శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'జాతీయ సాంకేతికత దినోత్సవం' జరుపుకున్న "కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)"
प्रविष्टि तिथि:
10 MAY 2024 7:47PM by PIB Hyderabad
"కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)" ఈ నెల 10న 'జాతీయ సాంకేతికత దినోత్సవం' జరుపుకుంది. సాంకేతికతలో భారతదేశం సాధించిన నైపుణ్యాన్ని చాటేందుకు ప్రతి సంవత్సరం మే 11వ తేదీన మన దేశంలో జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది, దేశం సాధించిన సాంకేతికత అద్భుతాల గురించి ప్రజల్లో అవగాహన పెంచుతుంది, యువతను ఉత్సాహపరుస్తుంది.
బార్క్ 'ఆరోగ్యం, భద్రత, పర్యావరణం' గ్రూప్ డైరెక్టర్ డా. డి.కె. అస్వాల్ వేడుకల్లో పాల్గొన్నారు. "స్వచ్ఛమైన పర్యావరణం, సుస్థిర భవిష్యత్తు కోసం అణుశక్తి" అనే అంశంపై ఆయన మాట్లాడారు. అణు వికిరణ ప్రమాదాలు, వినియోగానికి సంబంధించిన వివిధ అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. బొగ్గు ఆధారిత శక్తి కంటే అణుశక్తి చాలా సురక్షితమైనదని, మరింత చవకైనదని డా.అస్వాల్ చెప్పారు.


సీఎస్ఐఆర్-ఐఐపీ డైరెక్టర్ డా. హెచ్.ఎస్. బిష్త్ కూడా సాంకేతికత గురించి చాలా విషయాలు మాట్లాడారు, విద్యార్థులను చైతన్యపరిచారు. ఇది సమాజానికి విస్తృత ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. సీఎస్ఐఆర్-ఐఐపీ చేపట్టిన జిజ్ఞాస కార్యకలాపాల గురించి, పాఠశాల విద్యార్థులకు ఇది ఎలా ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయాలపై సీఎస్ఐఆర్-ఐఐపీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కో-ఆర్డినేటర్ డా.ఆర్తి సంక్షిప్త సమాచారం అందించారు.
శ్రీ అంజుమ్ శర్మ, శ్రీ సోమేశ్వర్ పాండే వంటి సీనియర్ అధికార్లు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2020412)
आगंतुक पटल : 170