రక్షణ మంత్రిత్వ శాఖ
08 ఎక్స్ మిసైల్ కమ్ ఎమ్యూనిషన్ (ఎంసిఏ) బార్జ్ ప్రాజెక్టులో భాగమైన ఐదవ ఎల్ఎస్ఏఎం 13 (యార్డ్ 81) ప్రారంభం
Posted On:
11 JUN 2024 3:22PM by PIB Hyderabad
భారత నౌకాదళం కోసం ఎంఎస్ఎంఇ షిప్ యార్డ్; మెసర్స్ సెకాన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఇపిపిఎల్), విశాఖపట్టణం 08 ఎక్స్ మిసైల్ కమ్ ఎమ్యూనిషన్ (ఎంసిఏ) బార్జ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐదవ ఎల్ఎస్ఏం 13ను (యార్డ్ 81) మహారాష్ర్టలోని మీరా భయాండర్ వద్ద గల వినాయగ మెరైన్ పెట్రో లిమిటెడ్ సైట్ వద్ద 2024 జూన్ 10వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ (క్యుఏ), ఎన్ డి (ఎంబిఐ) కమాండర్ మనీశ్ విజ్ ప్రారంభించారు.
ఈ 08ఎక్స్ మిసైల్ కమ్ ఎమ్యూనిషన్ బార్జి నిర్మాణం కాంట్రాక్టుపై ఎంఓడి, మెసర్స్ సెకాన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2021 ఫిబ్రవరి 19వ తేదీన సంతకాలు చేశాయి. ఈ బార్జ్ లు అందుబాటులోకి రావడం వల్ల రవాణా; జెట్టీలు, హార్బర్ల వద్ద సరకు/ఆయుధ సామగ్రి ఐఎన్ ఓడల్లోకి ఎక్కించడం, దించడం వంటి కార్యకలాపాలు సరళం అవుతాయి. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడతాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న నౌకాదళ నిబంధనలు, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నియంత్రణల కింద ఈ బార్జ్ లను దేశీయ పరిజ్ఞానంతోనే డిజైన్ చేసి నిర్మించారు. డిజైన్ దశలో బార్జ్ మోడల్ టెస్టింగ్ ను విశాఖపట్టణంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబరేటరీ (ఎన్ఎస్ టిఎల్) నిర్వహించింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ బార్జ్ లు సజీవ నిదర్శనంగా నిలుస్తాయి.
***
(Release ID: 2024653)