బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు తవ్వకం కోసం పర్యావరణ, అటవీ అనుమతులపై వర్క్‌షాప్ నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
10 JUN 2024 8:02PM by PIB Hyderabad
బొగ్గు తవ్వకాల కోసం పర్యావరణ, అటవీ అనుమతులపై బొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు వర్క్‌షాప్ నిర్వహించింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) సహకారంతో దిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్ఈసీఎల్, బీసీసీఎల్, ఈసీఎల్, ఎన్ఎల్‌సీఐఎల్, ఎస్‌సీసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ బొగ్గు సంస్థల అధికారులు, బొగ్గు మైనింగ్ రంగాలకు చెందిన నిపుణులు 175 మంది పాల్గొన్నారు..
శ్రీ అమృత్ లాల్ మీనా, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ ఎం. నాగరాజు, అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ, గౌరవ అతిథిగా హాజరయ్యారు.
శ్రీ ఎం. నాగరాజు ప్రారంభ వ్యాఖ్యలో మాట్లాడుతూ, ఆర్థిక ప్రయోజనాలకు, పర్యావరణ పరిరక్షణ మధ్య ముఖ్యమైన సమతుల్యతను నొక్కి చెప్పారు. పర్యావరణ సుస్థిరత కోసం అనుమతులు పొందవలసిన అవసరాన్ని తెలిపారు.. శ్రీ అమృత్ లాల్ మీనా, తన ప్రధాన ప్రసంగంలో, సుస్థిరత పట్ల బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలలో మైనింగ్ కన్నా ఎక్కువగా భూ పునరుద్ధరణ, విస్తృత అటవీకరణ కార్యక్రమాలపై చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రధానంగా తెలిపారు. ప్రారంభ సెషన్‌లో బొగ్గు సంస్థలు తమ సంస్థల ద్వారా ఉత్తమ విధానాలపై వీడియోలను ప్రదర్శించాయి.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన వక్తలు తమ సమగ్ర అంతర్దృష్టులను, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, విధానపరమైన అవసరాలు, విధాన నవీకరణలు, అంగీకార వ్యూహాలు, బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌ల కోసం పర్యావరణ అటవీ అనుమతులను పొందేందుకు సమాచారాత్మక సెషన్లు, చర్చలను నిర్వహించారు.
అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు, వన్యప్రాణి అనుమతులు, అక్రెడిటెడ్ కాంపెన్సేటరీ ఫారెస్టెషన్ (ACA), గ్రీన్ క్రెడిట్స్ & భూగర్భ జల అనుమతులు మొదలైన వాటి కోసం పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ & సీజీడబ్యూఏ బోర్డ్ అధికారులు సమగ్ర ప్రదర్శనలు ప్రదర్శించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ అనుమతులు పొందడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూ, విజయవంతంగా అనుమతుల ప్రక్రియను ఎలా చేపట్టాలో, నేర్చుకున్న పాఠాలు వినూత్న విధానాలను నొక్కి చెప్పింది. ప్రశ్నోత్తరాల సెషన్‌లో బొగ్గు సంస్థలకు అనుమతులు పొందడంలో ఎదురవుతున్న సవాళ్లపై అంతర్దృష్టులు, నిపుణుల అభిప్రాయాలను పొందేందుకు ఒక వేదికను ఈ సమావేశం అందించింది. సమతుల్య అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం వంటి క్లిష్టమైన సమస్యలను ఇంటరాక్టివ్ ప్యానెల్స్‌లో పొందుపరిచారు.
పర్యావరణ పరిరక్షణను పరిరక్షిస్తూనే, అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేసే మార్గాన్ని వివరిస్తూ సీనియర్ అధికారుల వ్యాఖ్యలతో కార్యక్రమం ముగిసింది.
***
(Release ID: 2023893)
Visitor Counter : 103