వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని 20కి పైగా నగరాల్లో నిర్వహించిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

Posted On: 10 JUN 2024 5:21PM by PIB Hyderabad

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) భారతదేశంలోని 20కి పైగా నగరాల్లో ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని నిర్వహించింది "అక్రిడిటేషన్: రేపటి సాధికారత, భవిష్యత్తు రూపకల్పన" అనే ఇతివృత్తంతో దిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని డిపిఐఐటి కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ పాల్గొన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ శ్రీ జక్సీ షాపలువురు పారిశ్రామికవేత్తలుప్రభుత్వ అధికారులుపలు సంస్థల అధినేతలతో కలిసి అన్ని రంగాల్లో జీవన నాణ్యతను రూపొందించడంలో అక్రిడిటేషన్ పాత్రపై చర్చించారు.

 

శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూప్రామాణిక పద్ధతులకు అతీతంగాఅందరినుండి మనల్ని వేరుగా/ప్రత్యేకంగా నిలిపే ప్రక్రియలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అక్రిడిటేషన్ వ్యవస్థనుమొత్తం గుణాత్మక వ్యవస్థను బలోపేతం చేయడం కేవలం అవసరం మాత్రమే కాదనిశ్రేష్ఠత దిశగా వ్యూహాత్మక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

 

ఎన్ఎబిఎల్, ఎన్ఎబిసిబి రెండూ భారతదేశంలో అక్రిడిటేషన్ అవస్థాపన సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ అక్రిడిటేషన్ ఫోరం (ఐఎఎఫ్) ఇంటర్నేషనల్ లాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ (ఐఎల్ఎసి) ల బహుళపక్ష గుర్తింపు ఏర్పాట్లపై సంతకాలు చేశాయి. ఎన్ఏబీఎల్ కు 8000కు పైగా గుర్తింపు పొందిన ప్రయోగశాలలుఎన్ఏబీసీబీకి 260కి పైగా గుర్తింపు పొందిన సీఏబీలు (కన్ఫార్మిటీ అసెస్మెంట్ బాడీస్) ఉన్నాయి.

 

1997 లో భారత ప్రభుత్వం, భారతీయ పరిశ్రమచే స్థాపించబడిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాథర్డ్- పార్టీ నేషనల్ అక్రిడిటేషన్ వ్యవస్థను స్థాపించడానికి, నిర్వహించడానికిఅన్ని రంగాలలో నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రభుత్వానికి ఇతర భాగస్వాములకు అన్ని విషయాలపై సలహా ఇవ్వడానికి బాధ్యత వహించే దేశంలోని అత్యున్నత సంస్థ.

***



(Release ID: 2023894) Visitor Counter : 52