మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పిఎం శ్రీ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ఎన్ఎంఎం, ఎన్ పిఎస్ టిలపై ఓరియెంటేషన్ సెషన్ నిర్వహించిన ఎన్ సిటిఇ

Posted On: 16 JUN 2024 6:04PM by PIB Hyderabad

దేశంలోని 29 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కెవిఎస్ లు/ఎన్ విఎస్ లలోని పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం జాతీయ మెంటారింగ్ కార్యక్రమం (ఎన్ఎంఎం), ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి వృత్తి ప్రమాణాలు (ఎన్  పిఎస్ టి) అనే అంశాలపై విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత (డిఓఎస్ఇఎల్) విభాగం నిర్దేశకత్వం మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ టిఎస్ఇ) 5 రోజుల పాటు వర్చువల్ ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించింది. లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన విద్యా విధానం (ఎన్ఇపి) 2020 సమర్థవంతంగా అమలు పరిచేందుకు వీలుగా పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు తగు ప‌రిజ్ఞానం, నైపుణ్యాలు అలవరచడం, తద్వారా సామర్థ్యాల నిర్మాణం లక్ష్యంగా 2024 జూన్ 10-14 తేదీల మధ్యన ఈ సెషన్లు నిర్వహించారు.  

ఎన్ఎంఎం, ఎన్ పిఎస్ టిలపై తగినంత సమాచారం అందించడం కోసం ఒక్కో సెషన్ రెండు గంటల వంతున ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ రోజూ విభిన్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేశారు. ఉపాధ్యాయులు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించి  నైపుణ్యాలు అలవరచి, విద్యార్థులకు బలమైన పునాది వేసే విధంగా వారిని సాధికారం చేయడం కోసం ఈ కార్యక్రమాలు రూపొందించారు. ఈ సెషన్లు మరింత సజీవంగా కనిపించేలా చేసేందుకు సంకేత భాషల ఇంటర్ ప్రెటర్లను కూడా భాగస్వాములను చేశారు. ఈ సెషన్లలో పాల్గొనడం ద్వారా పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్ పిఎస్ టి, ఎన్ఎంఎంపై లోతైన అవగాహన ఏర్పరచుకుని, వాటి అమలు వ్యూహాలు అలవరచుకోగలుగుతారు. 

ఎన్ సిటిఇ చైర్ పర్సన్ ప్రొఫెసర్ పంకజ్ అరోరా, సభ్య కార్యదర్శి శ్రీమతి కెసాంగ్ వై షెర్పా పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఎన్ పిఎస్ టి, ఎన్ఎంఎం సెషన్లకు అవసరం అయిన కార్యక్రమాలు రూపొందించారు.  జాతీయ మెంటారింగ్ మిషన్ (ఎన్ఎంఎం) సెషన్ లో ఎన్ఎంఎంపై సమగ్రమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. రిజిస్ర్టేషన్ ప్రాసెస్, ఎన్ఎంఎం పోర్టల్ వినియోగంపై మెంటార్లు, మెంటీల కోసం టెక్నికల్ డెమానిస్ర్టేషన్ ప్రదర్శించారు. మెంటార్లు, మెంటీల మధ్య పరస్పర సంభాషణ కోసం ఎన్ఎంఎం డిజిటల్ పోర్టల్ ద్వారా ఎన్ సిటిఇ మద్దతు ఇచ్చింది.  

ఎన్ పిఎస్ టి మార్గదర్శక పత్రంలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా పనితీరు, వ్యూహాలు మెరుగుపరుచుకోవడంపై పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు అవగాహన పెంచుకునే విధంగా వారిని సాధికారం చేయడంపై ఎన్ పిఎస్ టి ఫోకస్ పెట్టింది.  అలాగే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల్లో సామర్థ్యాల నిర్మాణం కోసం ఎన్ పిఎస్ టి మార్గదర్శక పత్రంలోని సిఫార్సులకు అనుగుణంగా ఉపాధ్యాయుల కోసం మూడు కీలక ప్రమాణాలను ఈ సెషన్ లో నిర్దేశించారు. ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన, వ్యక్తిగత లక్ష్యాల సాధనకు ఉపయోగపడేలా పోటీ సామర్థ్యాలు పెంచుకునేందుకు ఈ ఓరియెంటేషన్ సెషన్ లో అవసరమైన సమాచారం అందించారు.  

***
 



(Release ID: 2025871) Visitor Counter : 48