రక్షణ మంత్రిత్వ శాఖ
పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వర్క్‌షాప్‌ను నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ
Posted On:
14 JUN 2024 8:10PM by PIB Hyderabad
రాబోయే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ జూన్ 14, 2024న పూణేలోని ఖడక్‌వాస్లాలో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. వర్క్‌షాప్‌లో త్రివిధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌లో భాగంగా నిపుణులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. వర్క్‌షాప్‌లో ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు వంటి వివిధ కార్యకలాపాలు ఉన్నాయి. భారత సాయుధ దళాల నుండి శిక్షణ పొందిన యోగా శిక్షకులు సరైన భంగిమలు, శ్వాస పద్ధతులను ప్రదర్శించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వారు సవివరంగా వివరించారు.
యోగాను ప్రోత్సహించడం ద్వారా హాజరైన వారందరిపై వర్క్‌షాప్ అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సంపూర్ణ శ్రేయస్సు ప్రాముఖ్యత గురించి ఎన్డీఏ తమ సిబ్బందికి అవగాహన కల్పించింది.


***
(Release ID: 2025788)
Visitor Counter : 85