రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వైఏఐ సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024

Posted On: 19 MAY 2024 10:38AM by PIB Hyderabad

 

యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (YAI) సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024 పోటీలు మే 18న ముగిసాయి. జాతీయ ఛాంపియన్‌ కోసం పోటీ  తీవ్రంగా జరిగింది. విజేతలను నిర్ణయించడానికి మే 18న  నాలుగు పతక పోటీలు జరిగాయి. సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024 పోటీలు ముంబైలోని ఇండియన్ నేవల్ వాటర్‌మాన్‌షిప్ ట్రైనింగ్ సెంటర్ (INWTC)లో మే 12-18 వరకు జరిగాయి. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య పోటీలు జరిగాయి.  గాలులు 20 నాట్‌లకు చేరుకోవడం పోటీదారుల ఉత్సాహాన్ని పెంచింది.

యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (YAI), ఇండియన్ నేవీ సెయిలింగ్ అసోసియేషన్ (INSA) ఆధ్వర్యంలో ఎనిమిది  ఒలింపిక్ తరగతుల్లో పోటీలు జరిగాయి. ఛాంపియన్‌షిప్‌లో iQFoil (పురుషులు, మహిళలు విండ్‌సర్ఫ్‌ను విడదీయడం), NACRA 17 (మిశ్రమ ఫోయిలింగ్ కాటమరాన్)  ILCA 7 (పురుషులు సింగిల్ హ్యాండ్ డింగీ), ILCA 6 (మహిళలు సింగిల్ హ్యాండ్ డింగీ), 470 (మిశ్రమ డింగీ), 49er (పురుషులు స్కిఫ్), 49erFX (మహిళలు స్కిఫ్), ఫార్ములా కైట్ (పురుషులు మరియు మహిళలు కైట్‌సర్ఫింగ్) తరగతుల్లో పోటీలు జరిగాయి. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  10 సెయిలింగ్ క్లబ్‌ల నుంచి  82 మంది విజయం కోసం పోటీ పడ్డారు.  నేషనల్ ఛాంపియన్ ఆఫ్ సెయిలింగ్ టైటిల్‌ విజేతను నిర్ణయించడానికి ఆరు రోజుల పాటు  04 పతకాల రేసులతో సహా మొత్తం 94 రేసుల్లో తీవ్ర పోటీ జరిగింది.

 

వరల్డ్ సెయిలింగ్ ఇంటర్నేషనల్ రేస్ అధికారులు ,ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియా నుంచి వచ్చిన   అంతర్జాతీయ న్యాయ నిర్ణేతలు నిపుణుల పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. పోటీ పడిన వారందరికీ సమాన అవకాశాలు కల్పించారు.  ఉన్నత ప్రమాణాలతో పోటీలు నిర్వగించిన నిర్వాహకులు నావికుల పోటీ స్ఫూర్తిని ప్రదర్శించడానికి అవకాశం అందించారు.
 

2024 మే 18న NWTC (ముంబై)లో జరిగిన ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన పశ్చిమ నౌకా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ విజేతలకు పతకాలు ప్రధానం చేశారు. ఉత్సాహం, ఉల్లాసం, నైపుణ్యం స్పూర్తితో అంతర్జాతీయ సెయిలింగ్ ఈవెంట్‌లలో దేశం కోసం పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన సంజయ్ జె సింగ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి  కృషి చేయాలని సూచించారు. ఆర్మీ, నేవీకి చెందిన జట్లు కలిసి అత్యధిక పతకాలు గెలుచుకున్నాయి.  వివిధ విభాగాల్లో పతకాలు అందించారు.
 

ఏ . ఐక్యూ  ఫాయిల్ (పురుషులు)
i. స్వర్ణం  – ఏవైఎన్ కు చెందిన సౌరభ్ కుమార్
ii. రజతం -ఏవైఎన్ కు చెందిన కెప్టెన్ ఆదిత్య సంఘవాన్
iii. కాంస్యం -గోవా ఐఎన్డబ్ల్యుటీసీ నుంచి పాల్గొన్న ఎన్ఎస్  రావత్
బి.  ఐక్యూ  ఫాయిల్(మహిళలు)
i. స్వర్ణం - ఎన్ఎస్ఎస్ భోపాల్ నుంచి వచ్చిన విద్యాన్షి మిశ్రా
సి. ఫార్ములా కైట్  (పురుషులు)
i. స్వర్ణం -  ఏవైఎన్ కు చెందినహృదిన్
ii. రజతం -  ఏవైఎన్ కు చెందినఆశిష్ ఎస్ రాయ్
డి. ఎన్ఏసిఆర్ఐ  17(మిశ్రమ)
i. స్వర్ణం  – ఏవైఎన్ కు చెందిన డోయిపోడ్, రమ్య శరవణన్
ii. రజతం - ఐఎన్ డబ్ల్యుటీసీ నుంచి పాల్గొన్న అమన్ వ్యాస్ , ఆస్తా సేనాపతి
ఈ. 49erFX(మహిళలు)
స్వర్ణం  హర్షిత తోమర్, సీపీఓ(పీటీ),శ్రీమతి శీతల్ వర్మ ఐఎన్ డబ్ల్యుటీసీ
ఎఫ్. 49 er  (పురుషులు)
i. స్వర్ణం  - ఏవైఎన్ కు చెందిన ప్రిన్స్ నోబెల్, మను ఫ్రాన్సిస్
ii. రజతం –ఐఎన్ డబ్ల్యుటీసీ నుంచి పాల్గొన్న సతీష్ యాదవ్, అలంకార్ సూర్యవంశీ
iii. కాంస్యం – ఆనంద్ ఠాకూర్, సీపీఓ కామ్ (టెల్),ఐఎన్ డబ్ల్యుటీసీ కి
చెందిన  సత్యం రంగద్,
జీ. ILCA 7 (పురుషులు)
i. స్వర్ణం  –ఏవైఎన్ కు చెందిన  మోహిత్ సైనీ
ii. రజతం  -ఐఎన్ డబ్ల్యుటీసీ నుంచి పాల్గొన్న డీకే  సైనీ,
iii. కాంస్యం - ఏవైఎన్ కు చెందిన సికాన్షు సింగ్
హెచ్. ILCA 6 (మహిళలు)
i. స్వర్ణం -ఐఎన్ డబ్ల్యుటీసీ సీపీటీ(పీటీ) కి చెందిన  రితికా డాంగి,
ii. రజతం - ఎన్ఎస్ఎస్  భోపాల్ నుంచి వచ్చిన  శ్రీమతి నేహా ఠాకూర్
iii. కాంస్యం - జీవైఈ కు చెందిన  పెరల్ కోల్వర్కార్
హెచ్. 470 (మిశ్రమ)
i. స్వర్ణం  – -ఐఎన్ డబ్ల్యుటీసీ కి చెందిన శ్రద్ధా వర్మ, , సీపి (యూఎస్)
కి చెందిన ఆర్కే శర్మ,
ii. రజతం - ఉమా చౌహాన్,,సుధాన్షు శేఖర్, I
iii. కాంస్యం - ఏవైఎన్ నుంచి పాల్గొన్న  జస్పాల్ సింగ్ , వంశిక సింగ్

***


(Release ID: 2021103) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi