ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

(i) ‘7.33 శాతం గవర్నమెంట్ సెక్యూరిటీ (జిఎస్) 2026’, (ii) ‘7.23 శాతం జిఎస్ 2039’ మరియు (iii) ‘7.34 శాతం జిఎస్ 2064’ ల అమ్మకం (రి-ఇశ్యూ) కోసం వేలం పాట 

Posted On: 29 APR 2024 6:44PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం (జిఒఐ) (i) ధర ఆధారిత వేలం, వివిధ ధరల పద్ధతి యొక్క మాధ్యం ద్వారా 6,000 కోట్ల రూపాయల (నామినల్) నోటిఫై చేసిన సొమ్ము కోసం ‘‘7.33 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ 2026’’ , (ii) ధర ఆధారిత వేలం, వివిధ ధరల పద్ధతి యొక్క మాధ్యం ద్వారా 10,000 కోట్ల రూపాయల (నామినల్) నోటిఫై చేసిన సొమ్ము కోసం ‘‘7.23 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ 2039’’ మరియు (iii) ధర ఆధారిత వేలం, వివిధ ధరల పద్ధతి యొక్క మాధ్యం ద్వారా ‘‘7.34 శాతం శాతం ప్రభుత్వ సెక్యూరిటీ 2064’’ ల విక్రయం (తిరిగి జారీ) జరుగుతుందని ప్రకటించింది. పైన పేర్కొన్న ప్రతి ఒక్క హామీపత్రం విభాగం లో 2,000 కోట్ల రూపాయల వరకు అదనపు సబ్‌స్క్రిప్శను ను అట్టిపెట్టుకొనే ఐచ్ఛికం భారత ప్రభుత్వానికి (జిఒఐ) ఉంటుంది. ఈ వేలం పాటల ను ముంబయి, ఫోర్ట్ ప్రాంతం లో గల భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ముంబయి కార్యాలయం లో 2024 మే నెల 3 వ తేదీ న (శుక్రవారం) నిర్వహించడం జరుగుతుంది.

 

హామీపత్రాల అమ్మకం తాలూకు నోటిఫై చేసిన రాశి లో 5 శాతం వరకు సొమ్ము ను ప్రభుత్వ హామీపత్రాల యొక్క వేలం లో నాన్-కంపెటిటివ్ బిడింగ్ ఫెసిలిటి స్కీము ప్రకారం అర్హత కలిగిన వ్యక్తుల కు మరియు సంస్థల కు కేటాయించడం జరుగుతుంది.

 

 

వేలం కోసం పోటీ ఉండేటటువంటి తరహా బిడ్ లను మరియు పోటీ కి తావు ఉండనటువంటి తరహా బిడ్ లను ఈ రెండు రకాల బిడ్ లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బేంకింగ్ సాల్యూశన్ (ఇ-కుబేర్) సిస్టమ్ లో ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో 2024 మే నెల 3 వ తేదీ న దాఖలు చేయవలసి ఉంటుంది. పోటీ కి తావు ఉండనటువంటి బిడ్ లను ఉదయం పూట 10 గంటల 30 నిమిషాలు మొదలుకొని ఉదయం 11 గంటల కాలం మధ్య లో దాఖలు చేయాలి; పోటీ ఉండేటటువంటి బిడ్ లను ఉదయం పూట 10 గంటల 30 నిమిషాలు మొదలుకొని ఉదయం పూట 11 గంటల 30 నిమిషాల కాలం లోపల దాఖలు చేయవలసి ఉంటుంది.

 

 

వేలం ల తాలూకు ఫలితాలను 2024 మే నెల 3 వ తేదీ (శుక్రవారం) నాడు ప్రకటించడం జరుగుతుంది. మరి, విజేతలు గా నిలచిన బిడ్డర్ లు 2024 మే నెల 6 వ తేదీ (సోమవారం) చెల్లింపు ను జరపవలసి ఉంటుంది.

 

 

ఈ హామీపత్రాలు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా కాలానుగుణం గా సవరణల కు లోబడి ఉండేటటువంటి 2018 జులై 2024 వ తేదీ న జారీ అయిన సర్క్యులర్ సంఖ్య: ఆర్‌బిఐ/2018-19/25 ప్రకారం ‘‘కేంద్ర ప్రభుత్వం యొక్క సెక్యూరిటీల లో ఏ రోజు న జారీ అయ్యాయి అనే లావాదేవీల కు సంబంధించిన మార్గదర్శక సూత్రాల కు అనుగుణం గా ‘‘జారీ అయిన కాలం’’ విభాగం లో ట్రేడింగు కు అర్హం అవుతాయి.

 

 

***


(Release ID: 2019163)