రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ద్వైపాక్షిక రక్షణ సంబంధాల ను పటిష్టపరచుకోవడం కోసం ఉలాన్‌బటార్ లో జరిగిన ఇండియా-మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూపు 12 వ సమావేశం

Posted On: 17 MAY 2024 10:20AM by PIB Hyderabad

భారతదేశం మరియు మంగోలియా లకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒడి) ల మధ్య జాయింట్ వర్కింగ్ గ్రూపు (జెడబ్ల్యుజి) యొక్క పన్నెండో సమావేశం 2024 మే 16, 17 వ తేదీల లో ఉలాన్‌బటార్ లో జరిగింది. ఈ సమావేశాని కి భారతదేశం రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అమితాభ్ ప్రసాద్ మరియు మంగోలియా రక్షణ శాఖ స్టేట్ సెక్రట్రి బ్రిగేడియర్ జనరల్ శ్రీ గన్ ఖుయాగ్ దావాగ్ డోర్జ్ లు సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం లో మంగోలియా లో భారతదేశం రాయబారి శ్రీ అతుల్ మల్హారీ గోత్సుర్వే కూడా పాల్గొన్నారు.

 

 

జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశం సాగిన క్రమం లో ఇరు పక్షాలు రెండు దేశాల మధ్య అమలవుతున్న రక్షణ రంగ సంబంధి సహకారం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాయి. వారు ద్వైపాక్షిక రక్షణ సహకార ప్రధానమైన వివిధ కార్యక్రమాల లో ప్రగతి ని సమీక్షించారు. అంతేకాకుండా, ఈ దిశ లో తీసుకొన్న చర్యల ను స్పష్టం చేస్తూ ఆ యా రంగాల లో సహకారాన్ని మరింత గా పెంపొందింప చేసుకొనేందుకు గల ఉపాయాల ను గుర్తించారు. ఉభయ పక్షాలు వర్తమాన భౌగోళిక రాజకీయ స్థితి పట్ల కూడా అభిప్రాయాల ను పరస్పరం తెలియ జేసుకొన్నారు.

 

 

భారతదేశం యొక్క రక్షణ పరిశ్రమ యొక్క శక్తి యుక్తుల ను గురించి సంయుక్త కార్యదర్శి ప్రముఖం గా ప్రకటించారు. మంగోలియా యొక్క సాయుధ బలగాల తో కలసి ఒక ఉపయోగకరమైన భాగస్వామ్యం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగోలియా పక్షం భారతదేశం పరిశ్రమ యొక్క సత్తా పట్ల బరోసా ను వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు రెండు దేశాల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతూ ఉన్నాయన్న సంగతి ని కూడా గుర్తించాయి.

 

 

సంయుక్త కార్యదర్శి మరియు భారతదేశం యొక్క రాయబారి లు మంగోలియా రక్షణ శాఖ ఉప మంత్రి శ్రీ బి. బరమగ్నయి తో కూడా సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సహకారం సంబంధి అంశాల ను ఈ సందర్భం లో చర్చించారు. ప్రతినిధి వర్గం ఉలాన్‌బటార్ లో ఒక శిక్షణ సంస్థ ను సందర్శించి, అక్కడి కార్యకలాపాల ను సమీక్షించింది.

 

 

మంగోలియా తో భారతదేశాని కి చాలా కాలం నుండి పాత చారిత్రిక, సాంస్కృతిక మరియు నాగరకత పరమైన సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానిని మరొకటి ‘ఆధ్యాత్మిక ఇరుగు పొరుగు దేశాలు’ గా భావిస్తున్నాయి. ఆధునిక యుగం లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మరియు బజారు ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ల వంటి విలువలు ఇరు దేశాల ను సన్నిహితం గా నిలబెడుతూ ఉన్నాయి.

***



(Release ID: 2020882) Visitor Counter : 65