పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

24 ఆర్థిక సంవత్సరంలో 25 రెట్లు పెరిగిన ఒఎంసిల ఉమ్మడి లాభం


2014 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 543% పెరిగిన ఒఎంసిల ఉమ్మడి లాభం

2024 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, లాభాల పరంగా చారిత్రాత్మక అత్యుత్తమ ఫలితాలు నమోదు చేసిన ఐఓసీఎల్

Posted On: 10 MAY 2024 7:49PM by PIB Hyderabad

2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు  (ఓఎంసీలు) అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.  వేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయాలు,చమురు ధరల్లో వచ్చిన హెచ్చుతగ్గుల మధ్య ప్రభుత్వ రంగ చమురు సంస్థలు  సరసమైన ధరలకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేశాయి.  భారతదేశంలో ఇంధన ధరలపై అతి తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావం చూపించే అంశంలో విజయం సాధించిన చమురు సంస్థలు  ప్రశంసనీయమైన వార్షిక ఫలితాలు సాధించి   వాటాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. 

 అయితే, కొన్ని మీడియా సంస్థలు చమురు సంస్థల వార్షిక పనితీరును అధ్వాన్నంగా చిత్రీకరించి, వాస్తవ విరుద్ధ పరిస్థితిని చూపించడానికి  కేవలం 2024 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికం,  2023 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసిక ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి.  అత్యుత్తమ ఉత్పత్తి,    అద్భుతమైన క్యాపెక్స్ వినియోగం, పూర్తయిన ప్రాజెక్ట్‌లు వంటి ముఖ్యమైన అంశాలను సదరు మీడియా సంస్థలు పూర్తిగా విస్మరించాయి. ఈ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు, కధనాలు వాస్తవ విరుద్ధంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ చమురు సంస్థల  ఉమ్మడి లాభం రూ. 86,000 కోట్లుగా ఉంది. ఈ మొత్తం  మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 25 రెట్లు ఎక్కువ. పూర్తి 2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్ పీసీఎల్ రికార్డు స్థాయిలో రూ. 16,014 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  అంతకు ముందు సంవత్సరంలో సంస్థకు  రూ. 6,980 కోట్ల నష్టం వచ్చింది. ఐఓసీఎల్  చారిత్రాత్మకంగా అత్యుత్తమ రిఫైనరీ ఉత్పత్తి , అమ్మకాలు, నికర లాభాలను నమోదు చేసింది. 

 2023-24 ఆర్థిక సంవత్సరంలో బిఓసీఎల్  పన్ను తర్వాత  26,673 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ. అదనంగా, 'ప్రాజెక్ట్ ఆస్పైర్' కింద 5 సంవత్సరాల కాలంలో 1.7 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికాబద్ధంగా మూలధన ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించింది.  వాటాదారులకు దీర్ఘకాలిక విలువలు అందించడానికి సంస్థ  ఉంది.

ఆర్థిక ఫలితాలు వెలువడిన  తర్వాత మార్కెట్లు సానుకూలంగా స్పందించడంతో బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ షేర్ల ధరలు పెరిగాయి. అంతేకాకుండా, సంస్థల పనితీరును గుర్తించిన  విశ్లేషకులు సంస్థల  వాటాలు  కొనుగోలు చేయాలని  సిఫార్సు చేశారు. దీనివల్ల సంస్థల  వార్షిక పనితీరు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు దృవీకరించారు. 

గత కొన్ని సంవత్సరాలుగా, స్వేచ్ఛ , జవాబుదారీతనం విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ రంగ చమురు సంస్థల సామర్ద్యాన్ని పెంపొందించడానికి  ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేసింది.  ఆవిష్కరించింది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధన కోసం రూపొందిన  ప్రతిష్టాత్మక ప్రణాళికలకు పూర్తిగా సహకారం అందిస్తూ అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం సంస్థల   వ్యాపార నిర్ణయాల్లో ఎక్కువగా జోక్యం  చేసుకోవడం లేదు. 

***



(Release ID: 2020414) Visitor Counter : 68