ఉప రాష్ట్రపతి సచివాలయం
దేశం యొక్క హితాల ను అన్నింటికంటే మిన్నగా నిలపాలనిపౌరుల కు విజ్ఞప్తి చేసిన ఉప రాష్ట్రపతి
గీత యొక్క శాశ్వత జ్ఞానం అనిశ్చితి మధ్య ఒక దారి దీపంగా నిలుస్తుందని స్పష్టం చేసిన ఉప రాష్ట్రపతి
ఉన్నతి, ఆధ్యాత్మికత్వం, ధార్మికత్వం, కర్తవ్య నిష్ఠ మరియుస్వయం నుండి మిమ్మల్ని మీరు వేరు గా చూసే మార్గాన్ని వెలుగుల తో నింపుతుంది గీత: ఉప రాష్ట్రపతి
కశ్మీర్ లోని సుందరమైన లోయ లో పర్యటకుల రాక అంతకంతకుపెరుగుతూ ఉండడాన్ని ప్రస్తావించి, అది పెనుకటి ధోరణుల లో ఒక మహత్వపూర్ణమైన పెంపుదలను సూచిస్తోందన్న ఉప రాష్ట్రపతి
Posted On:
14 MAY 2024 8:03PM by PIB Hyderabad
దేశం యొక్క హితాల ను అన్నింటి కంటే మిన్నగా నిలపవలసింది గా పౌరుల కు ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఈ రోజు న విజ్ఞప్తి చేశారు. భగవద్ గీత లో ఉన్న శాశ్వతమైన ప్రభోదాల నుండి మార్గదర్శకత్వాన్ని స్వీకరించవలసింది అంటూ పౌరుల ను ఆయన కోరారు. కలకాలం నిలచేటటువంటి గీత యొక్క జ్ఞానాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ స్పష్టం చేస్తూ, అనిశ్చితి మధ్య గీత ఒక మార్గదర్శకమైన కాంతి వలె ఉంది అన్నారు. ఉన్నతి, ఆధ్యాత్మికత్వం, ధార్మికత్వం, కర్తవ్య నిష్ఠ మరియు స్వయం నుండి మనల ను మనం వేరు చేసుకొనేటటువంటి మార్గాన్ని గీత తెలియ జేస్తున్నది అన్నారు.
భగవద్ గీత పై డాక్టర్ శ్రీ సుభాష్ కశ్యప్ యొక్క వ్యాఖ్యానాన్ని పార్లమెంటు భవనం లో ఆవిష్కరించిన సందర్భం లో , శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ గీత నుండి ప్రేరణ ను పొందుతూ రాజ్యాంగం యొక్క సిసలు ప్రతి లో 22 లఘు చిత్రాల ను పొందుపరచిన సంగతి ని ప్రస్తావించారు. రాజ్యాంగం యొక్క నాలుగో భాగం లో ప్రభుత్వ విధానం తాలూకు ఆదేశ సూత్రాల ను గురించి ఆయన ప్రత్యేకం గా పేర్కొంటూ, భగవాన్ కృష్ణుడు కురుక్షేత్రం లో యుద్ధ రంగం లో అర్జునుని కి జ్ఞానాన్ని బోధించిన గీత యొక్క బోధనల తో కూడిన ఒక ప్రబలమైన పోలిక ను చెప్పారు.
భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో డాక్టర్ శ్రీ కశ్యప్ కు గల విస్తృతమైనటువంటి అనుభవాన్ని గురించి శ్రీ ధన్ ఖడ్ చెప్తూ, డాక్టర్ శ్రీ కశ్యప్ సంకీర్ణ సర్కారుల దుర్దశ ను చూశారు, ఆ దుర్దశ నుండి 2014 వ సంవత్సరం లో ఊరట లభించింది అన్నారు. సంకీర్ణ సర్కారు అంతం అయిన తరువాత, దేశం డాక్టర్ శ్రీ సుభాష్ కశ్యప్ ను పద్మ భూషణ్ పురస్కారం తో సమ్మానించిందన్నారు.
డాక్టర్ శ్రీ కశ్యప్ కు ఉన్న రాజ్యాంగ పరమైన నైతికత, యోగ్యత, ఉన్నత నైతిక విలువ లు ప్రశంసనీయం అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అంటూ ఆయన ఎన్నడూ రాజకీయ పట్టకం లో నుండి అంశాల ను చూడనే లేదు, అంతకంటే తన అభిప్రాయాల ను దృఢ విశ్వాసం మరియు నిజాయతీ లతో నిర్మించుకొన్నారని చెప్పారు.
జాతీయ వ్యవహారాల కు సంబంధించి ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంక్ ల వంటి ప్రపంచ సంస్థ లు భారతదేశాని కి ఆదేశాల ను ఇస్తూ వచ్చినటువంటి ఒక కాలాన్ని గురించి శ్రీ ధన్ ఖడ్ గుర్తకు తీసుకు వస్తూ, ప్రపంచ ఆర్థిక స్వారూపం లో చోటు చేసుకొన్న మార్పుల ను గురించి ప్రస్తావించారు. ఫ్రాన్స్, యుకె, కెనడా, బ్రెజిల్ ల వంటి ఆర్థిక వ్యవస్థల ను భారతదేశం వెనుకకు నెట్టి అయిదో అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గా మారిపోయింది అని శ్రీ ధన్ ఖడ్ అన్నారు.
కశ్మీర్ లో పర్యటన రంగం లో చోటు చేసుకొన్న పరివర్తనకారి మార్పు ను గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ చెప్తూ, కశ్మీర్ లోని సుందరమైన లోయ లో పర్యటకుల వృద్ధి చెప్పుకోతగినంత గా ఉందని, ఇది వెనుకటి ధోరణుల తో పోలిస్తే ఒక ముఖ్యమైన పెంపు ను సూచిస్తోందని పేర్కొన్నారు.
***
(Release ID: 2020683)
Visitor Counter : 102