ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాంచీలో ఉక్కుపై అంతర్జాతీయ సదస్సు


మూలధన వస్తువులపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ‘ఐకాన్స్24’ నిర్వహణ

Posted On: 30 MAY 2024 4:50PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెయిల్తో కలిసి మెకాన్ లిమిటెడ్ ఉక్కుపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది (ఐకాన్స్-2024). ప్రధానంగా మూలధన వస్తువులపై (ఐకాన్స్24) దృష్టి సారిస్తూ  ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. మే 30 & 31 తేదీల్లో ఈ సదస్సు జరుగుతోంది.  కొత్త భాగస్వామ్యాలను పెంపొందించడానికి, వినూత్న పరిష్కారాలను అన్వేషించడానికి, ఉక్కు పరిశ్రమ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడానికి.. టెక్నాలజీ ప్రొవైడర్లు, ఉక్కు ఉత్పత్తిదారులు, తయారీదారులు, విద్యావేత్తలు మరియు సహా ఉక్కు పరిశ్రమలోని మేథావులను మరియు ప్రముఖ వాటాదారులను ఒకచోట చేర్చడం ఈ సదస్సు యొక్క లక్ష్యం. మైకాన్ సంస్థ సీఎండీ శ్రీ సంజయ్ కుమార్ వర్మ ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. అనంతరం సమావేశం నేపథ్యాన్ని గురించి వివరించారు.

సకాలంలో ప్రణాళికల అమలు అతిపెద్ద సవాళ్లలో ఒకటి..

సదస్సు ప్రారంభ సెషన్‌కు భారత ప్రభుత్వపు ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా, ఎంఓఎస్ అదనపు కార్యదర్శి & ఆర్థిక సలహాదారు శ్రీమతి సుకృతి లిఖి, ఎంఓఎస్ సంయుక్త కార్యదర్శిలు శ్రీ అభిజిత్ నరేంద్ర, డాక్టర్ సంజయ్ రాయ్, ఎన్ఎండీసీ సీఎండీ శ్రీ అమితవ ముఖర్జీ, ఎంఓఐఎల్ సీఎండీ శ్రీ అజిత్ కుమార్ సక్సేనా, మైకాన్ సంస్థ సీఎండీ డైరెక్టర్ కమర్షియల్, అడిల్ ఛార్జ్ శ్రీ సంజయ్ కుమార్ వర్మ, సెయిల్ చైర్మన్ శ్రీ అమరేందు ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. కొంతమంది ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. సెయిల్ సీఎండీ, మోయిల్ సీఎండీ, ఎన్ఎండీసీ సీఎండీలు ఈ సమావేశంలో ప్రసంగించారు. భారత ప్రభుత్వపు ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా ఈ సందర్భంగా ప్రత్యేక ప్రసంగం చేశారు. భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు ప్రాజెక్టులకు నేడు కచ్చితమైన ప్రాజెక్ట్ ప్రణాళిక కలిగి ఉండడం మరియు సకాలంలో వాటిని అమలు చేయడం అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఉక్కు ప్రాజెక్టులను ఆరోగ్యంగా ఉంచేందుకు మరియు వాటి దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయడానికి వినూత్న మార్గాలను కనుగొనవలసిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. భారీ పరిశ్రమల రంగం పునరుద్ధరణకు కొత్త పని విధానాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రతిభావంతులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అభిజిత్ నరేంద్ర మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తిలో మనం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ.. ఉక్కు పరిశ్రమ కోసం యంత్రాలను తయారు చేయడంలో మనకు పరిమితులు ఉన్నాయన్నారు. ఇందుకు గాను అన్ని భాగస్వామ్య పక్షాల వారితో కూడిన అనుకూల పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని ఆయన నొక్కి చెప్పారు.

తయారీ రంగానికి తల్లిగా మూలధన వస్తువుల రంగం..

ఈ సందర్భంగా ఎన్ఎండీసీ సంస్థ సీఎండీ మాట్లాడుతూ భారతదేశం 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనిమనది అత్యంత యువ మరియు శక్తివంతమైన దేశం అని పేర్కొన్నారుభారతదేశం ప్రాథమికంగా సేవా రంగ ఆధారిత దేశమని అన్నారు. తయారీ రంగం గణనీయంగా వృద్ధి చెందాలని మరియు ఇందుకు గాను ప్రాంతాలను వర్గీకరణపరంగా గుర్తించాలని అన్నారు.  భవిష్యత్తు యొక్క అవకాశాలు మరియు ఆవశ్యకతపై ఒకరికొకరు అవగాహన కల్పించుకోవడానికి సాంకేతికత ప్రదాత మరియు సాంకేతిక కొనుగోలుదారుల మధ్య స్థిరమైన పరస్పర చర్య అవసరమన్నారు. ఆర్థిక వ్యవస్థలో క్యాపిటల్ గూడ్స్ రంగం చాలా వ్యూహాత్మక భాగమని ఎంఓఐఎల్ సీఎండీ అన్నారు. మూలధన వస్తువుల రంగం తయారీ రంగానికి తల్లిగా పరిగణించబడుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ఇంజినీరింగ్ వర్క్‌షాప్ ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే.. సరఫరా గొలుసును భద్రపరుచుకోవడం మరింత కష్టతరంగా మారుతున్నదని.. ఇందుకు మనం  సరఫరా గొలుసు భద్రతపై దృష్టి పెట్టాలని సెయిల్ సీఎండీ అన్నారు. స్వదేశీ మూలధన వస్తువుల ఉత్పత్తి కోసం సమగ్రమైన మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన ఉద్ఘాటించారు.

120-130 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు అవసరం..

 జాతీయ ఉక్కు విధానం (ఎన్ఎస్పీ)-2017 గురించి మైకాన్ సంస్థ సీఎండీ మాట్లాడారు. 300 మెట్రిక్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని చేరుకోవడానికి పాలసీ లక్ష్యం ప్రకారం - సుమారు 138-139 ఎంటీల కొత్త సామర్థ్యం వచ్చే 7-8 సంవత్సరాలలో జోడించబడుతుందని అంచనా వేయబడిందన్నారుభారతీయ ఉక్కు పరిశ్రమకు 120-130 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి.  దేశాల నుంచి దాదాపు 15-20 శాతం స్టీల్ ప్లాంట్ పరికరాలు దిగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, విలువ గొలుసును పెంచుతున్నప్పుడు దిగుమతి కంటెంట్ మరియు విలువ పెరుగుతుంది, సుమారు 400-500 మిలియన్ల డాలర్ల విలువైన విడిభాగాలతో పాటు, సుమారు18-20 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతి చేసుకున్న పరికరాలు విదేశాల నుండి సేకరించబడే అవకాశం ఉందన్నారు. దేశీయ తయారీని బలోపేతం చేయడానికి, భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించడానికి సాంకేతిక బదిలీ లేదా అంతర్జాతీయ సాంకేతిక ప్రదాత వంటి వ్యూహాలను అన్వేషించడం చాలా అవసరమని తెల్చి చెప్పారు.

నాలుగు సాంకేతిక సెషన్లు..

సదస్సు మొదటి రోజు ఈ క్రిందన పేర్కొన్న నాలుగు సాంకేతిక సెషన్లు కవర్ చేశారు:

• కోక్ మేకింగ్ టెక్నాలజీలో ట్రెండ్స్ మరియు సవాళ్లు

• సమీకరణ సాంకేతికతలో ట్రెండ్లు మరియు సవాళ్లు

• ఐరన్ మేకింగ్ టెక్నాలజీలో ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్

• స్టీల్ మేకింగ్ టెక్నాలజీలో ట్రెండ్స్ మరియు సవాళ్లు

తయారీ కంపెనీలుఐరన్ & స్టీల్ ఉత్పత్తిదారులుపరికరాల సరఫరాదారులుఇంజినీరింగ్ & కన్సల్టెన్సీ కంపెనీలకు చెందిన సీనియర్ ప్రతినిధులు రోజంతా సుదీర్ఘంగా జరిగిన సమావేశానికి హాజరయ్యారుఅకాడెమియా పాల్గొనడం అనేది సవాళ్లను స్వీకరించడానికి సహకార సుముఖతను సూచిస్తుంది.

 

***


(Release ID: 2022289) Visitor Counter : 107