గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రానైట్ మరియు మార్బల్ గనుల త్రవ్వకం అంశం పై బెంగళూరు లో వర్క్‌ శాపు ను నిర్వహించిన గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 30 MAY 2024 10:25AM by PIB Hyderabad

నల్లరాయి మరియు చలవరాయి గనుల త్రవ్వకం పై ఒక కార్యశాల ను గనుల మంత్రిత్వ శాఖ బెంగళూరు లో నిర్వహించింది. భారత ప్రభుత్వం లో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంత రావు వర్క్ శాపు యొక్క ప్రారంభిక సదస్సు లో ప్రసంగించారు. కర్నాటక ప్రభుత్వం లో అడిశనల్ చీఫ్ సెక్రట్రి & డెవలప్‌మెంట్ కమిశనర్ గా ఉన్న డాక్టర్ శాలినీ రజనీశ్ గారు ఈ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. ఈ వర్క్ శాపు లో భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీణ కుమారి డి గారు; కర్నాటక ప్రభుత్వం లో గనులు మరియు భూవిజ్ఞానం కార్యదర్శి శ్రీ రిచర్డ్ విన్సెంట్; బెంగళూరు లోని భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ లోని సీనియర్ అధికారులు; ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మధ్య ప్రదేశ్, తమిళ నాడు లలో గనుల త్రవ్వకం & భూవిజ్ఞానం డైరెక్టరేట్ లు; ప్రభుత్వ రంగ సంస్థ లు, ప్రైవేటు రంగం లోని గనుల త్రవ్వకం పరిశ్రమ యొక్క ప్రతినిధులు, మైనింగ్ అసోసియేశన్స్ మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ పాలుపంచుకొన్నారు.

 

 

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంత రావు తన ప్రసంగం లో భారత ప్రభుత్వం గనుల త్రవ్వకం రంగం లో అమలు పరుస్తున్న అనేక కార్యక్రమాల ను గురించి, చేపట్టిన సంస్కరణల ను గురించి నొక్కి చెప్పారు. ఆ తరహా సంస్కరణల ను మైనర్ మినరల్ సెక్టర్ లో కూడ చేపట్టవలసింది గా రాష్ట్ర ప్రభుత్వాల కు ఆయన విజ్ఞప్తి చేశారు. నేశనల్ జియో-డేటా రిపాజిటరీ (ఎన్‌జిడిఆర్) పోర్టల్ మాధ్యం ద్వారా సమగ్రమైన డేటా ను మరియు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకు వచ్చిందని, దీని ద్వారా స్టేక్ హోల్డర్స్ అందరు డేటా ను ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం అవుతోందన్నారు. కేంద్రీయ ఏజెన్సీ లు సేకరించినటువంటి సమాచారం ఆధారం గా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం గనుల త్రవ్వకం రంగం లో పారదర్శకత్వాన్ని మరియు దక్షత ను వృద్ధి చెందింప చేయడాన్ని లక్ష్యం గా పెట్టుకొందని ఆయన చెప్పారు.

 

 

 

మైనర్ మినరల్ సెక్టర్ ను సమగ్రం గా సంస్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వాని కి మరియు రాష్ట్రాల ప్రభుత్వాల కు మధ్య సహకార పూర్వకమైనటువంటి కార్యక్రమాల కోసం శ్రీ వి.ఎల్. కాంతారావు పిలుపు ను ఇచ్చారు. ఈ వర్క్ శాపు ఒక మేధోమథన సదస్సు వలె ఉపయోగపడుతుంది, దీనిలో పాల్గొనే పరిశ్రమ ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారాల పై దృష్టి ని సారిస్తాయి అని ఆయన అన్నారు.

 

 

కర్నాటక ప్రభుత్వ అడిశనల్ చీఫ్ సెక్రట్రి & డెవలప్‌మెంట్ కమిశనర్ డాక్టర్ శాలినీ రజనీశ్ గారు ఈ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇస్తూ, గ్రానైట్ ఇంకా మార్బల్ మైనింగ్ సెక్టర్ లో పరిపాలన పరమైనటువంటి, సాంకేతిక విజ్ఞాన పరమైనటువంటి అంశాలు మరియు ఇతర అంశాల కు సంబంధించిన పరిష్కారాల ను కనుగొనడం కోసం ప్రభుత్వాని కి మరియు పరిశ్రమ కు మధ్య సహకారం ముఖ్యం అని స్పష్టం చేశారు. గనుల త్రవ్వకం తో సహా ఏ ఆర్థిక పరమైన కార్యకలాపం అయినా సరే స్థిరత్వం తో కూడి ఉండాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ రంగం యొక్క సవాళ్ళ ను నిర్మాణాత్మకమైన రీతి లో పరిష్కరించడం కోసం స్టార్ట్-అప్ సంబంధి ఆలోచనల కు మరియు క్రొత్త క్రొత్త సేవల కు ఆమె ఆహ్వానాన్ని పలికారు. గనుల త్రవ్వకం రంగం లో సంకటమైన అంశాల ను సంబాళించడం కోసం ఐటి వేదిక ల వినియోగం వైపు మొగ్గు చూపాలని, పారదర్శకత్వానికి పూచీ పడాలని, ఇక్కట్టుల ను తగ్గించాలని ఆమె సూచించారు.

 

 

ప్రారంభిక సదస్సు తరువాత, వేరు వేరు స్టేక్ హోల్డర్స్ నల్లరాయి గనుల త్రవ్వకం మరియు చలవరాయి గనుల త్రవ్వకం అంశాలను గురించిన నివేదికల ను సమర్పించారు. తదనంతరం, పరిశ్రమ సంఘం అభ్యంతరాల ను తెలిపిన అంశాల పట్ల కర్నాటక, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతిస్పందిస్తూ నివేదికల ను సమర్పించాయి. నల్లరాయి మరియు చలవరాయి ఖనిజాల నియంత్రణ కు సంబంధించిన అత్యుత్తమ అభ్యాసాల ను కూడ ప్రముఖం గా ప్రకటించాయి.

 

 

నేశనల్ కౌన్సిల్ ఫార్ సిమెంట్ ఎండ్ బిల్డింగ్ మెటీరియల్ డిపిఐఐటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టరు డాక్టర్ శ్రీ బి. పాండురంగ రావు కూడా ఒక నివేదిక ను సమర్పించారు. ఆ నివేదిక భారతదేశం లో సిమెంటు మరియు నిర్మాణ పరిశ్రమ లో నల్లరాయి, ఇంకా చలవరాయి పరిశ్రమ పాత్ర కు సంబంధించింది. ఐబిఎమ్ లో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ గా ఉన్న శ్రీ పీయూష్ నారాయణ్ శర్మ గనుల త్రవ్వకం రంగం లో స్థిరత్వసహిత అభివృద్ధి ని గురించిన మరియు గనుల నక్షత్ర యుక్త రేటింగు ను గురించిన నివేదిక ను సమర్పించారు.

 

 

 

***

 


(Release ID: 2022231) Visitor Counter : 101