రక్షణ మంత్రిత్వ శాఖ
వరుసగా రెండోసారి రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్
రక్షణ శాఖ సహాయ మంత్రిగా శ్రీ సంజయ్ సేథ్
Posted On:
10 JUN 2024 8:54PM by PIB Hyderabad
2019 నుంచి 2024 వరకు విజయవంతంగా తన మంత్రిత్వ శాఖను నిర్వహించిన రాజ్ నాథ్ సింగ్ కు ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి వరుసగా రెండోసారి రక్షణ శాఖను కేటాయించారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో పార్లమెంటు సభ్యుడైన శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2019 జూన్ 01 న మొదటిసారిగా రక్షణ మంత్రిత్వ శాఖ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
రాజ్ నాథ్ సింగ్ 1951 జూలై 10న ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లాలో జన్మించారు. గోరఖ్ పూర్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రం లో మాస్టర్స్ చేశారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 1977 - 1980 మరియు 2001 - 2003 మధ్య కాలం లో ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు . 1991 - 1992 లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. 1999 నుంచి 2000 వరకు కేంద్ర కేబినెట్లో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత 2000 – 2002 సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా తన భాద్యతలు నిర్వర్తించారు. 2003లో కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994- 1999, 2003-2008లో రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 అక్టోబరు 7న ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2014, మే 27న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో హోం మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఆయన శ్రీమతి సావిత్రి సింగ్ ను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
జార్ఖండ్ లోని రాంచీకి చెందిన పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్ కు రక్షణ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. సంజయ్ సేథ్ 2019లో తొలిసారిగా రాంచీ నుంచి ఎంపీగా ఎన్నికై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2024లో కూడా రాంచీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
***
(Release ID: 2023892)
Visitor Counter : 108