యు పి ఎస్ సి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్, (ఐ) 2024 రాత ఫలితాలు విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Posted On:
09 MAY 2024 6:33PM by PIB Hyderabad
2024 ఏప్రిల్ 21న నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్, (ఐ) 2024 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆర్మీలో ప్రవేశం కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూకు రాత పరీక్షలో విజయం సాధించిన ఈ క్రింది రోల్ నెంబర్లు కలిగిన అభ్యర్థులు అర్హత సాధించారు. 2025 జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల 153వ కోర్సు, 115వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్స్ (ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థులను ఇంటర్వ్యూ లో ఎంపిక చేస్తారు. ఫలితాలు కమిషన్ వెబ్ సైట్ www.upsc.gov.in. లో అందుబాటులో ఉన్నాయి.
2. జాబితాలో పొందుపరిచిన అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమే. ప్రవేశం కోసం పొందుపరిచిన షరతులు, నిబంధనలకు అనుగుణంగా " అభ్యర్థులు తమ పేర్లను
ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ website joinindianarmy.nic.in లో ఫలితాలు వెలువడిన రెండు వారాల లోగా నమోదు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. నమోదు కార్యక్రమం పూర్తైన తర్వాత విజయం సాధించిన అభ్యర్థులకు ఎంపిక కేంద్రాలు, తేదీలు కేటాయించి వివరాలను రిజిస్టర్ అయిన ఈ మెయిల్ ఐడీ కి పంపుతారు. ఇప్పటికే సైట్ లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మరోసారి రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం ఉండదు. సమస్య/ లాగ్ ఇన్ సమస్య తలెత్తినప్పుడు ఈ మెయిల్ ను dir-recruiting6-mod[at]nic[dot]in.” పంపుతారు.
" ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు వయస్సు, విద్యార్హత కు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ కు అందజేయాల్సి ఉంటుంది." తమ ఒరిజినల్ పత్రాలను అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపకూడదు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ కార్యాలయం గేట్ సి వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని స్వయంగా లేదా 011-2385271/011- 23098543 ఫోన్ నెంబర్ ద్వారా పని చేసే రోజుల్లో ఉదయం 10.00 నుంచి 1700 వరకు సంప్రదించవచ్చు. ఎస్ఎస్బి /ఇంటర్వ్యూ సంబంధిత విషయాల కోసం అభ్యర్థులు మొదటి ఎంపికగా సైన్యం ఆయితే టెలిఫోన్ నెంబర్ 011-26175473 లేదా joinindianarmy.nic.in, 011-23010097/ నేవీ/ నేవల్ అకాడమీ మొదటి ఎంపిక అయితే 011-23010231 Extn 7645/7646/7610 లేదా Email: officer-navy[at]nic[dot]in or joinindiannavy.gov.in www.careerindianairforce.cdac.in, ఎయిర్ ఫోర్స్ మొదటి ఎంపిక అయితే 011-23010231 Extn. 7645/7646/7610 or www.careerindianairforce.cdac.ని సంప్రదించాల్సి ఉంటుంది.
3. అభ్యర్థుల మార్కుల షీట్లు తుది ఫలితం వెలువడిన తేదీ నుంచి పదిహేను (15) రోజులలోపు కమిషన్ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. (ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను ముగిసిన తర్వాత). ముప్పై (30) రోజుల పాటు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 2020199)
Visitor Counter : 127