రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గుజరాత్ కోస్తా తీరానికి సమీపం లో ఐఎఫ్‌బి సెంట్ఫ్రాన్సిస్ లో తల కు దెబ్బ తగిలి బాధ పడుతున్న మత్స్యకారుడి ని కాపాడిన ఐసిజి

Posted On: 02 MAY 2024 5:17PM by PIB Hyderabad

తల కు తీవ్రమైన గాయమై విలవిలలాడుతున్న ఒక మత్స్యకారుడి ని కాపాడేందుకు భారతీయ కోస్తా తీర రక్షక దళం (ఐసిజి) సాహసం తో కూడినటువంటి రాత్రి పూట రక్షణ సంబంధి కార్యకలాపాన్ని విజయవంతం గా అమలు పరచింది. గుజరాత్ లోని వెరావల్ కు సుమారు 130 కిలో మీటర్ ల పశ్చిమ దిశ లో గడచిన 2024 మే నెల 1 వ తేదీ నాటి రాత్రి సముద్రం లో ఏర్పడ్డ కల్లోల స్థితి కారణం గా జాలరి ఒకరు చేపలు పట్టే భారతీయ పడవ (ఐఎఫ్‌బి) సెంట్ ఫ్రాన్సిస్ లో తీవ్రం గా పడిపోయాడు. దీంతో అతడి తల కు పెద్ద దెబ్బ తగిలింది.

 

 

ఆపద లో ఉన్నామని, రక్షించాలని వెరావల్ లో గల కోస్ట్ గార్డ్ మేరిటైమ్ రెస్క్ యూ సబ్ సెంటర్ నుండి ఒక సందేశం (కాల్) ఐసిజి కి అందింది. దీనికి ఆ వేళ పర్యవేక్షణ బాధ్యతల లో ఉన్నటువంటి ఐసిజి నౌక సి-153 వెనువెంటనే స్పందించి మెడికల్ ఇవైక్యుయేశన్ లో సాయపడడం కోసమని తన దారి ని మళ్ళించుకొంది. గాయపడ్డ జాలరి ని ఐఎఫ్‌బి సెంట్ ఫ్రాన్సిస్ నుండి విజయవంతం గా బయటకు తీసుకు వచ్చి, అతడిని శీఘ్రం గా తదుపరి వైద్య చికిత్స కోసం వెరావల్ లో ఒక చికిత్స సదుపాయాని కి మార్చింది.

 

 

ఈ రక్షణ కార్యకలాపం సముద్ర ఉపరితలం మీద అడుగిడిన మనుషుల యొక్క విలువైన ప్రాణాల ను కాపాడాలి అనేటటువంటి, సముద్ర జలాల్లో ప్రవేశించే అందరి సురక్ష కు పూచీ పడాలి అనేటటువంటి మరియు తన ఆదర్శ వాక్యం అయిన ‘‘వీ ప్రొటెక్ట్’’ లేదా ‘‘వయమ్ రక్షామ:’’ పట్ల నిష్ఠ తో ఉండాలనేటటువంటి ఐసిజి యొక్క నిబద్ధత ను ప్రముఖం గా ప్రకటిస్తున్నది.

 

 

 

**


(Release ID: 2019703) Visitor Counter : 64


Read this release in: English , Urdu , Hindi , Tamil