మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జపాన్ లో జరిగే సకురా సైన్స్ ప్రోగ్రాం 2024లో పాల్గొనున్న 21 మంది విద్యార్థులు
Posted On:
15 JUN 2024 5:00PM by PIB Hyderabad
జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్ టి) ఆహ్వానం మేరకు భారత్ నుండి సకురా సైన్స్ ప్రోగ్రాం-2024కి వెళ్లే 21 మంది విద్యార్థుల బృందానికి పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ లోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం (డోసెల్) సంయుక్త కార్యదర్శి శ్రీమతి అర్చన శర్మ అవస్తి ఘనంగా వీడ్కోలు పలికారు. సీఐఈటి-ఎన్ సి ఈ ఆర్ టి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని పాల్గొన్నారు. అటు జేఎస్టి జపాన్ మేనేజర్ కెమోచి యుకియో, సీఐఈటి-ఎన్ సి ఈ ఆర్ టి జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర ప్రసాద్ బెహెరా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ 21 మంది విద్యార్థులు భారత్ నుండీ, మరి కొంత మంది విద్యార్థులు ఇతర దేశాల నుండి కూడా జూన్ 16 నుండి 22 వరకు జరిగే సకురా సైన్స్ ప్రోగ్రాం లో భాగస్వాములు అవుతున్నారు.
యువ అభ్యాసకులలో మేధోపరమైన శిఖరాలను అధిరోహోంచేలా, శాస్త్రీయ అన్వేషణను అభివృద్ధి చేయడానికి, జపాన్ అత్యాధునిక సైన్స్ మరియు టెక్నాలజీతో పాటు దాని సంస్కృతిని అధ్యయనం చేయడానికి డోసెల్ తో కూడిన జే ఎస్ టి సకురా సైన్స్ హై స్కూల్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2014 నుండి సాకురా సైన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎస్పి) కింద జపాన్‌కు స్వల్పకాలిక సందర్శనల కోసం ప్రోగ్రామ్ కింద విద్యార్థులను ఆహ్వానించారు, జపాన్ అత్యాధునిక సైన్స్ మరియు టెక్నాలజీని అలాగే దాని సంస్కృతిని తెలుసుకోడానికి వారికి అవకాశం కల్పిస్తున్నారు.
ఏప్రిల్ 2016లో భారతదేశం మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 532 మంది విద్యార్థులు, 83 మంది సూపర్‌వైజర్లు జపాన్‌ను సందర్శించారు. చివరి బ్యాచ్ డిసెంబర్ 2023లో జపాన్‌ను సందర్శించింది.
ప్రస్తుత బ్యాచ్‌లోని ఈ 21 మంది విద్యార్థులు (6 మంది బాలురు మరియు 15 మంది బాలికలు) దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల (ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్మ, ఉత్తరప్రదేశ్) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలకు చెందినవారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020, పాఠశాలల్లో పాఠ్యాంశాలు, బోధనా శాస్త్రం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, "అభ్యాసం సంపూర్ణంగా, సమగ్రంగా, ఆనందించదగినదిగా, దానిలోనే నిమగ్నమై ఉండాలి" అని స్పష్టం చేస్తుంది. అలాగే, ఎన్ఈపి 2020 ప్రకారం, అన్ని దశల్లో, ప్రతి సబ్జెక్ట్‌లో, వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాల అన్వేషణలతో అనుభవపూర్వక అభ్యాసం ప్రామాణిక బోధనగా అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక వికాసానికి సంబంధించి వివిధ ప్రాధాన్యమున్న ప్రదేశాలకు విద్యా యాత్రలు, విహారయాత్రలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జపాన్ అభివృద్ధి చెందిన దేశం, స్నేహపూర్వక దేశం. దాని సాంకేతిక పురోగతుల కారణంగా, ఇది ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోజర్‌కి కూడా ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. జపాన్ వంటి దేశాన్ని సందర్శించడం ఎల్లప్పుడూ సుసంపన్నమైన అనుభవాన్ని, దాని వినూత్న పద్ధతులను అన్వేషించడానికి అవకాశాన్ని అందిస్తుంది.
***
(Release ID: 2025824)
Visitor Counter : 88