సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దివంగత శ్రీ రఫీ అహ్మద్ కిద్వాయ్ ప్రైవేట్ పేపర్ సేకరణలను కొనుగోలు చేసిన నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా
Posted On:
08 MAY 2024 5:57PM by PIB Hyderabad
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ) దివంగత శ్రీ రఫీ అహ్మద్ కిద్వాయ్ యొక్క ప్రైవేట్ పేపర్ సేకరణను కొనుగోలు చేసింది. ఇందులో పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పి.డి. టాండన్ వంటి ఇతర ప్రముఖ నాయకులతో శ్రీ కిద్వాయ్ జరిపిన విలువైన సంభాషణలు ఉన్నాయి. ఈ పత్రాలను వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ (ఐఏఎస్)చే ఎన్ఏఐ డీజీకి అందజేయబడ్డాయి. శ్రీ రఫీ అహ్మద్ కిద్వాయ్ సోదరుడు శ్రీ హుస్సేన్ కమిల్ కిద్వాయ్ కుమార్తె శ్రీమతి తజీన్ కిద్వాయ్, శ్రీమతి సారా మనాల్ కిద్వాయ్ సమక్షంలో వీటిని అందజేశారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క నాన్-కరెంట్ రికార్డ్‌ల సంరక్షకుడు మరియు పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 1993 యొక్క నిబంధన ప్రకారం నిర్వాహకులు మరియు పరిశోధకుల ఉపయోగం కోసం వాటిని ట్రస్ట్‌లో ఉంచుతుంది. ప్రధాన ఆర్కైవల్ సంస్థగా.. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఆర్కైవల్ స్పృహను మార్గనిర్దేశం చేయడంలో మరియు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పబ్లిక్ రికార్డుల యొక్క విస్తారమైన సేకరణతో పాటు, మన దేశానికి గణనీయమైన కృషి చేసిన అన్ని వర్గాల ప్రముఖ భారతీయుల ప్రైవేట్ పేపర్‌ల యొక్క గొప్ప మరియు ఎప్పటికప్పుడు పెరుగుతున్న సేకరణను ఎన్ఏఐ కలిగి ఉంది. శ్రీ రఫీ అహ్మద్ కిద్వాయ్ చురుకుదనం, తేజస్సు మరియు మనోజ్ఞతను కలిగి ఉన్న వ్యక్తి, అతను మన దేశ స్వాతంత్ర్యం కోసం తన నిరంతర ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు. అన్ని రకాల మతతత్వం మరియు మూఢనమ్మకాలను తిప్పికొట్టాడంలో కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరి 18, 1894న ఉత్తరప్రదేశ్‌లోని మసౌలిలో జన్మించారు. కిద్వాయ్ మధ్య తరగతి జమీందార్ కుటుంబం నుండి వచ్చారు. అతని రాజకీయ ప్రయాణం 1920లో ఖిలాఫత్ ఉద్యమం మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లేందుకు దారితీసింది. కిద్వాయ్ మోతీలాల్ నెహ్రూకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు యునైటెడ్ ప్రావిన్సెస్ కాంగ్రెస్ కమిటీలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. అతని రాజకీయ చతురత అతన్ని పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గంలో మంత్రిగా చేసేందుకు దోహదం చేసింది. మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మరియు జైలు శాఖలను నిర్వహించాడు. స్వాతంత్య్రానంతరం, అతను జవహర్‌లాల్ నెహ్రూ క్యాబినెట్‌లో భారతదేశ మొదటి కమ్యూనికేషన్స్ మంత్రిగా పనిచేశారు, "ఓన్ యువర్ టెలిఫోన్" సేవ మరియు నైట్ ఎయిర్ మెయిల్ వంటి కార్యక్రమాలను ప్రారంభించాడు. 1952లో అతను ఆహార అండ్ వ్యవసాయం పోర్ట్‌ఫోలియో బాధ్యతలు స్వీకరించారు, తన పరిపాలనా నైపుణ్యంతో ఆహార రేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. భారతదేశాన్ని బ్రిటన్ భానిసత్వం నుంచి విముక్తి చేయడానికి మరియు దేశాన్ని బలోపేతం చేయడానికి కిద్వాయ్ ఎంతో అంకితభావంతో అతని రాజకీయ జీవితంలో కృషి చేశారు. 1956లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డును సృష్టించడంతో అతని రచనలు గుర్తించబడ్డాయి. కమ్యూనికేషన్ మంత్రిగా కిద్వాయ్ పదవీకాలం అతనికి ఆవిష్కరణ మరియు ప్రభావానికి ఖ్యాతిని సంపాదించిపెట్టింది. అయితే ఆహార మంత్రిత్వ శాఖలో ప్రతికూల పరిస్థితులలో అతని నాయకత్వం విజయవంతంగా ముందుకుసాగిందని ప్రశంసించబడింది. అతని పటిమ రఫీకి పరిపాలన మాంత్రికుడిగా మరియు అద్భుత వ్యక్తిగా పేరు తెచ్చింది. రఫీ అహ్మద్ కిద్వాయ్ భారత స్వాతంత్ర్య సాధనలో మరియు ఆ తరువాత పరిపాలనలోని వివిధ పాత్రలలో చర్య మరియు అంకితభావాన్ని కలిగి ఉన్నాడు. సంక్షోభాలను త్వరితగతిన పరిష్కరించడంలో మరియు వినూత్న పరిష్కారాలను అమలు చేయడంలో అతని సామర్థ్యం అతని అద్భుతమైన నాయకత్వ లక్షణాలను వెలుగులోకి తెచ్చింది. కమ్యూనికేషన్స్ నుండి వ్యవసాయం వరకు వివిధ రంగాలకు ఆయన చేసిన కృషి దేశాభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. నిబద్ధత కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడిగా మరియు నైపుణ్యం కలిగిన నిర్వాహకుడిగా అతని వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది.
***
(Release ID: 2020090)