రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కట్టుపల్లిలోని మెస్సర్స్ ‘ఎల్ అండ్ టి’ షిప్‌యార్డ్ (18004)లో 2వ నావికా సిబ్బంది శిక్షణ నౌక నిర్మాణ ప్రారంభోత్సవం

Posted On: 03 JUN 2024 5:34PM by PIB Hyderabad

   మిళనాడులోని కట్టుపల్లిలోగల మెస్సర్స్ ‘ఎల్ అండ్ టి’ షిప్‌యార్డ్ (18004)లో 2వ నావికా సిబ్బంది శిక్షణ నౌక నిర్మాణానికి 2024 జూన్ 3న శ్రీకారం చుట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి

రియర్ అడ్మిరల్ సందీప్ మెహతా, ‘ఎల్ అండ్ టి’ సంస్థ నౌకా నిర్మాణ వాణిజ్య విభాగం అధిపతి, యుద్ధనౌకల తయారీ-సమీకరణ అసిస్టెంట్ కంట్రోలర్ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) జి.కె.హరీష్ అధ్యక్షత వహించగా భారత నావికాదళ, ‘ఎల్ అండ్ టి’ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

   మొత్తం 3 నావికా సిబ్బంది శిక్షణ నౌకలను దేశీయంగా నిర్మించడంపై రక్షణ మంత్రిత్వశాఖ, ‘ఎల్ అండ్ టి’ సంస్థ మధ్య 2023 మార్చి 07న కాంట్రాక్టు ఖరారైంది. నావికా సిబ్బందికి ప్రాథమిక శిక్షణ అనంతరం శిక్షణార్థి అధికారులకు సముద్రంలో ప్రత్యక్ష శిక్షణ కోసం ఈ నౌకలను వినియోగిస్తారు. ఈ నౌకల ద్వారా ఇతర మిత్రదేశాల నావికా సిబ్బందికీ శిక్షణ సౌకర్యం కల్పిస్తారు.

   కాగా, స్వదేశీ నౌకా నిర్మాణం దిశగా భారత నావికాదళ కృషిలో ఇది మరో కీలక మైలురాయి. అంతేగాక ఇది ‘ఆత్మనిర్భర భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణమైనది కావడం విశేషం. ఈ మేరకు భారత నావికాదళం కోసం ‘లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ పెర్స్పెక్టివ్ ప్లాన్’ (ఎల్‌టిఐపిపి) 2012-27 కింద మూడు నావికా సిబ్బంది శిక్షణ నౌకల బలగాన్ని సమకూర్చాలని ప్రభుత్వం సంకల్పించింది.

***



(Release ID: 2022722) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi , Tamil