ఆయుష్

4వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్

Posted On: 12 JUN 2024 4:34PM by PIB Hyderabad

ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ 'ప్రాణ' ఎస్‌యూఎస్‌లో హక్కులు, నవీనతల సంరక్షణ (మైండ్ టు మార్కెట్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ (ఐఎస్ ఎం) ప్రొఫెషనల్స్)  రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది.

జాతీయ సదస్సు యొక్క రెండు రోజుల సెమినార్‌లో పేటెంట్ పొందే సామర్థ్యం కలిగి, వాణిజ్యీకరించగల లేదా పేటెంట్ వస్తువుల సాంకేతిక బదిలీకి తగిన అనేక ఆవిష్కరణలు ఉన్నాయి. ఇవి అంకుర సంస్థలుగా మారవచ్చు. ఐఎస్‌ఎంలో పట్టు కలిగిన ఆవిష్కర్తల భిన్న కోణాలను ఈ సదస్సు పరిశీలించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేష్ కొటేచా నిన్న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల ద్వారా భారతీయ వైద్య విధానాలు, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, సోవా-రుగ్పాలను ప్రోత్సహిస్తున్నందున ఈ వేదికపై ఇలాంటి చర్చ జరపడానికి ఇదే సరైన సమయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐఎస్‌ఎంలో నూతన ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన ఉద్ఘాటించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌సీఐఎస్ఎం, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సీసీఐఎం అధ్యక్షుడు వైద్య జయంత్ డియోపుజారి మాట్లాడుతూ, విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. తద్వారా ఇది సంస్థలకు ఒక ఆస్తిగా, సదావకాశంగా మారుతుందన్నారు. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నోవేషన్ సెల్ (ఎంఐసీ) సుమారు 15,000 ఇన్‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్స్ (ఐఐసీ)లను ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందించారు. మేధో సంపత్తి హక్కులతో పాటు సృజనాత్మకతలో కూడా పెద్ద మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు.

నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఎన్‌సీఐఎస్ఎం చట్టం, 2020 ప్రకారం 21.09.2020 నాటి గెజిట్ నోటిఫికేషన్ పార్ట్ 2 సెక్షన్ 1 ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది 11 జూన్ 2021 న అమల్లోకి వచ్చింది.

ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఐఎస్ఎం)లో అవసరమైన, అధిక నిపుణత కలిగిన వైద్య నిపుణుల లభ్యతను కమిషన్ ఉండేలా చూస్తుంది; ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో వైద్య నిపుణుల తాజా వైద్య పరిశోధనను స్వీకరిస్తుంది; ఐఎస్ఎం వైద్య సంస్థల యొక్క క్రమానుగత మదింపు. ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, సోవా-రుగ్ప వైద్య విధానాల్లో వైద్య విద్య, వైద్య పరిశోధన, వైద్య అభ్యాసం, సామర్థ్య పెంపు వంటి అనేక కోణాల్లో ఎన్‌సీఐఎస్ఎం  సంస్కరణలు చేపట్టింది. దీని ఫలితంగా ఈ వ్యవస్థ ప్రపంచ ప్రమాణాలకు మార్పు చెందింది.
ఆయుష్ లో ఆవిష్కరణల రకాలు, స్థితిని అంచనా వేయడానికి ఎన్‌సిఎస్‌ఎంఐఎస్ఎం వృత్తి నిపుణులు, విద్యార్థులకు ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే పేటెంట్లకు సంబంధించి (115); పేటెంట్ల కోసం దరఖాస్తు (112); అభివృద్ధి చేసినప్పటికీ పేటెంట్ కోసం దరఖాస్తు చేయని(183) వాటి కోసం నిర్వహించబడింది.

ఏఐసీటీఈ చైర్మన్ డాక్టర్ సీతారామ్, ఏఐసీటీఈ వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ జేర్, ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌సీఎస్ఎం ఆయుర్వేద బోర్డు అధ్యక్షుడు డాక్టర్ బి. శ్రీనివాస ప్రసాద్, యునానీ, సిద్ధ, సోవా-రిగ్పా (బస్) బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కె.జగన్నాథన్, ఎన్‌సీఎస్ఎం (మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్- మార్బిజమ్) అధ్యక్షుడు, వైద్య రాకేశ్ శర్మ, బోర్డ్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అధ్యక్షుడు, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ ఐఈపీఏ) ఉపకులపతి ప్రొఫెసర్ శశికళ జి. వంజారి తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2024953) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP