సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముస్సోరీలో టాంజానియా అధికారుల కోసం ప్రజా పనుల కోసం ప్రాజెక్ట్ రూపకల్పన,విపత్తు నిర్వహణపై రెండు వారాల సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్

కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ కీలక మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 39 మంది సీనియర్ అధికారులు
ప్రజల అభివృద్ధి, సాధికారతకు ప్రగతిశీల విధానాలు, డిజిటల్ పరిపాలన కీలకం" నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీ

Posted On: 07 MAY 2024 12:06PM by PIB Hyderabad

అధికారులకు అనేక ప్రాజెక్టులు ,ముఖ్యమైన రంగాలలో పనులపై అవగాహన కల్పిస్తారు. నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న అధికారుల కోసం ఈ కార్యక్రమం రూపొందించారు. శిక్షణలో భాగంగా వారికి అత్యాధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రజా పనుల సమర్థ నిర్వహణ,ప్రాజెక్టుల రూపకల్పన తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తారు. దీనివల్ల సుపరిపాలన అందించడానికి, సుస్థిరమైన అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడే కార్యక్రమం రెండు దెహస్లా మధ్య సంబంధాలు బలపరచడానికి దోహదపడుతుందని డాక్టర్ బి.ఎస్ బిష్ట్ వివరించారు. 

 

ప్రాజెక్ట్ ఎంపిక , రూపకల్పన,, ప్రాజెక్ట్ నిర్వహణ, ప్రక్రియలు,విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పీపీపీ విధానం, స్మార్ట్ స్థితిస్థాపక నగరాలు, పబ్లిక్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో ఆవిష్కరణలు, గ్రామీణ, పట్టణ గృహాల నిర్వహణ వంటి విభిన్న రకాల అంశాపై కార్యక్రమంలో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. కార్యమంలో భాగంగా ఈ కార్యక్రమం లీనమయ్యే క్షేత్ర సందర్శన లను నిర్వహిస్తారు. డక్‌పత్తర్ హైడ్రోపవర్ మరియు ఇరిగేషన్ డ్యామ్, ఉత్తరాఖండ్‌లోని ఎంహెచ్ఏఐ , న్యూఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, ఇందిరా పర్యవరణ్ భవన్, న్యూ ఢిల్లీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి కీలక ప్రాజెక్ట్ కేంద్రాలు, మెట్రో రైల్ కార్పొరేషన్, తాజ్ మహల్ ను శిక్షణలో పాల్గొంటున్న అధికారులు సందర్శిస్తారు. విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఇంతవరకు తమ సంస్థ 17 దేశాలకు చెందిన అధికారులకు శిక్షణ ఇచ్చిందని ఆయన తెలియజేశారు.

 అసోసియేట్ ప్రొఫెసర్, కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్డాక్టర్ బి.ఎస్ బిష్ట్, అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ శర్మ, నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ట్రైనింగ్ అసిస్టెంట్ శ్రీ బ్రిజేష్ బిష్త్ పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుంది. 

 

***


(Release ID: 2019897) Visitor Counter : 101