శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"జాతీయ సాంకేతిక దినోత్సవం-2024ను జరుపుకున్న టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి)-సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం
స్థిరమైన భవిష్యత్తు కోసం క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీల ప్రచారం
Posted On:
12 MAY 2024 12:48PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) మే 11న న్యూఢిల్లీలోని ఐటిఓలోగల ఐఎన్‌ఎస్‌ఏ ఆడిటోరియంలో జాతీయ సాంకేతిక దినోత్సవం, 2024ని జరుపుకుంది.
'సుస్థిర భవిష్యత్తు కోసం క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలను ప్రోత్సహించడం' అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమం..ప్రముఖ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, క్లీన్ అండ్ గ్రీన్ మరియు మరింత స్థితిస్థాపక దిశగా దేశం ప్రయాణించేందుకు ఒక మార్గాన్ని రూపొందించాలనే లక్ష్యంతో జరిగింది.
ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్‌ఈఎంఎంపి) మరియు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌ఏఎంఈ) వేగవంతమైన అడాప్షన్ మరియు తయారీ వంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ప్రమోషన్‌ను భారతదేశం చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు అడ్వైజరీ కౌన్సిల్ (పిపి-ఎస్‌టిఐఏసి) నేతృత్వంలోని ఈవీ మిషన్‌ను, ఈవీ స్వీకరణ కోసం సహాయక ప్రమాణాలు మరియు ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడిందని వివరించారు.

2070 నాటికి నికర-సున్నా లక్ష్యం వైపు భారతదేశ ప్రయాణంలో జాతీయ హైడ్రోజన్ మిషన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రొఫెసర్ సూద్ వివరించారు. ఈ మిషన్‌లో కీలకమైన అంశంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో గణనీయమైన పెట్టుబడులని తెలిపారు. కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సిసియుఎస్) సాంకేతికతలలో కొనసాగుతున్న ప్రయత్నాలను కూడా ప్రొ. సూద్ హైలైట్ చేశారు. సుస్థిర అభివృద్ధి మరియు అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం భారతదేశ సాంకేతిక ఫ్రేమ్‌వర్క్‌లు మరియు విధానాలను పెంపొందించడంలో జీరో ఎమిషన్ ట్రక్కింగ్‌పై రాకీ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఎంఐ)తో ఓపిఎస్‌ఏ భాగస్వామ్యం వంటి సంప్రదింపుల సమూహాలు మరియు అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యతను కూడా ప్రొ.సూద్ హైలైట్ చేశారు.
డీఎస్టీ సెక్రటరీ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. వ్యక్తులు దేశ ప్రగతికి దోహదపడే అవకాశాలను అందించారు. స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడం మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించడం లక్ష్యంగా నిధి మరియు టిడిబి వంటి పథకాల ద్వారా వివిధ పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడంలో మరియు ఆవిష్కరణలను పెంపొందించడంలో ప్రభుత్వ చొరవలను ఆయన హైలైట్ చేశారు. ప్రొ. కరాండికర్ తన ప్రసంగంలో స్థిరమైన రంగాలలో ముఖ్యంగా నీటి శుద్ధి మరియు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) వంటి క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలలో పరిశోధన మరియు అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో డిఎస్టీ యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమాలలో చేసిన గణనీయమైన పెట్టుబడులను ఆయన గుర్తించారు మరియు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో స్టార్టప్‌లు మరియు ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇవ్వడంలో టిడిబి మార్గదర్శక ప్రయత్నాలను హైలైట్ చేశారు.

సాంకేతిక మంత్రిత్వ శాఖలతో సహకారాన్ని మరియు సుస్థిరత లక్ష్యాల వైపు వారి పరివర్తనను ప్రొ. కరాండికర్ హైలైట్ చేస్తూ పురోగతిని నడపడానికి పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లలో సాంకేతికతను సమగ్రపరచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 2070 నాటికి నికరసున్నా కర్బన ఉద్గారాలను సాధించాలనే దృక్పథంతో సుస్థిరత ప్రయత్నాలలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ప్రొ.కరాండికర్ ఆకాంక్షించారు.
పద్మశ్రీ ప్రొఫెసర్. జి.డి. యాదవ్ చేసిన ముఖ్య ఉపన్యాసం 2070 నాటికి కార్బన్ నికర సున్నాని సాధించడానికి స్థిరమైన పరిష్కారాలు, కార్బన్ తొలగింపు మరియు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కొనసాగింది. వైట్ హైడ్రోజన్ సంభావ్యతను మరియు గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తు వాగ్దానాన్ని ఆయన హైలైట్ చేశారు. వ్యర్థాల నుండి సంపద కర్మాగారాలు, హైడ్రోజనేటింగ్ ప్లాస్టిక్ మరియు బ్యాటరీ రీసైక్లింగ్‌ను స్థిరమైన ఆవిష్కరణలకు మార్గాలుగా ప్రతిపాదించడాన్ని వివరించారు.
టిడిబి కార్యదర్శి శ్రీ.రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ టిడిబి ద్వారా నిధులు సమకూరుస్తున్న కీలకమైన ప్రాజెక్ట్‌లను హైలైట్ చేశారు. పర్యావరణ సారథ్యాన్ని పెంపొందించడంలో ఈ సాంకేతికతల కీలక పాత్రను వివరించారు.
ఐఎన్‌ఎస్‌ఏ ప్రెసిడెంట్ మరియు డిఎస్టీ మాజీ సెక్రటరీప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ సుస్థిరత లక్ష్యాలను సాధించడంలో సాంకేతికత యొక్క కీలక పాత్రను హైలైట్ చేశారు. విధాన నిర్ణేతలు మరియు వాటాదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. "సాంకేతికత రెండు వైపులా పదును గల కత్తి: ఇది అసమర్థతను తగ్గిస్తుంది, కానీ వినియోగాన్ని పెంచగలదు. దీనిని ఎదుర్కోవడానికి, ఈవీలు, గ్రీన్ హైడ్రోజన్, కార్బన్ క్యాప్చర్ మరియు ఇంధన-సమర్థవంతమైన ఆవాసాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తికి మారడం చాలా అవసరమని..వాతావరణ మార్పు సాంకేతికత సుస్థిరతకు ఉపయోగపడుతుందని నిర్ధారిద్దామని పిలుపునిచ్చారు.
ప్రతిష్టాత్మకమైన రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్ (ఐఎస్‌ఈఎఫ్)లో పోటీ చేసేందుకు ఎంపికైన 20 ప్రాజెక్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 100 వినూత్న ప్రాజెక్ట్‌లను ప్రదర్శించిన 140 మంది విద్యార్థులలో ఈ ఫైనలిస్టులు యూఎస్‌ఏలోని లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో మే 11-17, 2024 నుండి రెజెనెరాన్ ఐఎస్‌ఈఎఫ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి గౌరవనీయమైన స్థానాన్ని పొందారు. రెజెనెరాన్ ఐఎస్‌ఈఎఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీ-కాలేజ్ సైన్స్ ఫెయిర్‌గా ప్రసిద్ధి చెందింది. 60కు పైగా దేశాల నుండి 1,600 మంది యువ సైన్స్ ఔత్సాహికులను ఇది ఏకం చేసింది. ఆలోచనల మార్పిడిని ప్రోత్సహిస్తుంది మరియు అత్యాధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ప్రదర్శిస్తుంది. "ఒలింపిక్స్ ఆఫ్ సైన్స్ ఫెయిర్స్"గా పిలువబడే ఈ కార్యక్రమం ప్రపంచ వేదికపై ప్రకాశింపజేయడానికి యువతకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
***
(Release ID: 2020435)
Visitor Counter : 291