భారత పోటీ ప్రోత్సాహక సంఘం

మిత్సుబిషి కార్పొరేషన్ ద్వారా ‘టీవీఎస్ సర్టిఫైడ్ ప్రైవేట్ లిమిటెడ్.. టీవీఎస్ వెహికల్ మొబిలిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’లలో నిర్దిష్ట ఈక్విటీ వాటా కొనుగోలుకు ‘సిసిఐ’ ఆమోద ముద్ర

Posted On: 11 JUN 2024 7:35PM by PIB Hyderabad

పీఐబీ ఢిల్లీ ద్వారా 2024 జూన్ 11న రాత్రి 7:35 గంటలకు పోస్ట్ చేయబడినది

   మిత్సుబిషి కార్పొరేషన్ ద్వారా ‘టీవీఎస్ సర్టిఫైడ్ ప్రైవేట్ లిమిటెడ్’, టీవీఎస్ వెహికల్ మొబిలిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలలో నిర్దిష్ట ఈక్విటీ వాటా కొనుగోలుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ) ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత సమ్మేళనం ‘టీవీఎస్ సర్టిఫైడ్ ప్రైవేట్ లిమిటెడ్ (టార్గెట్ 1), ‘టీవీఎస్ వెహికల్ మొబిలిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’ (టార్గెట్ 2)లలో మిత్సుబిషి కార్పొరేషన్ (అక్వైరర్) ద్వారా ఈక్విటీ వాటా కొనుగోలుకు చేయడానికి ఉద్దేశించినది.

   ‘ది అక్వైరర్’ అనేది ప్రపంచ సమీకృత వ్యాపార సంస్థ. ఇది 90 దేశాలు, ప్రాంతాల్లో కార్యాలయాలు, అనుబంధ సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా 1,700 గ్రూప్ కంపెనీలకు నిర్వహణ, వ్యాపారాభివృద్ధిలో తోడ్పడుతూంటుంది. అలాగే సహజ వాయువు, పారిశ్రామిక పదార్థాలు, పెట్రోలియం-రసాయనాలు, ఖనిజ వనరులు, పారిశ్రామిక వ్యవస్థాపన, ఆటోమోటివ్-మొబిలిటీ, ఆహార పరిశ్రమ, వినియోగదారు పరిశ్రమ, విద్యుత్ రంగం, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది.

   కాగా, ఈ సమ్మేళనంలో భాగమైన ‘టార్గెట్ 1’ సంస్థ ప్రత్యక్ష వేలం యార్డులలో ప్రధానంగా ఆఫ్‌లైన్ మార్గాలలో నిర్వహించే వేలం ద్వారా వాడిన వాహనాల విక్రయ వ్యాపారం చేస్తూంటుంది. ‘టార్గెట్ 2’ సంస్థ (i) ఎలక్ట్రిక్ వాహనాలు, నిర్మాణ పరికరాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్ వాహనాలు సహా వాణిజ్య- ప్రయాణిక వాహన డీలర్‌షిప్-పంపిణీ; (ii) నిర్దిష్ట తయారీదారుకు చెందిన మోటారు వాహనాల సేవలు-డీలర్‌షిప్-విడిభాగాల పంపిణీని వంటి కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది.

ఈ లావాదేవీపై సమగ్ర ఉత్తర్వులను ‘సిసిఐ’ త్వరలో జారీచేయనుంది.

******



(Release ID: 2024528) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi