గనుల మంత్రిత్వ శాఖ
గనుల శాఖ అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం
प्रविष्टि तिथि:
14 JUN 2024 5:41PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ గనుల మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ కార్యాలయాల సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గనుల మంత్రిత్వశాఖకు సంబంధించిన వ్యవహారాల గురించి అధికారులు ఆయనకు సంక్షిప్తంగా వివరించారు. అలాగే గనుల శాఖ సాధించిన విజయాలతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికలపై సమావేశం చర్చించింది. గనుల తవ్వకం రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధం చేసే దిశగా యాంత్రీకరణ, ఆవిష్కరణ, సుస్థిరత, అధునాతన సాంకేతికతల వినియోగం తదితర కీలకాంశాలపైనా ఈ చర్చ ప్రధానంగా దృష్టి సారించారు.

***
(रिलीज़ आईडी: 2025433)
आगंतुक पटल : 124