూచీ పడాలి అని సాయుధ దళాలు భావించాయి.

 

ఈ స్కిన్ బ్యాంకు లో ప్లాస్టిక్ సర్జన్ లు, టిష్యూ ఇంజినీర్ లు, ఇంకా విశేష సాంకేతిక నిపుణులు సహా ఉన్నత శిక్షణ ను పొందిన వైద్య వృత్తి నిపుణుల జట్టు పనిచేస్తుంది. ఈ కేంద్రం నాణ్యత నియంత్రణ మరియు సురక్ష్ ల తాలూకు అత్యున్నత ప్రమాణాల కు కట్టుబడి పని చేస్తుంది. దీని ద్వారా స్కిన్ గ్రాఫ్ట్ విషయం లో పటిష్టత పరమైనటువంటి, విశ్వసనీయత పరమైనటువంటి పూచీ లభిస్తుంది.

డిజిఎమ్ఎస్ (ఆర్మీ) మరియు కర్నల్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ అరిందమ్ చటర్జీ మాట్లాడుతూ, ఈ స్కిన్ బ్యాంకు యొక్క ప్రారంభం సైనికోద్యోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ల పట్ల అచంచలమైనటువంటి నిబద్ధత కు ఒక నిదర్శన గా ఉందన్నారు. ఈ కేంద్రం సంరక్షణ పరం గా నాణ్యత ను వృద్ధి చెందింప చేయడం ఒక్కటే కాకుండా తీవ్రమైన గాయాల బారిన పడ్డ వ్యక్తుల కు తగిన సహాయాన్ని అందించే సామర్థ్యం సైతం బలపడుతుందని ఆయన అన్నారు.

‘‘చర్మ కణజాలాని కి సంబంధించిన ఒక విశిష్టమైన వనరుల ను కలిగి ఉండడం తో మేము మా రోగుల కు అత్యంత ప్రభావవంతం అయినటువంటి మరియు వ్యక్తిపరమైనటువంటి చికిత్సల ను అందించగలుగుతాం, దీని ద్వారా అంతిమం గా వారు పునఃస్వస్థులు అయ్యే అవకాశాలలోను, పునరాశ్రయాన్ని పొందే అవకాశాలలోను మెరుగుదల సాధ్యపడుతుంది’’ అని ఆర్మీ హాస్పిటల్ (ఆర్ & ఆర్) కమాండంట్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ అజీత్ నీలకంఠన్ అన్నారు.

 

***

 



(Release ID: 2026215) Visitor Counter : 41