ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

జైసల్‌మేర్ లో జరిగిన బిఎస్ఎఫ్ సైనిక్ సమ్మేళన్ లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి


‘‘మీ మధ్య కువచ్చిన తరువాత నాలో ఒక క్రొత్త శక్తి ప్రవేశించిందని నాకు అనిపిస్తోంది, ఈ సన్నివేశం ఎల్లప్పటికీ నాకు గుర్తుండి పోతుంది’’ అని సైనికుల తో చెప్పిన ఉపరాష్ట్రపతి

చిత్తౌడ్ గఢ్ సైనిక పాఠశాల విద్యార్థుల లో నేనూ ఒకవిద్యార్థి ని, యూనిఫార్మ్ యొక్కప్రాముఖ్యాన్ని నేనెరుగుదును అని పేర్కొన్న శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్

మీ వంటి సాహస పుత్రుల కు మరియు మీ వంటి సాహస పుత్రికలకు జన్మ ను ఇవ్వడం తో పాటుగా మిమ్ముల ను దేశం సురక్ష కోసం అంకితం చేసినమాతృమూర్తులు అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను: ఉపరాష్ట్రపతి

మిమ్మల్ని ఇక్కడ సరిహద్దు లో నియమించారు, కాబట్టే భారతీయులుసురక్షిత వాతావరణం లో నిద్రించవచ్చును: ఉపరాష్ట్రపతి

దేశం యొక్క అభివృద్ధి లో బిఎస్ఎఫ్ ఒక ప్రముఖ పాత్ర నుపోషిస్తున్నది, మిమ్మల్నిచూసుకొని మేం గర్వపడుతున్నాం: ఉపరాష్ట్రపతి

భారతదేశం లోప్రతి ఒక్కరు దేశ హితాన్ని పరమోన్నతమైంది గా తలచాలి, ఎవరైనా నగదు పరమైనటువంటి లాభంకోసమో లేక రాజకీయ పరమైనటువంటి ప్రయోజనం కోసమో భారతదేశం లో సంస్థల ప్రతిష్ట ను మలినపరిచారాఅంటే అది చాలా బాధాకరం: ఉపరాష్ట్రపతి

Posted On: 14 JUN 2024 12:27PM by PIB Hyderabad

జైసల్‌మేర్ లో ఈ రోజు న జరిగిన బిఎస్ఎఫ్ సైనిక్ సమ్మేళన్ ను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రసంగిస్తూ, ‘‘మీ మధ్య కు వచ్చిన తరువాత ఒక క్రొత్త శక్తి లభించిందని నాకు అనిపిస్తోంది; మరి ఈ ఘట్టం నాకు ఎల్లప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది’’ అని జవానుల తో చెప్పారు.

 

శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ తన విద్యార్థి జీవనాన్ని గుర్తు కు తెచ్చుకొంటూ, ‘‘నేను చిత్తౌడ్ గఢ్ సైనిక పాఠశాల విద్యార్థుల లో నేనూ ఒకరి గా ఉండే వాడిని. అయిదో తరగతి లో నేను యూనిఫార్మ్ వేసుకొన్నాను; యూనిఫార్మ్ కు ఉన్న శక్తి మరియు ప్రాముఖ్యం నేను ఎరుగుదును. యూనిఫార్మ్ మిమ్మల్ని ఉన్నపళం గా ఎలా మార్చివేసేదీ నేను నా పసితనం లోనే అనుభవం లోకి తెచ్చుకొన్నాను’’ అన్నారు. సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) జవానుల సమర్పణ భావాన్ని ఆయన ప్రశంసిస్తూ, ‘‘మిమ్మల్ని చూసి నేను ఉప్పొంగిపోతున్నాను. దేశం లో ఒకటో రక్షణ పంక్తి అయినటువంటి బిఎస్ఎఫ్ తన కర్తవ్యాన్ని ఉత్కృష్టం గా నెరవేర్చుతోంది. మీ కృషి పొగడదగ్గదీ, ప్రశంసాపాత్రమూను.’’ అని ఆయన అన్నారు.

 

జైసల్ మేర్ లో గల బిఎస్ఎఫ్ బావలియాన్ వాలా బార్డర్ అవుట్ పోస్ట్ ను ఉపరాష్ట్రపతి నిన్నటి రోజు న సాయంత్రం పూట సందర్శించి అక్కడ విధుల ను నిర్వహిస్తున్న సైనికుల తో భేటీ అయిన ఘటన ప్రస్తావించదగింది గా ఉంది. అమరవీరుల కు తనోట్ విజయ్ స్తంభ్వద్ద దేశ ప్రజల పక్షాన కృతజ్ఞత పూర్వకమైన శ్రద్ధాంజలి ని ఉపరాష్ట్రపతి సమర్పించారు.

 

క్లిష్ట పరిస్థితుల లో కర్తవ్య పాలన లో నిమగ్నం అయిన బిఎస్ఎఫ్ జవాను ల ధైర్య సాహసాల ను శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రశంసిస్తూ, నడినెత్తి ని మల మల మాడ్చివేసేటంతటి తీవ్రమైన ఎండ లో కొద్ది సేపు అయినా నిలబడి ఉండడం అంటే అది ఎంతో కష్టం అన్నారు. మీ చుట్టూరా ఉన్న వాతావరణం సవాళ్ళ ను రువ్వేటటువంటిది గా ఉంది, మరి మీకు సరిహద్దు లో మీ కనురెప్పల ను ఆడించే తీరిక అయినా చిక్కదు అని ఆయన అన్నారు. ఉన్నత హిమాలయాలలోని పర్వతాల లో, థార్ లోని కటిక ఎడారి నేల లో, ఈశాన్య ప్రాంతాల దట్టమైన అడవుల లో, రణ్ క్రీక్ చిత్తడి నేలల లో బిఎస్ఎఫ్ జవాను లు పాటిస్తున్న అప్రమత్త స్థితి సాటి లేనటువంటిది అని కూడా ఆయన అన్నారు.

 

సరిహద్దు భద్రత దళం యొక్క సైనికులు వారి ఆదర్శ వాక్యం అయినటువంటి ‘‘జీవన పర్యంతం కర్తవ్య పాలన’’ ను ప్రతిక్షణం తు.చ. తప్పక నిర్వర్తిస్తున్నారు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ‘‘మీ వంటి సాహస పుత్రుల ను మరియు మీ వంటి ధైర్యవంతురాళ్ళ ను కని దేశ ప్రజల కు సేవ చేయడం కోసం అంకితం చేసిన మాతృమూర్తులు అందరికి ఈ రోజు న నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.’’ అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అన్నారు.

 

రక్షణ బలగాల లో మహిళల కు ప్రాతినిధ్యం అధికం అవుతున్న సంగతి ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించి, ‘‘గణతంత్ర దినం నాడు కర్తవ్య పథ్ లో మన యొక్క కుమార్తె లు రాణిస్తూ ఉండడాన్ని మనం చూసినప్పుడు భారతదేశం లో మారుతున్న ముఖచిత్రం ను మనం గమనించాం. ఇక్కడ వారి ప్రాతినిథ్యాన్ని తిలకించి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను’’ అన్నారు.

 

దేశ రక్షణ లో ప్రాణత్యాగం చేసి, అమరులు అయిన వీరుల కు శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ శ్రద్ధాంజలి ని ఘటిస్తూ, ‘‘ఈ రోజు న మన మధ్య లేకుండా పోయినటువంటి గార్డుల కు ఇవే నా జోహారు లు. భరత మాత రక్షణ లో వారు వారి యొక్క ప్రాణాల ను త్యాగం చేసి, అమరులు అయ్యారు. ఆ శూర జవానుల యొక్క కుటుంబాల కు నేను సైతం వినమ్రం గా ప్రణమిల్లుతున్నాను.’’ అన్నారు.

 

రక్షణ రంగం లో భారతదేశం యొక్క ఆత్మనిర్భరత వృద్ధి చెందుతూ ఉండడం గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ‘‘మేకుల ను సైతం దిగుమతి చేసుకొన్న కాలం అంటూ ఒకటి ఉండింది; అయితే, ఇప్పుడు మనం రక్షణ సామగ్రి ని ఎగుమతి చేస్తున్నాం. విమాన వాహక నౌక ‘విక్రాంత్’ ను దేశం లో నిర్మించడమైంది, యుద్ధ నావల ను దేశం లో తయారు చేయడమైంది, ‘తేజస్’ ను తయారు చేశాం, క్షిపణుల ను రూపొందించాం; మరి ఇదంతా కూడాను సరిహద్దుల లో శాంతి ని మీరు సంబాళించడం వల్లనే సాధ్యపడింది.’’ అని ఆయన అన్నారు. ‘‘మీరు శాంతి కి దూతలు గా ఉన్నారు, మీ కారణం గా భారతదేశం ప్రపంచం లో శాంతి దూత గా నిలబడింది; మరి బిఎస్ఎఫ్ ప్రపంచం లో అతి పొడవైన సరిహద్దు ను సంరక్షిస్తున్నటువంటి బలగం గా ఉన్న సంగతి గర్వపడేటటువంటి విషయం గా ఉంది. నేను ఇక్కడ నుండి సరిక్రొత్త ప్రేరణ ను, శక్తి ని నింపుకొని వెళుతున్నాను’’ అని ఆయన అన్నారు.

 

దేశం యొక్క అభివృద్ధి లో బిఎస్ఎఫ్ కు ఉన్న ముఖ్యమైన పాత్ర ను గురించి ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, ‘‘మీరు ఇక్కడ సరిహద్దు లో నిలచి ఉన్నారు కాబట్టే భారతీయులు ఒక భద్రమైన వాతావరణం లో కంటి నిండా కునుకు తీయగలుగుతున్నారు. మరి, భారతదేశం లో ప్రతి ఒక్కరు దేశ సర్వతోముఖ అభివృద్ధి కై నిర్భయం గాను, ఆత్మవిశ్వాసం తోను శ్రమించ గలుగుతున్నారు అంటే అది మీ యొక్క సహనం మరియు వీరత్వం ల ఫలితమే’’ అని ఆయన అన్నారు.

చొరబాటు లు, దొంగ రవాణా, వగైరా నేరాల కు పాల్పడడం ద్వారా సరిహద్దు ప్రాంతాల ను అస్థిర పరచాలని దేశం యొక్క విరోధులు చేస్తున్న ప్రయాసల ను ప్రభావవంతం అయిన రీతి లో తిప్పికొడుతున్న సరిహద్దు భద్రత దళం యోధుల ను ఉపరాష్ట్రపతి పొగడారు. ఈ విధమైన సవాళ్ళ ను ఎదుర్కోవడం కోసం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భం లో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ నితిన్ అగ్రవాల్, బిఎస్ఎఫ్ వెస్టర్న్ కమాండ్ యొక్క ఎస్‌డిజి శ్రీ వై.బి. ఖురానియా, జైసల్ మేర్ లో బిఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ విక్రమ్ కున్వర్ లతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

ఉపరాష్ట్రపతి ఉపన్యాసం పాఠం కోసం ఈ లింకు ను క్లిక్ చేయగలరు


1.jpg

2.jpg

 

3.jpg

 

4.jpg

 

5.jpg

 

6.jpg

 

7.jpg

 

8.jpg

***



(Release ID: 2025424) Visitor Counter : 51