రక్షణ మంత్రిత్వ శాఖ
టాంజానియాలో అధికారిక పర్యటనకు బయలుదేరిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా
Posted On:
12 MAY 2024 5:10PM by PIB Hyderabad
డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీజీ డిఐఏ) లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. 13-15 మే 2024 వరకు ఈ పర్యటన చేయనున్నారు. రెండు దేశాల మధ్య దృఢమైన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతా సహకారం కోసం అవకాశాలను చర్చించడం ఈ పర్యటన ఉద్దేశం.
తన పర్యటనలో, డీజీ డిఐఏ టాంజానియా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ జాకబ్ జాన్ కుండా, అక్కడి డిఫెన్స్ ఇంటిలిజెన్స్ మేజర్ జనరల్ ఎంఎన్ కెరేమి మొదలైన టాంజానియా సీనియర్ సైనిక నాయకత్వంతో సమావేశాలు ఉంటాయి. టాంజానియా నేషనల్ డిఫెన్స్ కాలేజీకి పర్యటనలో, టిపిడిఎఫ్ భవిష్యత్తు నాయకులతో భారతదేశ భద్రతా దృక్పథం గురించి చర్చిస్తారు. ఈ సమావేశాలు పరస్పర అవగాహన పెంపొందించుకోవడం, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంటాయి.
లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా భారత హైకమిషన్ దార్ ఎస్ సలామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ వింగ్‌ను కూడా ప్రారంభిస్తారు. సైనిక సహకారాన్ని విస్తరింపజేయడానికి సుహృద్భావ సూచనగా, టిపిడిఎఫ్ కి భారతదేశంలో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేస్తారు. కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ సిఎస్సి అరుష వద్ద డీజీ డిఐఏ లైబ్రరీని ప్రారంభిస్తారు. భారత ప్రభుత్వ సహాయం ద్వారా ఏర్పాటు చేయనున్న వ్యాయామశాలకు శంకుస్థాపన చేస్తారు.
భారతదేశం టాంజానియాతో సన్నిహిత, సహృద్భావ, స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటుంది, ఇది బలమైన సామర్థ్యం పెంపుదల, రక్షణ సహకారానికి మార్గాల ద్వారా బలోపేతం చేయబడింది. భారత సైనిక ప్రతినిధి బృందం పర్యటన టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2020442)
Visitor Counter : 84